అక్షర

అ-ద్వైత అనుభూతుల జ్ఞానక్రీడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరాశక్తి
-లెఫ్ట్‌నెంట్ కల్నల్
టి.శ్రీనివాసులు
ప్రచురణ:
cinnamonteal publishing
Goa- 403601
మూల్యం: రూ.295/-
--

భక్తులకు భగవంతుడు వరాల మూట... కోరిన కోరికలను వీలైనంత త్వరగా తీర్చాల్సిన అభయమూర్తి. అయినా అటువంటి దేవతామూర్తులకు సైతం అర్థంకాని అనంతశక్తి ఒకటుందా? అంటే ‘అవును’అనే సమాధానమిస్తుంది యోగమార్గం.
మనలోని కుండలినీశక్తి విశ్వశక్తి నిలయం. మన భౌతిక కుండలినీశక్తే అధి భౌతికంగా పరాశక్తి. అది మానవ జీవనయానంలో మహామాయగాను, భ్రమగాను, అహంగాను, మనస్సుగాను, ఆనందంగాను బహురూపాల విస్ఫోటనమవుతుంటుంది. నిజానికి కుండలినీశక్తి సంపూర్ణ సత్యం.... పరిపూర్ణ చైతన్యం... సచ్చిదానంద కారకం... అనంత శక్తి కేంద్రం. ఈ కుండలినీ శక్తి అక్షరాలలో ఇమడని అనుభూతిని మనకు అందిస్తుంటుంది. మనసు విడమర్చలేని అనుభవాలను యోగసాధనలో మన స్వంతం చేస్తుంటుంది.
అసలు స్మృతులు తొలగితేనే సాధన సంపూర్ణమయ్యేది. ఆ పరిపూర్ణ ప్రయాణంలో అద్వైతానుభవాల జ్ఞానక్రీడనే కుండలిని జాగృతం కావటం. ఈ ఆధ్యాత్మిక యానం సాధకుల అజ్ఞానాన్ని తొలగిస్తూ సాగుతుంటుంది. గెంతుతూ చరించే కప్పలా, చీమలదండు చేసే దాడిలా, మెలికలు తిరుగుతూ సంచరించే సర్పంలా, ఆకాశయానం చేసే పక్షిలా వివిధ తెరగుల కుండలిని జాగృతమవుతూ అప్పుడప్పుడూ వినిపించే రైలు కూతలా నాద రూపంలో వ్యక్తమవుతుంటుంది. ఇటువంటి యోగానుభూతులు, సాధనానుభవాలు శాస్ర్తియాలు కాకపోవచ్చు... హేతుబద్ధాలు కాకపోవచ్చు... కానీ సత్యవర్ఛస్సులే అనటానికి శ్రీనివాసులు రచన ‘పరాశక్తి’ ఒక అక్షర దర్పణం.
‘కుండలినీ శక్తి జాగృతిలో నా అనుభవా’లంటూ లెఫ్ట్‌నెంట్ కల్నల్ టి.శ్రీనివాసులు రచించిన ‘పరాశక్తి’ పుస్తకం నిజానికి అద్వైత అనుభూతుల జ్ఞానక్రీడ. ఈ పుస్తకం నిండా ఎనె్నన్నో సాధనానుభవాలు... మరెనె్నన్నో యోగానుభూతులు... వెరసి స్మృతులు తొలగిన సాధనానుభవాల సంపుటి ఈ ‘పరాశక్తి.’
17 భాగాలుగా సాగిన శ్రీనివాసులు రచన క్లుప్తంగా యోగం అంటే ఏమిటో తెలియజేస్తూ రచయిత అనుసరించిన ‘సిద్ధమహాయోగ’మార్గాన్ని వివరణాత్మకంగా అందిస్తుంది. యోగమార్గంలో చెప్పుకునే ‘క్రియ’లను నిర్వచిస్తూ ఆ ‘క్రియల వ్యక్తీకరణ’ను అక్షరబద్ధం చేస్తుంది. కుండలినీ శక్తి శక్తిపాత రహస్యాలను వెల్లడిస్తూ ఆ శక్తి జాగృతమై విశ్వశక్తిగా సాధనలో నిలదొక్కుకోవటాన్ని అనుభవ దొంతరల మధ్య వివరిస్తుంది. మన మానవ జీవితాన్ని విశ్వశక్తిక్రియగా అభివర్ణిస్తుంది.
ఈ పుస్తకం ఏ ఒక్క మతానికీ కొమ్ముకాయనిదని చెప్పటానికి ‘‘పరాబ్రహ్మాన్ని విభజించి మత ప్రాతిపదికన ప్రతి విభాగానికి ఒక స్వతంత్ర పేరుపెట్టడం అనేది ఎప్పటికీ జరుగని మరియు సాధ్యంకాని విశ్వప్రక్రియ’’ (24) అన్న రచయిత మాటలే ఆధారం... ఆధారమే కాదు యోగ సాధకులకు శిరోధార్యం కూడా!
