అక్షరాలోచన

నా ఊపిరిలో నువ్వే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంటాడే వేధించే భయానివి నువ్వు
నీ కోసం వెతుకుతూ వేచి ఉన్న ప్రేమని నేను
అందనంత దూరంలో నువ్వున్నా...
అందుకోవాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నా!
సముద్రంలోని అలలా ఎప్పుడూ పారిపోతూనే ఉన్నావ్!
నీ శ్వాసనై నీలో చేరిపోదామనుకున్నా...
కానీ నిఛ్వాసనై విడిపోతానేమోనని భయం
నీ నీడనై ఉందామంటే చీకటితో చెరిపేస్తావని భయం
వాననై వచ్చి పలకరిద్దాం అంటే
నీ గొడుగుతో గోడ కడతావనీ భయం
చలిలో చెంత చేరుదామంటే
దుప్పటితో దూరం చేస్తావనీ భయం
నీ కళ్లలో వెలుగునై వెలిగిపోదామంటే
కన్నీళ్లతో ఆర్పేస్తావనీ భయం
నీ ప్రాణమై ఉందామంటే
నీ చివరి ఊపిరిలో వదిలేస్తావనీ భయం
ఇక నిను దరి చేరే దారి లేక
మనసు ఊరుకోక
నాకు నేనే దూరమైపోతానేమో అని భయం...

- వీరబత్తిని సౌమ్య