అక్షరాలోచన

పాటను చంపలేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పావురాన్ని చంపినంత తేలిక కాదు
ప్రాణాన్ని పోయగల పాటని చంపడం
ఏడంతస్తుల మేడని కూల్చినంత తేలిగ్గాదు
శిథిలాల్లోంచి చిగురుటాశను పుట్టించే
పాటని మట్టుబెట్టడం!

తుపాకులు బాంబులు గెలుస్తాయనుకోకు
అవి శ్మశానంలో కాష్ఠాల్ని పేర్చుతాయ
కానీ పాట
శ్మశాన వైరాగ్యంలోంచి బయటపడేస్తుంది
పసివాళ్లనుంచి ముసలివాళ్లదాక
అందరూ పాటలో లీనమయ్యారు
అరే తుపాకులు పట్టినోడా
అరేరే బాంబులు విసిరినోడా
నీది పిరికి చేష్ట
మానవత్వమే లేని పైశాచిక చేష్ట
పాటలు వింటూ తన్మయస్తున్న వాళ్లపై
నీవు చేసిన ఆత్మాహుతి దాడి క్షమించరానిది

తుచ్ఛుడా!
పాటను చంపడం నీ వల్లగాదు
నీ దురాగతానికి పాడే పాటలు ఆగవు
నీకు పాడెకట్టి ఊరేగించడానికి
మరిన్ని మరిన్ని పాటలు పుడతాయ!

భ్రష్టుడా!
పాటెప్పుడు బతికే వుంటుంది
అందరి ఉసురు తగిలి నీవే తొందరగ చస్తావు!
(అరియానా షోపై ఆత్మాహుతి దాడికి నిరసనగా...)

- మెట్టా నాగేశ్వరరావు