అక్షర

హేతువాదంపై చిరుపొత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శూద్రులకు
సుద్దులు’
పెందుర్తి శంకరరావు
వెల ఇవ్వలేదు
పేజీలు: 68
ప్రతులకు: pendurtisankararao@ gmail.com
**
ప్రజలను దోపిడీ చేయడానికి, బానిసత్వంలో ఉంచడానికి పాలకులు మతాన్ని ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకున్నారు. ప్రజలు అజ్ఞానంలో నుండి, మత వ్ఢ్యౌంలో నుండి బయటపడటానికి హేతువాదాన్ని అలవరుచుకోవాలి. దానికి విద్య అవసరము. విద్యవలన విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. దీన్ని విశ్వసించిన పెందుర్తి శంకరరావు-ముందుగా విశాల విశ్వాన్ని, సౌర వ్యవస్థను, భూమి పరిణామ దశలను, మానవుని పుట్టుకను, విస్తరించిన నాగరికతల గురించి తెలియజేసారు. భారత దేశంలోని సింధు నాగరికతా కర్తలు ద్రావిడులని, ఆర్యులు వచ్చి వారిని దక్షిణాదికి తరిమేశారనీ, ఆర్య సంస్కృతిలో భాగంగా వేదాలు, వర్ణ వ్యవస్థ, మత సాహిత్యం విస్తరించి ప్రజలలో అసమానతలను, వివక్షను పెంచి పోషించాయని రచయిత విశ్వసిస్తున్నారు. విద్యనార్జించి, విజ్ఞానం పెంచుకుని ఈ మానసిక బానిసత్వంనుండి, మత వ్ఢ్యౌం నుండి బయటపడాలని రచయిత పిలుపునిస్తున్నారు. ఇందులో ఉన్న విషయాలన్నీ తెలిసినవే అయినప్పటికీ వాటిని క్లుప్తంగా అందచేయడం బాగానే ఉంది. కానీ దీనికి ‘శూద్రులకు సుద్దులు’ అనే పేరు ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. ఇవి శూద్రులే కాదు, అందరూ తెలుసుకోదగ్గవి.