అక్షర

నమక చమక భావసారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమక చమకాలు
(అర్థ తాత్పర్య విశేషాలు)
వ్యాఖ్యాత: డా.తాడేపల్లి పతంజలి
పేజీలు: 208
ప్రతులకు: గుడిపాటి
శ్రీరామకృష్ణ శర్మ
17-25/3బి,
ధర్మపురి కాలనీ,
ఉప్పల్, హైదరాబాద్-500 038
94904 69300
*
అపౌరిషీయం అయిన వేదం- పరమేశ్వరుని శబ్ద స్వరూపం. పరమేశ్వరుని తత్త్వాన్ని తెలియజెప్పిన వాఙ్మయం. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండగా చెప్పుకొనే ఈ వేద వాఙ్మయంలో, యజుర్వేదంలో చెప్పిన కర్మకాండలో భాగంగా చెప్పబడిన బ్రహ్మ విద్య ఈ నమకచమకాలు - అదే శతరుద్రీయం - రుద్రోపనిషత్తు. పరమేశ్వరుని వివిధ స్వరూపాలని వర్ణించిన మంత్రాలు ఇవి. నమకం పదకొండు అనువాకాలుగా ఉన్న భక్తి పారవశ్యం. ఆ పారవశ్యంతో పలికిన నమస్కార సహస్రం రుద్రం. యజుర్వేద సారమైన ఈ రుద్రం విన్నవారు జీవిత కాలం ధన్యులై గడుపుతారు - చివరికి పరమగతిని పొందుతారని శివుని వరం. పరమేశ్వరుని పాదాలపై మనస్సు నిలపటం వల్ల వచ్చే పరమానందాన్ని రుద్రం కలిగిస్తుంది. భగవంతుని దరి చేరేందుకు వలసిన ప్రేమను పెంచే ఔషధం రుద్రం.
భగవంతుడు లేని చోటు లేదని తెలియటమే కదా జ్ఞానం. అట్టి జ్ఞాన భాండారమే నమక చమకాలు - ఈ మంత్రాలను సుస్వరంగా వింటూంటేనే పులకరిస్తాం. సంస్కృత భాషలో వున్న ఆ మంత్రాలకు అర్థం తెలిసి ఉంటే ఇంకెంత పారవశ్యం!
ఎందరో మహాత్ములు ఈ రుద్ర మంత్రాలకు తమ భాష్యాలను అందించారు. తాడేపల్లి పతంజలి అందించిన ఈ ‘నమక చమకాలు’ (అర్థ తాత్పర్య విశేషాలు) ఓ విశేషతను సంతరించుకొంది. మంత్రానికి ప్రతిపదార్థాన్ని, తాత్పర్యాన్ని ఇస్తోనే, వ్యాఖ్యాత, ‘విశేషము’ శీర్షికన, మంత్రార్థంలో మనకొచ్చే సందేహాల్ని తీర్చేదిగా ఇచ్చిన వివరణ బాగుంది.
ఉదాహరణకు ‘ఓత్య్రంబకం..’ మంత్రానికి వలసిన ప్రతిపదార్థం తాత్పర్యం ఇస్తూనే, అందించిన వివరణ బాగుంది. శివుని ‘సుగంధిం’ అనటాన్ని విశే్లషించారు వ్యాఖ్యాత. లౌకికంగా సుగంధాన్ని ఆస్వాదిస్తే కలిగే హాయి, శివుని పేరు తలుచుకొంటేనే కలుగుతుంది అంటారు పతంజలి.
ఈ సందర్భంలో భగవంతుని అనుగ్రహం వల్ల లభించే వరాలను ఉటంకించారు. ‘అనాయాసీన మరణం’ అన్న శ్లోకభాగాన్ని ఆధారంగా తీసుకొని ‘దైన్యం లేని జీవితం, అనాయాస మరణాన్ని గురించి వ్యాఖ్యానించారు. తన ‘విశేషాలు’ ఇలా చాలా మంత్ర వ్యాఖ్యానంలో ఇచ్చారు. కుల పర్వతాలు, లోహాలు, అగ్నులు, యజ్ఞాలు, కర్మలు వీటి సంఖ్యా భేదాలు - వివరించిన తీరు ప్రశంసనీయం.
దాదాపు 17 నిఘంటువులను, ఇంతకు ముందు రుద్రభాష్యాన్ని అందించిన పెద్దల వ్యాఖ్యానాల ఆధారంగా పతంజలి అందించిన విజ్ఞానఖని ఇది.

-బి.ఎస్.శర్మ