అక్షర

యువతకు ప్రేరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయానికి దారిది
-డాక్టర్ సి వీరేందర్
ధర : రూ.150
పేజీలు: 160
ప్రతులకు: లైఫ్ సిలబస్
పబ్లికేషన్స్
హెచ్‌ఐజి -2, బ్లాక్ -5, ఫ్లాట్ నెంబర్ 4
బాగ్‌లింగంపల్లి,
హైదరాబాద్
**
ప్రపంచవ్యాప్తం గా వ్యక్తిత్వ వికాసం, వ్యక్తి పురోభివృద్ధిపై లక్షలాది పుస్తకాలు వస్తున్నాయి. గత దశకంగా తెలుగులోనూ విపరీతంగా అనువాదాలు, ప్రత్యక్ష రచనలు వస్తున్నాయి. ఎప్పటికపుడు సమాజంలో మార్పు లు, తాజా ఉదాహరణలను తీసుకుని పుస్తకాలు రాయడంలో ఇద్దరు ముగ్గురు రచయితలదే అందె వేసిన చేయి, అందులో అందులో ఒకరు డాక్టర్ సి వీరేందర్, పేరుకు అధ్యాపకుడే అయినా సైకాలజీ స్కానింగ్ నిపుణుడు. నేటి తరానికి కావల్సిందేమిటో గుర్తించిన వాడు, వేగంగా ఎలా మార్పు చెందాలో కొద్ది మాటల్లో చెప్పి, లక్ష్యాలను సాధించే నేర్పు ఓర్పు ఉన్నవాడు. వేలాది మందికి కౌనె్సలింగ్ చేసిన వాడు. ఇన్ని అర్హతలతో రాసిన పుస్తకమే విజయానికి దారిది..పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు దిక్సూచి ఈ పుస్తకం. దేశ విదేశాల్లోని విద్యార్ధులు, యువజనుల సమస్యలను అధ్యయనం చేసి ఆధునిక మనస్తత్వ శాస్త్ర మెళుకువల ఆధారంగా వాటి పరిష్కారానికి అవసరమైన విధానాలను అభివృద్ధి చేశారు. యు అండ్ మి పేరిట హైదరాబాద్‌లో సైకాలజీ కౌనె్సలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి కౌన్సిలింగ్ చేస్తున్న రచయిత వీరేందర్. లక్ష్యసాధనానే్వషణలో ఉన్న యువతకు ప్రేరణ కలిగించడం, వ్యక్తి పురోభివృద్ధికి తోడ్పడేందుకు ఉద్దేశించిన పుస్తకం ఇది. పోటీ పరీక్షలకు హాజరవుతున్న వారికి వీలైనంత తక్కువ పదాలతో గరిష్టప్రయోజనాన్ని పొందేలా రాశారు. 160 పేజీలున్న ఈ పుస్తకంలో ఆరు విభాగాలున్నాయి. ప్రేరణ, నమ్మకం, స్వీయాభిమానం, లక్ష్యనిర్దేశం, అభ్యసన నైపుణ్యం, ఒత్తిడి ఎదుర్కోవడం అనే అంశాలపై ఈ పుస్తకం సాగుతుంది.