అక్షర

ముగ్గురు విజేతల కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘డార్విన్- బుద్ధుడు- అంబేద్కర్’’
డా.కత్తి పద్మారావు,
లోకాయత ప్రచురణలు;
వెల: రు.500/-, పేజీలు: 393,
ప్రతులకు: అన్ని ముఖ్య పుస్తక కేంద్రాలు.
**

ప్రపంచ విజేతలు అంటే సామాన్య ప్రజానీకంలో కానీ, చారిత్రాత్మక దృష్టిలో కాని స్థిరపడిన అభిప్రాయాలు వేరు. దానికి భిన్నంగా రచయిత- తాము కనుక్కున్న సిద్ధాంతాలు తర్వాత కాలంలో మనుషుల మీద చూపిన ప్రభావాల ఆధారంగా డార్విన్, బుద్ధుడు, అంబేద్కర్‌లను ప్రపంచ విజేతలుగా అభివర్ణించి, వారి వ్యక్తిత్వ నిర్మాణం గురించి వివరించడానికి పూనుకున్నారు. అంబేద్కర్ ఎప్పుడు, ఎలా ప్రపంచ విజేత అయ్యాడని కుశ్శంకలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన మనసులు గెలుచుకున్నవాడు ప్రపంచ విజేత కాక ఏమవుతాడు? డార్విన్, బుద్ధుడు, అంబేద్కర్ ఈ ముగ్గురు ప్రపంచాన్ని మార్చే సూత్రాలను కనిపెట్టారు. ప్రపంచం వీరి సూత్రాలవల్ల ఎంతో మార్పు చెందింది. వీరు వ్యక్తులనేకాక దేశాలను, వివిధ ఖండాలను మార్చిన మేధావులు. డార్విన్ పరిశోధనలే లేకపోతే ప్రపంచం వైజ్ఞానిక ప్రగతి లేక, మానవ పరిణామానికి మూలం తెలియక అంధకారంలో వుండేది. బుద్ధుడు లేకపోతే ప్రపంచం కరుణ, ప్రేమ, ప్రజ్ఞలను గుర్తించలేక రక్తసిక్తమయి వుండేది. మనిషిలో దాగున్న కరుణ హృదయాన్ని బుద్ధుడు వెలికితీశాడు. ప్రపంచాన్ని ఆయన ప్రేమమయం చేశాడు. అలాగే డాక్టర్ అంబేద్కర్ సామాజిక, మానవ శాస్త్రాల్లో చేసిన పరిశోధనలు అద్వితీయమైనవి. ఈ మధ్యలో అశోకుని వ్యక్తిత్వమూ చర్చించబడుతుంది. మహానటి సావిత్రి కథ కూడా మధ్యలో వస్తుంది. ఇంకా ఎన్నో విషయాలు చర్చించడం కనిపిస్తుంది. వీరి వ్యక్తిత్వాలతోపాటు అసలు మనిషి సమకాలీన సమాజంలో ఎలా జీవించాలి. వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో వివరిస్తూ ఎంతోమంది మానసిక శాస్తవ్రేత్తలను, వారి అభిప్రాయాలను ఉటంకిస్తూపోయారు.
రచయిత తాము రాయబోయే అంశానికి తగిన ప్రణాళిక ఏర్పరచుకోకుండా తమకు తెలిసిన, తమకు తోచిన విషయాలన్నింటిని ఏకరువుపెడుతూ పోవడంవలన సందర్భశుద్ధి లేకుండా, అనేకానేక విషయాలు అడ్డుతగిలి పాఠకుడ్ని గందరగోళానికి గురిచేసే ప్రమాదముంది. నిజానికి ఈ పుస్తకాన్ని ‘‘వ్యక్తిత్వ నిర్మాణం’’. ‘‘డార్విన్, బుద్ధుడు, అంబేద్కర్’’గా విడదీసి రెండు పుస్తకాలుగా తయారుచేస్తే బాగుండేది. ఇందులో పేరాలకుపేరాలు ఇంగ్లీషును గుమ్మరించడం కంటే, వాటి సారాంశాన్ని తెలుగులో ఇస్తేనే పాఠకులకు ప్రయోజనకరంగా వుండేది.

-కె.పి.అశోక్‌కుమార్