అక్షర

అనైతిక సంబంధాలూ... బలహీనతల తీరాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దూర తీరాలు (నవల)
రచయిత్రి: దాసరి శిరీష
వెల: రు.120/-
కాపీలకు: ప్రముఖ
పుస్తకాలయాలు.
ఈబుక్: కినిగె.కాం
**
ఒక వ్యక్తి, ఆ వ్యక్తి చుట్టూ వుండే బంధు మిత్రులు సుఖమూ, శాంతితో ఉండగలగడానికి సమాజం ఎన్నో కట్టుబాట్లను, నిబంధనలను విధించింది. ఈ నిబంధనలు కాల ప్రవాహానికి కొట్టుకుపోకుండా ఇంకా నిలిచి ఉండడం వీటి అవసరాన్ని చాటి చెప్పుతాయి. అయితే అప్పుడప్పుడు కొందరు తమ వ్యక్తిగత తాత్కాలిక సుఖాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నియమాల్ని ఉల్లంఘిస్తారు. తాత్కాలిక సుఖం, దాని గురించిన వెంపర్లాటలో తమకు తాను హాని కలిగించుకోవడమే కాకుండా తమ చుట్టూ అల్లుకుపోయిన బంధువులకు, బంధుత్వాలకు అన్యాయం చేస్తారు. ఇందువల్ల ఆ వ్యక్తికీ, ఆ వ్యక్తి కక్ష్యలో పరిభ్రమించే వారికీ ఇబ్బందులు ఎదురవుతాయి.
అలాంటి ఇబ్బందుల్ని ఏకరువుపెట్టేదే.. ఈ నవల ‘దూర తీరాలు’
ఆహార నిద్రా మైధునాలు వ్యక్తిగతమైన సహజావసరాలు. ఇందులో మొదటి రెండు అచ్చంగా వ్యక్తిగతమైనవి కాగా మూడవ అవసరానికి మరో ఆపోజిట్ సెక్స్ వ్యక్తి అవసరం ఉంటుంది. సమాజం నియమించిన పరిధిలోనే ఈ అవసరం తీర్చుకుంటేనే ఆ ఇద్దరికీ సుఖము, శాంతి అని చెప్పే నవల ‘దూర తీరాలు’
లెక్చరర్ రాజు అడపా తడపా కథలు రాస్తూ ఉంటాడు. భార్య సంధ్య కూడా ఉద్యోగిని. ఇద్దరు పిల్లలు. ఒడుదుడుకులు లేకుండా, నల్లేరు మీద నడకలా సాగిపోయే వారి కుటుంబంలో తుపాను రేగుతుంది. సుమిత్ర అనే విద్యార్థినితో భర్త రాజుకు శారీరక సంబంధం ఉందని సంధ్యకు తెలుస్తుంది.
నిరాశ్రయురాలైన సుమిత్రను సంస్కరిద్దామన్న పెద్ద మనసుతో, సంధ్య తన ఇంట ఉండనిస్తుంది. నివురు గప్పిన నిప్పులా సుమిత్ర రాజు దంపతుల జీవితాన్ని, ముఖ్యంగా సంధ్య జీవితాన్ని ఎలా ఛిన్నాభిన్నం చేసిందీ...గొప్ప సంఘర్షణకు లోనై, చివరకు సంధ్య సుమిత్రను తమ కుటుంబానికి ఎలా దూరంగా వుంచుతుందో తెలుపుతుంది ఈ నవల. సుమిత్ర వ్యామోహం లోంచి బయటపడ్డ రాజు, సంధ్యలు ఉద్యోగరీత్యా వేర్వేరు చోట్ల పనిచేయాల్సి వస్తుంది. అక్కడ కూడా తన భర్త రాజు రమణ అనే యువతితో సంబంధం నెరపుతున్నాడని తెలిసి హతాశురాలవుతుంది. మనసుకు కలిగిన గాయం తాత్కాలికమైన పైపూత లేపనాల వల్ల నయం అవదని, చికిత్స చేసుకుంటున్నామనే భ్రమ మాత్రమే కలుగుతుందని తెలుసుకుంటుంది.
మనసు వికలమైన మగవాళ్లు అప్పుడప్పుడు తమ బాధల్ని మరిచిపోవడానికి తాగుతారని తెలిసిన సంధ్య తానూ తాగుతానంటూ భర్తను తెచ్చిపెట్టమంటుంది. రచయిత్రి లోకానికి ఇవ్వవల్సిన సందేశం కాదు ఇది. ఇంతకంటే దారుణం-్భర్త విస్మయానికి లోనవుతూ, పట్టుకు రావటానికి బయలుదేరటం! మరీ దారుణం! నవల ముగింపు వి
షయంలో రచయిత్రి ఇలా పాఠకులకు తప్పుడు సందేశం ఇవ్వడం భావ్యంగా లేదు.
ఈ నవలలో రవూఫ్ అనే సంధ్య సహ ఉద్యోగి సంధ్య అభిమాని. ఆరాధకుడు. సంధ్య రవూఫ్ కంటే పెద్దది. వివాహిత. అయినా వారిద్దరి మధ్య పరస్పర ఆరాధనో, ఆకర్షణో తెలియని భావం. సంధ్యతో ‘ఐ..లైక్..యూ...ఐ లవ్..యూ’ (పేజీ 172) చెప్పించడం ఎబ్బెట్టుగా వుంది. భర్త తనని ఏకాకిని చేస్తే..ఆశించే చేసే సాయం లాంటిదో...మరేదో ఆమెతో అలా చెప్పించిందేమో..కాని ఆమోదయోగ్యం అనిపించదు.
సమాజంలో మనుషుల ‘వెంపర్లాట’లు, అందులోంచి అవతలి వారికి కలిగిన ఒంటరి తనపు భావనలు, ఆలోచనలు, గాలి వానకు చెదిరి నేలన పడ్డ పూల తీగకు ఏ ఆలంబన దొరికితే దాన్ని అల్లుకుపోవాలన్న ఆలోచనలు, పురుషుల చాపల్యం, ఫీలింగ్స్ బాగానే చెప్పారనిపిస్తుంది.
రచయిత్రి ఈ నవలకు ‘దూర తీరాలు’ అని పెట్టడం..బహుశా..దూరం నుండి తీరం పచ్చగా నయనానందకరంగా కనిపించినా దగ్గరికి వెళ్తేకాని అక్కడ ఉన్న రాయి రప్ప కలుపు మొక్కలు పరాన్న భుక్కులు కనిపించవు అని చెప్పడానికి కాబోలు..
సుమారు పాతికేళ్ల క్రితం ఓ ప్రముఖ పత్రికలో సీరియల్‌గా ప్రచురితమైన ఈ నవలలోని పరిశీలనలు, కంక్లూజనులూ..ఈనాడు కూడా పరివ్యాప్తమై ఉండడం..రచయిత్రి ‘ముందు చూపు’ అనుకోవచ్చు.
వ్యక్తుల చపల చిత్తాల్నీ, బలహీనతల్నీ, నిర్వచనాలకి అందని మానవ లక్షణాల్నీ ఏకరువుపెట్టే నవల ఇది.
*

-కూర చిదంబరం