అక్షరాలోచన

సాక్షి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలోని... తీవ్ర సంఘర్షణలకు..
నా తార్కిక తీర్మానాలకూ...
పరాకాష్ఠ.. నా సాహిత్యమే..!
నా మది వేదనలను మొరపెట్టుకునేది..
నా అనన్య స్నేహితుడైన సాహిత్యంతోనే...
నా సాహిత్యం.. తన ఏకాంతంలో...
నన్ను అనంత లోకాల్లో.. విహరింపజేస్తుంది..!
తన పారలౌకికతతో...
నాకు అలౌకికానందాన్ని అందిస్తుంది..!
చలన రహిత నిస్సారమైన నా బ్రతుకుకి...
సారవంతమైన దివ్యానుభూతి..
నా సాహిత్యమే..
నా సాహిత్యం..
నను ఓదార్చి ఒడిని చేర్చుకునే పిల్ల తెమ్మెర..!
నా సాహిత్యం...
నను లాలించి.. బుజ్జగించే ప్రియురాలు...
నాలోని.. దిగంబర భావాలకు...
సాహితీ సౌగంధ శొబగులద్ది...
గుబాళింపులతో... ఆకొన్న హృదయాలకు..
ఆనంద విందులందిస్తుంది.. నా సాహిత్యం..
నా సాహిత్యం.. కాలక్షేప బఠానీ కాదు...
కాలగమనాన్ని నిర్దేశించే గురువు...
నన్ను నేను.. నిలదీసుకునేది..
ప్రశ్నించి.. నిగ్గు తేల్చుకునేది...
నిరూపించుకుని.. నడిచేది...
నా సాహిత్యం ‘సాక్షి’గానే..!
*

-అనే్వషి 7981327110