యోగ సాధన అంటేనే ఆత్మజ్ఞానం... ఈ ఆత్మ ప్రకాశనంతో మనం మతానికి అతీతులం అవుతాం... అంటే యోగ సాధనానుభవాలతో మత పరిధులన్నీ అదృశ్యం అవుతాయి. దృశ్యం అదృశ్యం కావటం, అదృశ్యం దృశ్యం కావటమే పరిపూర్ణ యోగసాధన. గిక సాధన అంతా ఆత్మసాక్షాత్కారానికే. ఇది అద్వైతానభవం. అందుకే-
‘‘పరబ్రహ్మయే స్వయంగా తనలో ఆత్మగా వెలుగుతూ ఉంటే ఇక ఆ మనిషికి ఎలాంటి బాహ్య సహాయం కావాలి?’’అని అంటారు రచయిత శ్రీనివాసులు. నిజానికి ఈ ప్రశ్న వారి అనుభవంలోంచి పుట్టుకొచ్చిన సమాధానం. పైగా కుండలినీశక్తి అయిన ‘‘విశ్వశక్తే సాధకునికి ఇచ్చిన నియంత్రణ శక్తి’’అంటారు. ‘‘సత్కర్మల జ్ఞాపకాల నుండి ముక్తం కావటమే యోగసాధన’’ (97) అని తేల్చేస్తారు.
కుండలినీ శక్తి జాగృతం కావటంవల్ల కలిగే కొన్ని ఫలితాలు-
ఆదిపరాశక్తి అయిన విశ్వశక్తి ఒక వ్యక్తి మనసులో జన్మాంతరాల’నుండి ముద్రింపబడి ఉన్న చరిత్రనంతా తుడిచివేస్తుంది. దీనికోసం ఆ వ్యక్తి మనస్సులో ఆ చరిత్రకు సంబంధించిన దృశ్యాలను అన్నింటినీ ఆఖరిసారిగా మరొకసారి దర్శింపజేయిస్తుంది. (151).
శ్వాస ప్రక్రియ ఆగిపోయిన కారణంగా శరీరంలో అన్ని జీవవ్యవస్థలు కూడా దాదాపు ఆగిపోతాయి. శరీరంలో వృద్ధాప్యంయొక్క ప్రక్రియ కూడా దాదాపు ఆగిపోతుంది. బహుశః దీనివలననే ఒక యోగికి ఆహారం మరియు నీరు లేకుండా దీర్ఘకాలం సమాధిలో జీవించి వుండగల సామర్థ్యం కలుగుతుంది. (157)
కుండలినీశక్తి మానవుని మనస్సులో ముద్రింపబడి వున్న భావోద్వేగాలకు సంబంధించిన అనుభూతులయొక్క జ్ఞాపకాలను శాశ్వతంగా తుడిచివేస్తుంది. ఈ భావోద్వేగాలకు సంబంధించిన సంస్కారాలను కూకటి వ్రేళ్లతో సహా పెకలించి వేస్తుంది. అవి తిరిగి మరలా ఎలాంటి భౌతిక లేదా మానసిక పరిస్థితులలో మొలకెత్తకుండా మనస్సుయొక్క అంతర్భాగంలోనే కాల్చివేస్తుంది. దీని ఫలితంగా ఒక యోగ సాధకుని యొక్క చిత్తం ఎలాంటి ఆలోచనలు మరియు భావోద్వేగాలు లేకుండా నిర్మలవౌతుంది. (167)
ధ్యానం చేసిన కారణంగా మనస్సులో ముద్రితమై ఉన్న ధ్యాన సంస్కారాలు సైతం మనస్సులోనుండి తుడిచివేయబడాలి. పరాశక్తి ఒక యోగ సాధకుని మనస్సులో ముద్రితమై ఉన్న ప్రతి ఒక్క ఇంద్రియ అనుభూతిని తుడిచివేస్తుంది. (177)
మోక్షప్రాప్తి సిద్ధించాలంటే అన్నింటికంటే ముందు ఒక మానవుడు జన్మజన్మల నుండి మరియు యుగయుగాల నుండి తన మనస్సులో కూడబెట్టుకుని ఉన్న ఇంద్రియానుభూతులు మరియు వాటి జ్ఞాపకాల నుండి ముక్తిపొందాలి. (216)
ఇలా ‘పరాశక్తి’గ్రంథకర్త తమ కుండలినీ జాగృత అనుభవాలను అక్షరీకరిస్తూ ‘‘మానవ మేధస్సు అనేది ఆదిపరాశక్తి అయిన ‘‘విశ్వశక్తి యొక్క స్థూల స్వరూపం’’ (19) అని అంటూ ‘‘ఈ విశ్వశక్తియే పరబ్రహ్మం లేదా ఒక వ్యక్తియొక్క ఆత్మ’’అంటూ మన మానవాత్మను విశ్వశక్తిమయం చేస్తారు.
యోగసాధనతో కుండలినీ శక్తి చాలనంవల్ల కలిగే అనుభవాలను తెలుసుకోవటానికి తప్పక చదవాల్సిన పుస్తకం ఈ ‘పరాశక్తి’. ఈ పుస్తకం చదివింప చేయటమే కాదు సాధనామార్గంలో కనువిప్పు కలిగిస్తుంది కూడా!
--

సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-వాసిలి వసంతకుమార్