అక్షర

మనసుని తాకే అనుభూతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనోవీధి (కథలు)
దాసరి శిరీష,
వెల: రు.100/-,
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక విక్రేతలు
**
‘ప్రపంచంలో నువ్వొక్కడివే బాధితుడవనీ...నిన్ను మాత్రమే నిత్యం దుఃఖం వెన్నంటుతోందని అనుకోకు.సంతోషం అన్నది సాధన వల్లనే వస్తుంది. హటాత్తుగా రాదు’. ‘మనస్సు విహంగం రెక్కలు విదిలించుకున్నప్పుడు కదిలే కదలిక వింత బాధలో అవ్యక్తమైన మధురిమ’. ‘జీవించడం అనేది అద్భుతమైన, ఆనందకరమైన అనుభవం. దాన్ని వదలవద్దు’. ‘అసలు జీవితానికి అర్ధం ఏమిటి?’ సహజత్వాన్నీ సారాన్నీ కోల్పోతూ వేరే మనుషులుగా మారిపోవడం కాదు-ఇలాంటి గొప్ప వాక్యాల్ని కాచి వడపోసిన సత్యాన్ని బ్రతుకుమీద ఎంతో గొప్ప అవగాహన ఉంటే తప్ప వ్రాయలేరు. చలం, శరత్, కొడవటిగంటి లాంటి చైతన్యపరుల రచనల్ని చదివి ఒంట పట్టించుకుంటే తప్ప వ్రాయలేరు. ‘సాహిత్యం సమాజానికి దిక్సూచి’ అని త్రికరణ శుద్ధిగా నమ్మి కథా రచనలతో తనవంతు సందేశాన్ని ఇస్తున్న దాసరి శిరీష గారు ఎక్కువ చదువుతారు. తక్కువ రాస్తారు. అందుకే..వీరు 1980 నుండి 2010 వరకు మూడు దశాబ్దాల కాలంలో పదిహేను కథలు రచించారు. వీటిని ఇప్పుడు ‘మనోవీధి’ అన్న కథా సంకలనం పేరిట మన ముందుకు తెచ్చారు.
మానవ సంబంధాలన్నీ ఆర్థికం మాత్రమే అన్న భ్రమలో బతుకుతూ విచ్ఛిన్నమవుతూ, కుటుంబ సంబంధాల్ని, విలువల్ని విధ్వంసం చేసుకుంటూ చివరికి ఒంటరితనంలోకి నైరాశ్యంలోకి దిగజారిపోతున్న మనుషుల్నీ చూపుతారుూ కథలు. కోట్లు విలువ చేసే కాలేజీ స్థాపనలు, బంగళాలు, పరిశ్రమలు ఇవేవీ జీవితం కాదని, ఇన్ని ఉన్నా చివరకు ఆపదలో ఆదుకోగలిగేది రిక్షా లాగే కేశవులు అతని భార్య భాగ్యలక్ష్మి అని చెపుతారు రచయిత్రి. సామాజిక అంతరాలవల్ల పసిపాపలు ఎలా బలి అవుతారో ‘సమిధలు’లో చెప్పారు. ఈడేరిన పనిపిల్లను ఇంటి యజమాని, కొడుకూ వాడుకోవడం వల్ల ఎలా నిస్సహాయ స్థితిలోకి ఆ పిల్ల నెట్టబడుతుందో కళ్లకు కట్టినట్టు ఎంతో సహజంగా చిత్రీకరించారు. కొన్ని కథలు ప్రబోధాత్మకాలు అయితే, మరికొన్ని కొసమెరుపు కథలు. కథ, శిల్పం, శైలీ, ఎత్తుగడ పాఠకుడిని ఆకట్టుకుంటాయి. ఉత్కంఠను రేపుతాయి. ‘ఇంటిముందు నిలబడ్డ పిల్లల గుంపుని చూడగానే రజని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి’ అన్న వాక్యంతో ‘ఈ దేశంలో తల్లి’ మొదలవుతుంది. ఎందుకు? ఏమిటి? అన్న ప్రశ్నలు పాఠకుడు తనకు తాను వేసుకుని ముందుకు సాగుతాడు. సంకలనం నిండా ఇలాంటి ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తాయి.
‘శీలం శీలం అని మడిగట్టుకు కూర్చుంటే బతకలేం’ అని ‘మిస్టీరియస్ వాల్యూస్’లో భారతి అంటే పాఠకుడికి ఆమెమీద కోపం రాదు. సరికదా...‘నైతిక విలువలు’ అని ఆక్రోశించే బూర్జువాల విశే్లషణలు వెలవెలబోతాయి.
కథలన్నింటినీ,. ఏకబిగిన చదవకుండా, మధ్య మధ్య విరామంతో, స్వయం విశే్లషణతో ముందుకు సాగితే...మరిన్ని గొప్పగొప్ప అర్ధాలు స్ఫురించే కథలివి. అందుకే కాబోలు..సంకలనంలో ఇవ్వబడిన కథలన్నీ (సుమారు) ఏదో ఒక సంస్థ ప్రకటించిన పురస్కారాల్ని గెలుచుకున్నాయి.

-కె.సిహెచ్.