అక్షర

కవిని ఆకాశానికెత్తిన కావ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవనభువనం
(కవితా కావ్యం)
-తిరుమల శ్రీనివాసాచార్య
పేజీలు: 132..వెల: రూ.100
ప్రతులకు: రచయిత
ఎ40, 201
సింగపూర్ టౌన్‌షిప్
హైదరాబాద్-68.
**
డా.తిరుమల శ్రీనివాసాచార్య వారికి పదహారవ రుబారుూ కావ్యమిది. 2013 నుండి అప్పుడప్పుడు వ్రాసిన కవితలివి. ప్రపంచంలో కవి విశిష్ట వ్యక్తిత్వం గూర్చి విభిన్న సందర్భాలలో రాసిన ముక్తనాలివి అన్నారు వారు.
కవి పట్ల శ్రీనివాసాచార్య గారికి అపార గౌరవం. సృష్టిలో కవి అపూర్వ వ్యక్తి అని వారి భావన. కవిని విభిన్న కోణాల్లో ఆకాశానికెత్తిన కవితలు ఇవన్నీ. మహాకవుల రూపాలకు వారి నావ రత్నాలకు వారి కవిత మనకు చూపు జ్యోతిర్మయ మార్గాలని’ అంటారు. ప్రాచీన కవులయిన కాళిదాసులాదుల్ని, నన్నయ్య మొదలు తెలుగు కవుల్ని ఆయన అపూర్వ దృష్టితో, ఆనంద తరంగిత హృదయంతో చూస్తారు.
‘నీ రూపం మారిపోవు.
నీ దేహం రాలిపోవు
అయినా సరే నీ కవనం నిరంతరం నిలిచిపోవు’ ఉత్తమ కవి కవిత్వం విరామం లేనిదని, మహిమాన్వితమయిందని చెబుతారు.
కవీశ్వరుడు స్పర్శిస్తే వసుధ పులకరిస్తుంది, కవీశ్వరుడు దర్శిస్తే మోడు పల్లవిస్తుంది. భగవానుని అంశతో పుడతారు. కవీశ్వరుడు లిఖియిస్తే విశ్వం కుసుమిస్తుంది అంటూ కవి దైవాంశ సంభూతుడని, సత్యానికి సౌందర్యానికి నిబద్ధుడని, కవి వల్లనే ఈ ప్రపంచం పరిమళభరితమవుతుందని భావిస్తారు.
ఉదాత్త శైలితో సాగిన ఈ కవితలు అందరూ చదవదగినవి.

-సౌభాగ్య