అక్షరాలోచన

శ్రమైక జీవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కష్టపడటం మాత్రమే తెలిసిన అతని కళ్ళు
అందమైన అనేక దృశ్యాలను అల్లుతున్నాయ
చెడు దృశ్యాలను స్పష్టంగా వేరుచేస్తున్నాయ
ఎంతో చురుగ్గా ఉన్న అతని మెదడు
భీతావహ దృశ్యాల ముగింపులను
సుందర దృశ్యాలతో సంధానిస్తున్నాయ
అతని దృఢమైన ఊపిరితిత్తులు
గుండె చప్పుళ్ళ నేతపనిలో మునిగివున్నాయ
బాగా జాగృతంగా ఉన్న అతని ముక్కు
రానున్న సుగంధం కోసం లెక్కలు వేసుకుంటున్నది
అతని రెండు బలిష్ఠమైన చేతులు
అతని పగటి కష్టాలను
రాత్రి చిరునవ్వులతో అనుసంధానింపజేస్తున్నాయ
కష్టపడటం మాత్రమే తెలిసిన అతని కాళ్ళు
అతని బతుక్కీ, చావుకీ మధ్య దూరాన్ని
బలంగా కొలుస్తున్నాయ
*
- హిందీ మూలం : శివకుటీలాల్ వర్మ
- తెలుగు అనువాదం : నలిమెల భాస్కర్