అక్షర

మనోవిజ్ఞాన గీతాసారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అష్టాదశ గీతా
మకరందములు
-సూర్యప్రసాద రావు
మూల్యం: రూ.96/-లు
ప్రతుల కొరకు:
రచయత
రిటైర్డ్ లెక్చరర్
ఇ.నెం.5-6-18/బి, పాకబండ బజార్
పెట్రోల్‌బంక్ పక్కన
ఖమ్మం - 507 001
9885156844

మనిషి సందేహాల పుట్ట. పుట్టిన నాటినుంచి ఎన్నో సందేహాలు, సంశయాత్మకాలు ఉంటూనే ఉన్నాయి.సామాన్యులకైతే అన్నీ డోలాయామాన పరిస్థితులే. ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న సంశయాలే. లౌకికంగానైనా అలౌకికంగానైనా ఏ పని చేయాలన్న, ఏ పంథాలో ముందుకు అడుగు వేయాలన్న ఎన్నో అనుమానాలు సహజం. ఇవన్నీ తెలిసిన అనుభవజ్ఞులు మన పెద్దలు. వారు చూపిన దారిలో నడిస్తే చాలు మనం అనుకొన్న గమ్యాన్ని సులువుగా చేరగలుగుతాం.
ఆ పెద్దలు చూపిన దారిని తెలుసుకోవడానికి కూడా అందరికీ సదుపాయం లేదు.
ఎందుకంటే పూర్వం - అక్షరాస్యత లేకపోయినా భారత భాగవత రామాయణాది కావ్యాలు ప్రబంధాలు, పురాణాలు ఇలాంటివన్నీ వౌఖిక జ్ఞానంతోనే మనవారందరికి చిరపరిచితాలు.
కాని, ఇపుడు ప్రపంచీకరణ అనే వ్యాధితో పరుగు లంకించుకున్న మానవుడు దేనినీ నిశితంగా చూసే నేర్పును కోల్పోతున్నాడు. మనవారు అందించిన జ్ఞానాన్ని అందుకోకుండా తెలుసు తెలుసునని ముందుకు వెళుతూనే ఉన్నాడు.
ఇలా అందరూ పరుగెత్తడం లేదు. పరుగులో కొందరు వెనకబడుతున్నారు. అందుకే కొంతమంది జ్ఞానులు మరికొంత మంది అజ్ఞానులు. మరికొందరు జ్ఞానులమనుకొనే అజ్ఞానులుగా ఉన్న భ్రమజీవులు.
దీనికి కారణం ఒకవైపు అవిద్య, అహంకారం, గర్వం, ఈర్ష్య, అసూయ, నిర్ల్యక్షం, అపోహ ఇలాంటి దుర్లక్షణాలు మన ప్రాచీన సాహిత్యపు విలువలను తెలుసుకోనివ్వకుండా చేస్తున్నాయి.
మరొక వైపు పాశ్చాత్య వ్యా మోహం దూరపు కొండలు నునుపు అన్నట్లు అక్కడేదో ఉంది దానిని తెలుసుకోవాలి ఇక్కడ ఉన్నదంతా తెలుసు అనే కోణంతో కొంతమంది తరగని గని లాంటి మన సాహిత్యాన్ని ఆధ్యాత్మిక ప్రపంచంలో మెరుపులీనుతున్న అసలైన బంగారాన్ని తోసిరాజని పోతున్నారు.
అట్లాంటి అందరినీ దృష్టిలో పెట్టుకొని అనేకాలుగా, అనేకులు వివరించిన బోధనంతా ఒక దరికి చేర్చారు సూర్యప్రసాదరావు. అధ్యాపక వృత్తిలో ఉన్న వీరు సులభగ్రాహ్యంగా వివిధ గీతలను చక్కని సరళమైన భాషభావంతో చదువరుల మనసును గెలుచుకునేవిధంగా ‘‘అష్టాదశ మకరందములు’’ అన్న పేరిట పదునెనిమిది గీతలను బోధిస్తున్నారు.
నాడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో బంధుజనాన్ని చూచి నీరుగారి పోయిన అర్జునుణ్ణి ఓదార్చి కర్తవ్యోన్ముఖుడిగా చేసిన గీతాచార్యునిలాగా నేడు సూర్యప్రసాద రావు విద్యాహంకారం, కులాహంకారం, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం ధర్మం పట్ల సత్యంపట్ల అవగాహన, నిబద్దత లేకపోవడం లాంటి దుర్లక్షణాలున్న మానవులను తిరిగి వారిలో జ్ఞాన జ్యోతులను వెలిగించడానికి మనోవైజ్ఞానిక గీతల్లాగా వ్యాధ గీత, గురుగీత, కపిల గీత, భరతగీత, సనత్ కుమార గీత, ఋషభ గీత, రుద్ర గీత, నవయోగీశ్వర గీత, బ్రాహ్మణ గీత, శ్రీరామ గీత, ఉద్ధవ గీత, సనత్‌సుజాత గీత, అవధూత గీత, భిక్షుగీత, నహుష గీత, హంస గీత, శౌనక గీత అంటూ పద్దెనిమిది మంది చేసిన గీతాజ్ఞానాన్ని ‘‘అష్టాదశ గీతామకరందములు’’ పేర అమృతాన్ని అందిస్తున్నారు.
సులభశైలిలో చదివించే నైపుణ్యమున్న ఈ గీతలన్నీ కూడా ఆధ్యాత్మిక జిజ్ఞాసువులే కాక ప్రతివారు చదివి వారి వారి దైనందిన కృత్యాలను ఇంకాస్త నైపుణ్యతతో నెరవేర్చుకునేవిధంగా తీర్చి దిద్దారు.
ఇందులో ఋషభ కుమారులైన కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పాలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమీళుడు, చమనుడు, కరభాజనుడు అనువారు నిమిచక్రవర్తికి బోధించిన ధర్మగీతను నవయోగీశ్వర గీత అన్న శీర్షికతో వివరించారు.
లౌకిక విద్యలకైనా అలౌకిక విద్యలకైనా గురువు అత్యంతావశ్యకం. గురువు లేని విద్య గుడ్డివిద్య అంటారు. అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞానమనే వెలుగునిచ్చే గురువు ప్రతివారికి ఉండి తీరవలసిందే. అట్లాంటి గురువు ఎంత గొప్పవారు గురువు చూపిన దారిలో నడిచే విద్యార్థులు ఎంతటి ఐశ్వర్యవంతులో తెలుసుకోవాలంటే గురుగీతను చదవవలసిందే.
పిపీలికాది బ్రహ్మపర్యంతములో భగవానుడు సృష్టించిన ఈ సృష్టిలో పనికి రానిది పనికి వచ్చేది అంటూ రెండు తెగలు లేవు. ప్రతిదానికి విలువ ఉంది. ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంది. హెచ్చుతగ్గులుకాని, అధికాల్పములు కాని లేవు. ఈ విషయాన్ని తెలుసుకోకుండా అజ్ఞానంతో తమకే అంతా తెలుసునని, తామే గొప్పవారమని అనుకునేవారు ఎంతటి అల్పజ్ఞులో రుద్రగీత వివరిస్తుంది. భగవంతుని సృష్టిలోని మర్మాన్ని తెలుసుకోవడానికి, ఆధ్యాత్మిక పథంలోను, అధునాతన వైజ్ఞానిక ప్రపంచంలోను ముందుకు వెళ్లడానికి మార్గదర్శకం ఈ ‘‘అష్టాదశ గీతామకరందములు’’

-రాయసం లక్ష్మి