అక్షర

విషయ పరిజ్ఞానాన్ని అందించే సంకలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

450 విచిత్ర ప్రశ్నలు?
జవాబులు.
తెలుగు అనువాదం: ప్రగతి
పేజీలు: 192; వెల: రూ.140/-
ప్రతులకు: ప్రగతి పబ్లిషర్స్, ఎల్.బి.నగర్,
హైదరాబాదు- 74
--

‘‘పచ్చగడ్డి పచ్చరంగులోనే ఎందుకు ఉంటుంది? ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి? ఈ ప్రపంచం ఎలా పుట్టింది?’’ లాంటి ప్రశ్నల్ని ‘‘విచిత్ర ప్రశ్నలు’’అనరు. విజ్ఞానాన్ని పెంచే ప్రశ్నలు అనవచ్చును. సుమారు ఏభయి ఏళ్ళ క్రిందటే ఇలాంటి ప్రశ్నల్ని ‘‘చొప్పదంటు’’ ప్రశ్నలుగా పేర్కొంటూ పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి.
గూగుల్ వికీపీడియా లాంటి ఇంటర్నెట్ సంస్థలు అందించే సేవలు, ముందు 450 ప్రశ్నలకు జవాబులు ఏపాటివి? గూగుల్‌లో ఒక లక్షా ఇరవయివేల విషయాలపై వ్యాసాలున్నాయట! వికీపీడియాలో అయిదు లక్షల తొంభయివేల నాలుగువందల ఏభయి అయిదు (ఈ సమీక్ష వ్రాసేనాటికి) విషయాలపై వ్యాసాలున్నాయట! ఇవి అందుబాటు వచ్చిన ఈరోజుల్లో 450 విషయాలపై వివరణ ఏపాటిదో, పాఠకులే గమనించాలి.
ఇవన్నీ కాసేపు ప్రక్కనబెట్టితే- శీర్షికలో చెప్పినట్లు ఈ ప్రశ్నల పుస్తకాన్ని అయిదు అధ్యాయాలుగా విభజించారు. మొదటి అధ్యాయం జీవశాస్త్రం. రెండవది వైద్యం- శరీరం మూడవది. భూగోళం, నాలుగు సైన్సు అండ్ టెక్నాలజీ అయిదు జనరల్ నాలెడ్జ్ (జి.కె.).170 పేజీల్లో 450 విషయాలు- అంటే ఒక్కో పేజీకి సుమారు మూడు ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. రెండే రెండు వాక్యాల వివరణ (పేజి 82) కూడా ఉంది. ‘సమగ్రత’అన్న విషయాల్ని విస్మరిస్తే, ఈ పుస్తకం మాథ్యమిక (జజూజూళ) ఉన్నత (్హజద) ఫాఠశాల విద్యార్థులకు ఒక మంచి సాధనం. అయితే, 140 రూపాయల వెల, ఆ విద్యార్థుల ఆర్థిక స్థాయికి ఎక్కువేననిపిస్తుంది. ఒకటి రెండు అచ్చుతప్పుల్ని (పేజీలు 63, 145, 148) మినహాయిస్తే, పుస్తకం ఆసాంతం, సరళమైన చక్కని శైలితో నడుస్తుంది. ప్రాథమిక, విషయ పరిజ్ఞానం ఆశించే వారందరికీ, ఈ సంకలనం ఒక మంచి సాధనం. పుస్తకం చివర ‘నిశజూళన’ ఇస్తే బావుండేది.

-కూర చిదంబరం