అక్షర

‘అరుణ’ సాహిత్య సర్వస్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుణ్‌సాగర్
అక్షర శ్వాస
పేజీలు: 416
వెల: రూ.350
ప్రతులకు: సాహితీ మిత్రులు
28-10-16, అరండల్‌పేట
విజయవాడ-520002

వివిధ పత్రికల్లో, మీడియాల్లో పనిచేసి తనదయిన ముద్ర వేసిన అరుణ్‌సాగర్ కవి, రచయిత. తన అత్యధునాతన అభివ్యక్తుల్తో సాహిత్య లోకాన్ని ఆకర్షించినవాడు. ఎందరికో ఆత్మీయుడు. అట్లాంటి వ్యక్తి హఠాత్తుగా చిన్న వయసులోనే అనారోగ్యంతో కన్ను మూశాడు. సాహితీ మిత్రులు ఆయన ముద్రితాముద్రిత రచనల నన్నిట్నీ సేకరించి అరుణ్‌సాగర్ ‘అక్షర శ్వాస’ అన్న గ్రంథంగా తీసుకొచ్చారు.
ఇందులో వివిధ పత్రికల్లో రాసిన రచనలున్నాయి. న్యూస్ ఈజ్ మార్కెట్, అమ్మ చెప్పిన అబద్ధాలు, స్ట్రీమ్ ఆఫ్ లైఫ్, బాహుబిల్డప్, ఐ మిస్సిట్ ఎవ్రీ మూవ్‌మెంట్, లస్కుటపా, ఎవరికెవరు? ఈ శీర్షికల్లో రెండు వందల అరవై పేజీలు వ్యక్తిగత, సామాజిక, రాజకీయ వచన రచనలున్నాయి. తల్లీతండ్రుల గురించి, తన కమ్యూనిస్టు పూర్వరంగం గురించి, మిత్రుల గురించి, వివిధ రంగాల గురించి బహుముఖీనంగా విస్తరించిన వ్యాస పరంపరలివి.
తరువాత ఆయన కవితా సంపుటాలు, మేల్‌కొలుపు, మాగ్జిమమ్ రిస్క్, మియర్‌మేల్, మ్యూజిక్ డైస్ అన్న నాలుగు కవితా సంపుటాలు.
మొదటి మూడు కవితా సంపుటాల్లో సంక్లిష్ట, వ్యక్తిగత అభివ్యక్తుల్తో మెరుపులు మెరిపిస్తాడు. వాటి వెనుక అతన్లోని అనంతమయిన అశాంతి మనల్ని ఆందోళనకి గురి చేస్తుంది. భద్రాచలం అతని భావుకత్వానికి పునాది. గిరిజనుల గుండెల్ని విన్న కవి అతను. భూములు కోల్పోతున్న నిర్వాసితుల విషాదాల్ని వినిపించేది కొంత సంక్లిషతను వదిలి సూటిగా సరాసరిగా భాధల్ని ప్రదర్శించేది ‘మ్యూజిక్ డైస్’ కవితా సంపుటి.
ఒక సంక్లిష్ట, సంక్షుభిత, జ్వలిత కవి అరుణ్‌సాగర్ సజీవంగా ఈ పుస్తకంలో మనతో సంభాషిస్తాడు.

-సౌభాగ్య