అక్షర

‘రస సిద్ధాంతం - మనోవిజ్ఞానం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రస సిద్ధాంతం
మనోవిజ్ఞానం
-డా.బొద్దుల వేంకటేశం
వెల: రూ.155/-
ప్రతులకు: శ్రీ బాలాజీ ప్రింటింగ్ ప్రెస్
తిలక్ రోడ్,
కరీంనగర్
9247353577

రసము మనః ప్రకాశ పద రమ్యము అని అన్నారు పూర్వులు. కావ్యంలో, నాట్యంలో రసాదుల అభివ్యక్తి వల్ల సహృదయుని మనస్సుకు ఒక ప్రకాశం, దీప్తి కలుగుతుంది. అంటే సహృదయుడు తన వైయక్తిక పరిమితుల నుండి ఉదయించి సార్వజనీన జీవన అనుభవాన్ని పొందుతాడు. ఒక పక్షి పరిమితమైన తన గూటిలో నుండి బయటపడి రెక్కలు విప్పుకుంటూ గగనతల విహారం చేసిన విస్తృతానుభవాన్ని పొందుతుంది. అదే రసానుభవ స్థితి. దీనినే అభినవ గుప్తుడు సాధారణీకరణం అన్నాడు.
రసమునకు మనశ్శాస్త్రానికీ విడదీయరాని సంబంధం ఏర్పడుతున్నది. ఈ వ్యవహారంలో ప్రధాన భాగం మనస్సులో ఏర్పడే వందలాది సంచారీ భావములకు ఇహలోకానికి నడిమి సంబంధం వల్ల ఏర్పడే అంశమే. మానవునికి సహజమైన సత్త్వ రజ స్తమో గుణాల ప్రాబల్యం వ్యక్తి వ్యక్తినిబట్టి మారుతూ ప్రవ్యక్తమవుతుంది. ఈ అంశాలను ప్రస్తావిస్తూ డా.బొద్దుల తెలుగులో మొట్టమొదటిసారిగా ‘రస సిద్ధాంతం - మనోవిజ్ఞానం’ అనే గ్రంథాన్ని రచించారు.