అక్షర

మధ్యతరగతి భావాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాత్పర్యం
రామాచంద్రవౌళి కథలు
పేజీలు: 200+,
వెల: రూ.150/-
ప్రతులకు: రచయిత, 11-24-498,
పోచమ్మ మైదాన్, వరంగల్.
9390109993, 9642276969
**
రామా చంద్రవౌళి పేరున్న కవి-కథకుడు. ఈయన కథలు ఇప్పటికే సంపుటాలుగా వచ్చాయి. చివరిది 2014లో వచ్చింది. అంటే ఆ తరువాతి సంవత్సరాలలో వచ్చిన కథలు ప్రస్తుత సంపుటంగా వచ్చినట్టు చెప్పుకోవాలి. ఇందులో మొత్తం 20 కథలున్నాయి. అవన్నీ నవ్య, చినుకు, స్వాతి లాంటి అచ్చు పత్రికలలో, మాలిక, సారంగ వంటి వెబ్ పత్రికలలో వచ్చాయి. కొన్ని బహుమతులు కూడా పొందాయి.
కథాసంకలనాలతో ఒక పెద్ద చిక్కు ఉంది. ఈ కథలను దేనికదిగా, మిగతా రచయితల మిగతా కథల మధ్యన చదివితే, కలిగే భావం, వరుసబెట్టి సంకలనంలో చదివితే కలగదు. మూడవ కథతో, కథకన్నా బలంగా కథకులు కనిపించడం మొదలవుతుంది. మాటలు, ఆలోచనలు, కథాంశాలు, శిల్పం మొదలయినవన్నీ కథకన్నా బలంగా ముందుకు వచ్చి, పాఠకులను పక్కదారి పట్టిస్తాయి కానీ అవికూడా ఒక ముఖ్యమయిన దారి!
ఈ పుస్తకంలో దృష్టినిబట్టి దృశ్యం అని ఓ కథ ఉంది. అది 117వ పేజీతో మొదలవుతుంది. అంతకుముందే 59వ పేజీలో దృష్టి అని ఇంకొక కథను మనం చదివి ఉంటాము. వరుసబెట్టి చదివే పద్ధతి ఉంటేనే లెండి దృష్టిలో ఒక డాక్టర్ వేన్‌డయ్యర్ పుస్తకం చదువుతుంటాడు. ఈ సంకలనంలోని చాలా కథలలో పుస్తకాల ప్రసక్తి ఉంటుంది. గొప్ప గొప్ప పుస్తకాలు, పాత్రలకన్నా బలంగా ఎదురవుతాయి. దృష్టిలో డాక్టర్ నరేందర్ హోటల్ కార్మికుని కొడుకు. (హోటేలు అనాలేమో?) ఆదర్శ వైద్యుడయ్యాడు. ఇక 117వ పేజీ కథలో ఒక గైనకాలజిస్ట్. విజిటింగ్ ప్రొఫెసర్. అయిదు కార్పొరేట్ ఆసుపత్రుల్లో విజిటింగ్ డాక్టర్. అంటే ఆవిడ వయసు ఎంత ఉండవచ్చు? ఊహించండి! ఆమెకు అప్పుడు మొదటి కొడుకు పుడతాడు. భర్త పెద్ద వ్యాపారవేత్త. చాలా కథలలోని పాత్రల లాగే విమానాల్లో బతుకుతుంటాడు. బాబు పెంపకం బాధ్యత తాతగారి మీద, అంటే తల్లిగారి తండ్రి మీద పడుతుంది. పేరుపెట్టడం మొదలు అంతా పెద్దాయన నిర్ణయం ప్రకారమే. ఆయనేమో పాతకాలం మనిషి. మనవనికి హనుమ అని పేరుపెడతాడు. హనుమ పెరుగుతాడు. ‘నేను హీరోనయ్యాను. నీవూ అలాగే ఉండాలి’ అంటాడు తండ్రి. ఆ కొడుకు అప్పుడు అమ్మానాన్న సంపాదించిన ఆస్తిమీద ఆధారపడతాడా? మరేదయినా చేస్తాడా? మనకు అర్ధంగాకుంటే, అర్ధం ఏమిటి? ఎండ్రోక్రోనాలజీ ఉండదు. (ఆండ్రాలజీ ఉంటుంది. ఎండోక్రిక్రైనాలజీ ఉంటుంది).
హనుమ కథ తరువాత ‘అమ్మ గది’ అని కథ ఉంది. అందులో అమ్మపోతుంది. భార్య ఆ ఖాళీలోకి దూరుతుంది. (దశదిన ఖర్మ కాదు కర్మ)
కథలను ఒక్కొక్కటిగా చదివితే, ఎలాగుండేదో మరి!
రచయిత మధ్యతరగతి మనిషి. కష్టపడి చదువుకున్నాడు. చదువుపట్ల గొప్ప గౌరవం ఉంది. అందరూ చదువుకుని తనలాగ బాగుపడాలని అనుకుంటారు. పరిశీలించిన జీవితంతోబాటు ఊహించిన సంగతులను కూడా ఆధారంగా చక్కని కథలు సృష్టిస్తాడు. చదివిస్తాడు బహుమతి కూడా అందుకుంటాడు. ఇక్కడ మనకు సామగ్రిని మించిన శిల్పం ఎదురవుతుంది.
ఈ రచయిత స్వయంగా కవి. కనుక కథల్లో కవితాధోరణి తప్పకుండా, బలంగా ముందుకు వస్తుంది. ‘కొండలే రగిలే, వడగాలీ... నీ సిగలో పూలే నోయ్!’ (పువ్వేలోయ్ కాదు) ఇతను చాలా పుస్తకాలు చదివాడు. వాటన్నింటినుంచి, వాటి గురించీ వ్యాఖ్యానాలు కథలకు బరువును అందిస్తాయి.
గొప్ప విషయం ఏమిటంటే, కథలను చదవకుండా మాత్రం ఉండలేము.
మన జీవిత చక్రానికి ఆరు స్పోక్స్. (అవునుమరి. వాటిని ఆకులు అంటారని తెలియొద్దూ?) అవి కుటుంబం, ఆర్థికం, భౌతికం, మానసికం, సామాజికం, ఆధ్యాత్మికం! పుస్తకంనిండా చక్కని ఫిలాసఫీ పాఠాలు ఫ్రీగా! కథను కేవలం కథగా చెప్పడం ఒక పద్ధతి. రచయిత పూనుకుని, మన ఆలోచనలను నడిపించి, చదివించడం మరో పద్ధతి!

-కె.బి.గోపాలం