అక్షర

లోకరీతీ.. కథా శిల్పపరిణతీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కథాకలశం’
బలివాడ కాంతారావు
ప్రతులకు: అన్ని
ప్రముఖ పుస్తక
కేంద్రాలలో
--

తెలుగు కథా సాహిత్య చరిత్రలో ఉత్తరాంధ్రకు ఒక చెరగని చిరునామాని సమకూర్చిన ప్రముఖ కథకుడు కీ.శే.బలివాడ కాంతారావుగారు. 300 పైగా కథలూ, 32 నవలలు, 5 నాటికలు రాశారు. నవలలు, కథలు అనేక భాషల్లోకి అనువాదం పొందాయి. నవలల్లో ‘దగాపడిన తమ్ముడు’ ఒక ప్రత్యేక గుర్తింపుని పొందింది. ఆ నవలని నేషనల్ బుక్ ట్రస్ట్‌వారు అన్ని భారతీయ భాషల్లోకీ అనువాదం చేయించి ప్రచురించారు. కాంతారావుగారు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత.
కాంతారావుగారి కథల్లో 138 కథల్ని ఎంపికచేసి, పి.రాజేశ్వరరావుగారు సంపాదకులుగా ‘కథాకలశం’ ప్రచురణని తెచ్చారు- కాంతారావుగారి కుమారుడు అశోక్.
‘కథాకలశం’లోని కథలన్నీ కాంతారావుగారి లోకజ్ఞతకీ, మనుషుల్ని సమాజాన్నీ సన్నిహితంగా చదివిన వారి అనుభవశాలీనతకూ అద్దం పడుతున్నాయి. వారి కథలకు కేంద్రం- మన చుట్టూ తిరిగే సాధారణ మనుషుల్లో, అతి సాధారణ మనిషి. ఆ మనిషి బతుకునీ, మనస్తత్వాన్నీ అనుభూతి ప్రదాయకంగా ఆవిష్కరించారు వారు.
అందునా కొన్ని స్వభావాల మనుషుల తత్త్వాన్ని చిత్రికపట్టి, నిలబెట్టి ప్రత్యేక పాత్రలుగా రూపకల్పన చేస్తారు. కాంతారావుగారికి కథకుడుగా ప్రఖ్యాతిని గడించిపెట్టిన కథలన్నిటా మనమీ గుణ విశేషాన్ని చూస్తాము. ‘పాడులోకం- పాడుమనుషులు’లో స్ర్తి విద్య పట్ల వ్యతిరేక భావనతో, ఛాందస స్వభావంతో అలజడికి లోనయ్యే నీలకంఠం, ‘చక్రతీర్థ’లో కొడుకూ కోడళ్ల నిరాదరణకు కుమిలిపోయే సుదర్శన్‌పండా, ‘రాతిలోని నీరు’ కథలో చేయని ఉపకారానికి మంచి పేరు కొట్టేసి, మనస్తాపం చెందే సహజానంద, ‘గడచిపోయిన గాథలు’లో అనుభవం నుండి గుణపాఠం నేర్వని భార్యతో అవస్థపడే వెంకటేశ్వరరావు- వంటి వారంతా గొప్ప ప్రాతినిధ్య పాత్రలే. కాంతారావుగారి స్ర్తి పాత్ర చిత్రణ కూడా ఇంతకింత కథాకథన శిల్పంతోనే వెలువడింది. ‘సుందరీ నీకెందరో!’అనే లోకుల హేళనల్ని బడబాగ్నిలా భరించే నర్సు సుందరీ (‘గులాబి’కథ), గడచిపోయిన అనుభవాలనుండి ఏమీ నేర్వలేని ప్రమీల (‘గడచిపోయిన గాథలు) తండ్రి ఆరాటాన్నీ, ఆందోళననీ గుర్తెరిగి ఆయన మసనుకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని పలికే సన్యాసమ్మ (‘పాడులోకం- పాడుమనుషులు’) మరణశయ్యమీద ఉండి, ‘నాకింకొక జానీ ఉంది’ అన్న భర్తతో, నిండుకుండలా, ‘తెలుసు’అనే మెత్తని పులి జానకి (‘కదలిక’)-వంటి వారంతా- భిన్న స్వభావాల్లో స్ర్తి హృదయరాగం అనే ఏకత్వాన్ని చాటిన మహిళలే!
కాగా, 14 భారతీయ భాషల్లోకి అనూదితమైన ‘ముంగిస’ ఒక విలక్షణమైన, విశిష్టమైన కథానిక. డాక్టర్ అప్పారావు, ఆయన భార్య అనసూయమ్మ సాత్వికులు; ప్రేమమయులు; భూతదయాపరులు. వారు కన్నకొడుకులూ, ప్రాణపదంగా ఒక ముంగిసని పెంచుకుంటున్నారు. దానికి బయ్యన్న అని పేరు పెట్టుకున్నారు. ఈ దంపతుల చుట్టం- కేవలం వాళ్లకు తనకంటే జరుగుబాటు హెచ్చు అని కన్నుకుట్టి, ఈర్ష్యాసూయలతో కుళ్లిపోయిన పొరుగింటి బైరవయ్య- వీరు లేని సమయంలో బయ్యన్నని హతమారుస్తాడు. ఈ పరిణామానికి డాక్టర్ దంపతులు విలవిల్లాడుతారు. ఆ తర్వాత- ఒక రోజు- ఒక పెద్ద ముంగిస, బయన్నకంటే చాలా పెద్దది వచ్చి, భైరవయ్య కోడిపిల్లలపై ఉరుకుతూ పట్టుకుంది. దాన్ని తరుముతూ రాళ్లగుట్టపై పడ్డాడు భైరవయ్య. మంచమెక్కాడు. ‘నాదేం తప్పులేదు, నన్ను చంపకు... చంపకు’ అని గగ్గోలు పెడుతున్న బయ్యన్న కళ్లల్లో కనపడుతూ వేధించసాగాడు. భైరవయ్య ఆ దృశ్యాన్ని తన మనసునుంచి చెరుపుకోలేక నడుం జార్చేసుకున్నాడు! అటు మానవ సంబంధాల్లోని వైచిత్రినీ, వికృతినీ, ఇటు భూతదయనీ, దాని రాహిత్యాన్నీ నిరాడంబర కథాశిల్పంతో ఆర్ద్రంగా ఆవిష్కరించారు రచయిత.
‘కథాకలశం’లో ఇంతకింత గొప్పకథ ‘బేడాఘాట్’ ‘మొసలి’కూడా ఉంది. పడవవాళ్ల బతుకులతో ఆడుకునే యజమాని పరపీడన, దానికి విరుగుడుగా కథకుడు ‘ఆ పడవల వారందరినీ యజమానికి వ్యతిరేకంగా సంఘటిత పరచిన వైనం కథాత్మకంగా చిత్రితమైనాయి ఇందులో.
పురాణం సుబ్రహ్మణ్యశర్మగారు అన్నట్టు ‘తెలుగు కథాసాహిత్యంలో ముఖ్యంగా ఒక చారిత్రక కర్తవ్యాన్ని (అదే జీవితాలకు సమగ్రతని ఇవ్వడంలో) కాంతారావుగారు తమవంతు బాధ్యతని చక్కగా నిర్వర్తించారని ఈ ‘కథాకలశం’లోని కథలన్నీ ఋజువుచేస్తున్నాయి. నిస్సందేహంగా ఈ సంపుటి కథాప్రియులకు స్వాదుఫలం!

-విహారి