అక్షర

స్ర్తి వ్యక్తిత్వ ఔన్నత్య చిత్రణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఒక ఇల్లాలి కథ’
-జి.ఎస్.లక్ష్మి
ప్రతులకు
అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
**

నవలలో ఇతివృత్తం సామాజికమై, సమాజానికీ, వ్యక్తులకీ మధ్య సంఘర్షణ సంభావ్యంగానూ, సంక్లిష్టంగానూ, వాస్తవికత ఆధారంగానూ ఉంటే - రచన ఉత్కంఠ ప్రధానంగా సాగుతుంది. అలాగే, సంఘటనలు ఒకదాని వెంట ఒకటి త్వరత్వరగా జరుగుతూ - పాత్ర ప్రమేయం ప్రస్ఫుటంగా ఉండి కథనం సరళశైలిలో సాగుతుంటే - నవలకి చదివించే గుణం మంచి ఆహార్యంగా నప్పుతుంది. జి.ఎస్.లక్ష్మి ‘ఒక ఇల్లాలి కథ’ నవలలో ఈ గుణ విశేషాలన్నీ చక్కగా కుదురుకున్నై.
స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న సాంఘిక స్థితిగతులూ, కొన్ని కుటుంబాల్లోని త్యాగశీలుర విలువల పాటింపూ, దానికి పర్యవసానంగా ఆ తర్వాతి తరం వారు ‘సర్వమూ కోలుపోయిన రాజరాజులుగా’ మిగిలిపోవటం.. వంటి యథార్థాలు చారిత్రక చేదు మాత్రలు. ఈ నవలలోని వస్తువుకి ఇలాంటి యథార్థాలు కొన్ని నేపథ్యంగా నిలిచాయి. ఆ నేపథ్యంతో ఇప్పటి తరంలో మిగిలి ఉన్న కుటుంబంలోని ఒక స్వరాజ్యం కథ -ఈ నవల.
ఇతివృత్తం ఇలా సాగుతుంది.
స్వరాజ్యానికి పద్దెనిమిదో ఏట పెళ్ళైంది. కథాకాలం నాటికి ఆమె సంసార జీవనం, అత్తింట్లో మొదలైంది. భర్త రమణమూర్తి. అనువంశికంగా వచ్చిన అభిజాత్యం, పురుషాధిక్యత, పంతం, పట్టుదల మూర్త్భీవించిన మగవాడు! రచయిత్రి మాటల్లో ‘్భర్తంటే ఇలా ఉండాలీ అనే మూర్ఖపు మత్తులో ఉన్నవాడు.’ నిర్ణయాధికారం అన్ని విషయాల్లో తనదే - అనే నిశ్చితాభిప్రాయం కలిగినవాడు. దానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే అతను ‘నరసింహావతారం ఎత్తుతాడు’. అతనికి తండ్రి చనిపోయాడు. తల్లీ చెల్లెలూ, తమ్ముడు - అతని సంరక్షణలో ఉన్నారు. తల్లి అతనికి వత్తాసు. తమ్ముడు, చెల్లెలు అవకాశవాదులు. స్వరాజ్యం సహనశీలి. వివేకవతి. ‘పతివ్రత’. రమణమూర్తి ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందుకని స్వరాజ్యమనే మొక్కని వేళ్లతో సహా పెకిలించి పట్టుకొచ్చి తన పెరట్లో పాతేసుకున్నాడు. ఆమెకూ, ఆమె వారికీ మధ్య మాటలూ, రాకపోకలూ బంద్ చేశాడు. స్వరాజ్యం తన కన్నతల్లి ప్రాణాపాయ స్థితిలో ఉంటే, తప్పనిసరి పరిస్థితుల్లో -్భర్తకి చెప్పకుండా పుట్టింటికి వెళ్లింది. తల్లికి కులాసా చిక్కింది. తన ఇంటికి తిరిగి వచ్చింది స్వరాజ్యం. లోపలికి రానీయకుండా ఆమెని గుమ్మంలో నిలబెట్టాడు భర్త. అత్త, ఆడపడుచు, మరిదీ - కూడా ఆ దౌష్ట్యాన్ని ఎదుర్కోరు. రాత్రి దాకా ఒక్కతీ అలాగే అక్కడ ప్రాణాచారం పడింది - స్వరాజ్యం. చివరికి అతి నీరసంతో, తూలిపోతూ, అభిమానంతో కుంగిపోతూ వెనుదిరిగింది. కడకు - పుట్టింటికి చేరింది. విడాకులకి కేసు వేసింది. శాంతి ఆశ్రమం ‘అమ్మ’తో పరిచయమైంది. కేసు ఫైలు చేసింది. తీర్పు ప్రకారం భరణం ఇవ్వటం లేదు రమణమూర్తి. అతను మానసికంగా దెబ్బతిన్నాడు. స్వరాజ్యంని తిరిగి రమ్మని రాయబారాలు పంపుతాడు. స్వరాజ్యం అంగీకరించదు. ఇంతలో ఆశ్రమం అజమాయిషీని ‘అమ్మ’ స్వరాజ్యం చేతిలో పెడుతుంది. రమణమూర్తి పిచ్చివాడే అయ్యాడు. అతని తల్లి కూడా కోడల్ని తిరిగి రమ్మని ప్రాధేయపడుతుంది. ‘అవునత్తయ్యా స్వరాజ్యం రాదు, ఎందుకంటే.. ఈ స్వరాజ్యానికి స్వరాజ్యం వచ్చింది’ అంటూ చివరి మాటగా తన నిర్ణయాన్ని చెబుతుంది. నవల అలా ముగిసింది!!
స్వరాజ్యంని ఒకరోజల్లా రమణమూర్తి తన ఇంటి బయట నిలబెట్టి ఉంచేసిన దుస్సంఘటన వంటి చిత్రణలు ఆర్ద్రంగా సాగి చదువరుల మనసుకు హత్తుకొనేలా ఉన్నాయి. నవలలో పాత్ర చిత్రణదే పెద్దపీట. ఇతివృత్త పరిధిలో ఏ పాత్రకాపాత్ర స్వాభావికంగా చిత్రించబడింది. లక్ష్మిగారి కథనంలో స్థిమితం, గాంభీర్యం ఉన్నాయి. ఒక ఇల్లాలి జీవితంలో వివిధ దశా విశేషాల్నీ ఆమె వ్యక్తిత్వ నిరూపణతో - సన్నివేశ సృష్టితోకాక - సంఘటనాత్మకంగా ఆవిష్కరించారు రచయిత్రి. ఈ కారణం వల్లనే సీరియల్‌గా ఈ నవల మంచి పాఠకాదరణని పొందింది.

-విహారి