అక్షర

‘నాకు నేనే ఉదాహరణ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూరప్‌లో
నలభై ఏళ్ల మనుగడ
(అనుభవాలు-జ్ఞాపకాలు)
డా.ప్రయాగ మురళీ మోహన కృష్ణ
వెల: రు.100/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో

రాయప్రోలు సుబ్బారావు ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా/ ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన/పొగడరా నీ తల్లి భూమి భారతిని/నిలుపరా నీ జాతి నిండుగౌరవము’-ఈ గేయ భాగంలోని ప్రబోధాత్మక భావాలు త్రికరణ శుద్ధితో ఆచరించగా ఈ గ్రంథం రూపుదాల్చినట్టు తోస్తుంది. ‘నాకు నేనే ఒక ఉదాహరణ. మా పూర్వీకులు వైదిక ధర్మానికి, ధర్మ పరిపాలనకు కట్టుబడి వుండేలా చేశారు’ అంటారు రచయిత డా.ప్రయాగ మురళీమోహన కృష్ణ. వైద్య శాస్త్రంలో స్నాతకోత్తర పట్టం పొందిన తర్వాత ఎనస్థటిషీగా ప్రభుత్వ వైద్యశాలలో నియమితులయ్యారు. ఆయనకు విదేశాలకు వెళ్లాలని, కొత్త విషయాలు అధ్యయనం చేయాలని తీవ్ర కాంక్ష. ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించారు. తల్లి, భార్య సమ్మతి పొందారు. మద్యం, మాంసం ముట్టనని వాగ్దానం చేసిన తర్వాతే తల్లి అంగీకరించింది. ఉద్యోగంతోపాటు ప్రయాణం ఖర్చులు కూడా ఇచ్చే దేశమైతే ఆర్థిక సౌలభ్యం చేకూరుతుందని డా.మోహనకృష్ణ భావించడం వల్ల వేచి చూడవలసి వచ్చింది. నిరీక్షణ ఫలించింది. ట్రినిడాడ్ నుంచి అలాంటి అవకాశం లభించింది. భార్య, పిల్లల ప్రయాణం ఖర్చు ఇస్తామన్నారు. అలా నర్సన్నపేట గ్రామ వాసికి సుదీర్ఘంగా విదేశాలలో వెద్యుడుకి సేవలందించే అవకాశం చేకూరింది.
సర్వసామాన్యంగా విదేశాలకు వెళ్లి వచ్చిన వారు అక్కడి దర్శనీయ స్థలాలు, ప్రకృతి దృశ్యాలు, వింతలు, విశేషాలు, ప్రజల అభిరుచులు, అలవాట్లు, కళలు, ఆహారం, భౌగోళిక వివరాల వంటివి పరిశీలించో, కరపత్రాలనుంచి సేకరించో గ్రంథస్థం చేయడం కద్దు. ‘యూరప్‌లో నా నలభై ఏళ్ల మనుగడ (అనుభవాలు-జ్ఞాపకాలు) ఇందుకు పూర్తిగా భిన్నమైనది. ఈ గ్రంథంలో ప్రధానంగా దేశభక్తి, భారతీయత, హిందుత్వం, సంప్రదాయం, తల్లిప్రేమ, మైత్రీ బంధం, మాతృభాషాభిమానం, ప్రేమాదరాలు, సత్సంగం, ఆత్మీయత, పరోపకారం, వైద్య నైపుణ్యాన్ని మున్నగు వారికి స్థానం కల్పించారు. ట్రినిడాడ్ తర్వాత ఇంగ్లండ్, ఐర్లాండ్, డెన్మార్క్, నార్వే దేశాలలో పనిచేసి అందరి మన్ననలు అందుకున్నారు. పెక్కు యూరప్ దేశాలు సందర్శించారు. ట్రినిడాడ్ భారతీయుల్ని గురించి ఇలా అన్నారు. ‘‘అహంకార పూరితమైన పాశ్చాత్య విదేశీయ వాతావరణం, ఆధిపత్యం, నిరాదరం, ఏహ్యతలకు తలొగ్గకుండా తమ ప్రత్యేకతను నిలుపుకున్న ట్రినిడాడ్ హిందువులకు జోహార్లు అని చెప్పక తప్పదు’’. సొంత కారు కొనుక్కున్నప్పుడు ‘ఇదంతా అమ్మ చలవ’గా భావించారు. ఇంగ్లాండ్‌లో తాను చూసిన భారతీయుల వైఖరిపై ఆయన వేదన: ‘‘ఇంత స్వాభిమానం లేకుండా చావచచ్చిన మనిషిలా, స్వజాతి గౌరవాన్ని మంటగలుపుతున్న మన వాళ్ల మనుగడలో స్వార్ధం, అవకాశవాదం, లేమితనం, గుడ్డిగా అనుకరించడం-వంటి సాంఘిక పరిణామాలు నన్ను కలిచివేశాయి’’ ఇంగ్లండ్ వారి బోధనా చాతుర్యం మాత్రం ప్రశంసించారు. ఐర్లాండ్ గురించి రచయిత భావన: ‘‘మనదేశంలోలాగానే విద్య, వినయం, శ్రద్ధలకు ఐరిష్‌వారు ఎంతో ప్రాముఖ్యం ఇస్తారు. విద్యా విధానానికి కేథలిక్ మత సంస్థల అధీనమే ముఖ్య కారణం.’’నార్వే ప్రభుత్వం రచయిత వైద్య సంబంధిత పరిశోధనకు రెండున్నర లక్షల క్రోనార్లు (48 వేల డాలర్లు) గ్రాంటుగా ఇవ్వడం ఆయన ప్రతిభకు నిదర్శనం.
మాతృభాష ప్రాముఖ్యతను ఇలా తెలియజేసారు. ‘‘అమ్మా నాన్న అని అనడంలోని దగ్గరతనం మమీ డాడీ సంబోధనలో ఉండదు. ఎందుకంటే ఏ మాటకైనా, చేతకైనా మనలోని జన్యువులు స్పందిస్తాయి’’. తాత్త్విక చింతన చాలాచోట్ల కనిపిస్తుంది. ఒక సందర్భంలో ‘‘అందు సమర్పించే ఆరాధనా నమస్కారాలు ఆ కేశవుడికే చెందుతాయి. ఏ పేరు పెట్టి నమస్కరించినా ఆ భగవానుడికే చేరతాయి’’ అని విశదీకరిస్తారు. సన్నిహిత మిత్రుడికి చెబుతున్న రీతిలో రచన సాగింది. గ్రంథంలో పొందుపరిచిన విషయాలు అందరికీ స్ఫూర్తిమంతంగా నిలుస్తాయి.

-జిఆర్కే