అక్షరాలోచన

మనసు పలికే వౌనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ మాటలన్నీ అబద్ధాలైనా బాగుండేవి
అవి నా కోసం కదా అందుకే
కోపం కన్నా నవ్వే ఎక్కువ వచ్చేది

నువ్వు పాడే పాట చాలా బాగుండేది
అది నా కోసం కదా అందుకే...!
ఆ... పాట తియ్యగా కన్నా
చాలా ప్రేమగా వినిపించేది

నువ్వు నాకు దూరమయ్యావని
బాధపడాలంటే భయమేస్తుంది
నా కన్నీటి చుక్కవై మాయవౌతావని

ఎదురుగా లేకున్నా చింతేకాని...!
మదిలో మెదలనిదెప్పుడనీ
నా ప్రతి అనే్వషణలో కనిపించింది నువ్వే!
ప్రతి ఎదురుచూపులో తలపించింది నినే్న
వౌనాన్ని అర్థం చేసుకునే మనసుండాలి కానీ
వౌనం పలికే ప్రతి మాట
మనస్సుకు వినిపిస్తాయ

నువ్వు ఎదురుగా లేకుంటే ఏమైంది
నీ రూపం అలవోకగా ప్రతి క్షణం
పలకరించి మనసు తడిసిపోతుంటే

కానీ....!
కాలం కూడా కసి తీర్చుకోగలదని తెల్సింది
నువ్వు దూరమయ్యాకే...

నువ్వే నా సర్వస్వం అనుకున్నా
కాని...
ఇప్పుడు తెల్సింది
నీ స్వరానిక్కూడా నా పేరు
పలకడం ఇష్టం లేదని....!

- సౌమ్య వీరబత్తిని