అక్షర

పత్రికల ధోరణులపై సమగ్ర విశే్లషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు వారపత్రికలు - రచనా ధోరణులు
-వేదగిరి రాంబాబు
పుటలు: 356
వెల: రూ.200/-
ప్రచురణకర్తలు: శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్
హైదరాబాద్

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ 1934లో తన ‘ప్రబుద్ధాంధ్ర’ పునః ప్రారంభించారు. ఇటీవల ఈ పత్రికను అధ్యయనం చేసి రెండు పుస్తకాలు వెలువరించాం. ఒక్క 1934 సం.లోనే ఈ పత్రికలో ఆంధ్ర సహకార పత్రిక, గృహలక్ష్మి, ధర్మసాధని, రెడ్డిరాణి, విశ్వకళ, లోకలు బోర్డు, పశు సంరక్షణ, ఆంధ్ర విశ్వ కళాపరిషత్ కళాశాల, ఆదిశైవ పత్రిక, ఆంధ్రభూమి, గోల్కొండ, చంద్రిక పత్రికల గురించి సంక్షిప్త పరిచయాలు ప్రచురించారు. ఇలా పరిచయం చేయడం వాటి గురించి తెలియజేయడమే కాకుండా, ముందు తరాలకు ధోరణిని సమాచారంతో డాక్యుమెంట్ చేయడమే. ఈ విధానం తెలుగులో అంతరించి ఎవరి పత్రిక గురించి వారే రాసుకోవడంగా మారింది. అందువల్ల వేదగిరి రాంబాబుగారి ప్రస్తుత రచన వంటిది అవసరమైంది.
రాంబాబుగారు కథా రచయిత, పాత్రికేయులు. వారపత్రికలలో పనిచేసిన వారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పిహెచ్.డి కోసం సేకరించిన సమాచారంతో ఈ పుస్తకం వెలువడింది. పట్టా పొందిన రెండు దశాబ్దాలకు పుస్తక రూపం పొందిందీ సమాచారం. నిజానికి అప్పుడే వెలుగు చూసి ఉంటే బావుండేది. వారపత్రికలు గురించి పుస్తకం అయినా దినపత్రికలు, పక్ష పత్రికలు, మాస పత్రికలు - వెరసి తెలుగు జర్నలిజం గురించి ఈ పుస్తకం సాగుతుంది. పనె్నండు అధ్యాయాలుగా ఈ 356 పేజీల పుస్తకం రూపుదిద్దుకుంది. దేశంలో పత్రికల ఆవిర్భావం, తొలినాళ్ల పత్రికల, దినపత్రికల ఆవిర్భావం అధ్యాయాలు సమాచారంతో ఉన్నాయి. వార పత్రికలు, ప్రత్యేక పత్రికలు సమాచారం రీత్యా కీలకం కాగా, రచనా ధోరణులు సంపాదకులేమంటున్నారు, పత్రికా విలువలు అనేవి విశే్లషణతో కూడినవి. వీటన్నిటికి మించి పుస్తకంలో దాదాపు సగ భాగం ఆక్రమించిన అనుబంధంలోని వ్యాసాలు చాలా విలువైనవి. పరిశోధన కోసం సేకరించిన కొడాలి శివరామకృష్ణారావు, వి.వి.నరసింహారావు, శంభుప్రసాద్, మల్లంపల్లి సోమశేఖర శర్మ, చల్లా శేషగిరిరావు, గిడుగు వేంకట రామమూర్తి రాసిన జర్నలిజం సంబంధించిన వ్యాసాలు అమూల్యమైనవి. 1926, 1927ల్లో కొడాలి శివరామకృష్ణారావు రాసినవి తొలి దశలో పత్రికల గురించి ఉన్న అవగాహన మనకు ఎరుకపరుస్తాయి. తేదీ పేర్కొనకుండా ‘్భరతి’ నుంచి సేకరించిన వి.వి.నరసింహారావు రాసిన ‘తెలుగు జర్నలిజం’ గురించి వ్యాసం ఎంతో విలువయినది. బహుశా ఈ స్థాయి వ్యాసం తర్వాత మరేదీ రాలేదన్నా ఆశ్చర్యం లేదు. సమాచార సేకరణలోనే కాదు వర్తమాన ప్రపంచ పత్రికలను పోల్చి చేసిన విశే్లషణ ఎంతో లోతయినది. తెలుగు జర్నలిజం సమస్య ఏమిటంటే లోపలి వారికి తీరిక లేదు, బయట వారికి బోధపడదు. అందుకే జర్నలిజానికి, జనానికి దడి ఏర్పడింది. రెండణాల ధరతో దినపత్రికలు సాగిన కాలపు నరసింహారావు విశే్లషణా వ్యాసం ఒక చమక్కుగా నిలిచిపోతుంది దీన్ని సేకరించిన వేదగిరి రాంబాబుకు నిజంగా అభినందనలు చెప్పాలి. కంచి వాసుదేవరావు, ముళ్లపూడి వెంకటరమణ, వీరాజి, పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు వెలువరించిన అభిప్రాయ వ్యాసాలు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి.
అయితే అచ్చుతప్పులు అడుగడుగునా గందరగోళంలో పడవేస్తాయి. 1934 ఏప్రిల్ సంచిక ప్రబుద్ధాంధ్ర పత్రికలో గిడుగు రామమూర్తి తెలుగు పత్రికా సంపాదకులకు అని రాసిన వ్యాసం తెలుగు జర్నలిజానికి గ్రాంథికం నుంచి వ్యావహారికంలో మళ్లించినది. అయితే ఇదే వ్యాసం (చివర వేరే సమాచారంతో) శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీగారి ‘పత్రికల భాష’ అనే వ్యాసంగా పక్కపక్కనే కనబడుతుంది. సుమారు తొమ్మిది పేజీలు ఒకేలా ఉన్నాయి. అదే సమయంలో కథ, నవల, కవిత వీటికి సంబంధించి పత్రికల పరమైన విశే్లషణ ఆసక్తి కలిగిస్తుంది.

-నాగసూరి వేణుగోపాల్