అక్షర

‘మనీషి’ గా మారాలనుకునే వారికి మార్గదర్శి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ విశ్వామిత్ర చరిత్ర
రచన: శ్రీమాన్ తట్టా భాష్యకారాచార్యులు
మూల్యం: రూ.200/-లు
ప్రతులకు: రచయత
ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్
కమ్ లేబర్ కోర్టు, గుంటూరు
8-103/8, శ్రీరంగం, అయ్యప్ప నగర్,
జగ్గయ్య పేట-521175
9440751049
*
మనిషిలో ఆధిక్యతాభావం రావడానికి ఎన్నో కారణాలుంటాయి. మొదటి కారణం అజ్ఞానమైనా జ్ఞానమున్నవారిలోను ఈ ఆధిక్యతా భావం తొంగి చూస్తుంటుంది. మనిషిలోని స్పర్థ మనిషిని ఉన్నతుడిగా తీర్చిదిద్దడానికి పనికి వస్తుంది. అదే స్పర్థ మనిషిని అథఃపాతాళానికి నెట్టివేస్తుంది. దేనికైనా రెండువేపులా పదునుంటుంది. పదును చూసి వాడుకోవడంలోనే మనిషి నేర్పు ఉంటుంది.
ప్రకృతి మానవునికిచ్చే ఎండావాన గాలి ఇవి మనిషికి అత్యవసరమైనవి. కాని వీటివల్లే మనిషి తన ఉనికిని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కనుక సమతౌల్యత సాధించడానికే మనిషి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా ప్రాధాన్యతాక్రమాన్ని పాటించడంలోనే మనిషి విచక్షణాజ్ఞానం బయటపెడ్తుంది.
అటువంటి విచక్షణాజ్ఞానమున్నవారే రాజర్షులుగా బ్రహ్మర్షులుగా మిగులుతారు. లేకుంటే వారిలోనే ఉన్న అరిష్డ్వర్గాలకు బానిసలై ఉనికి లేకుండా పోతారు. ఈ అరిష్డ్వర్గాలను అణచాలనుకొనేవారికి మానవత్వం , సమతాబుద్ధి ఉంటే చాలు ఇంద్రియ జయం కలుగుతుంది అని చెప్పడానికి విశ్వామిత్రుని జీవితమే పెద్ద ఉదాహరణ.
ఒకసారి రాజుగా ఉన్న విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్లాడు. సర్వసైన్యంతో వెళ్లిన విశ్వామిత్రునకు గౌరవ సత్కారాలను, ఆతిథ్యాన్నిచ్చాడు. దానికి విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు.
కాని సర్వసైన్యానికి తనకు తన పరివారానికి సంతుష్టిగా భోజనాదులు కల్పించగలిగిన శక్తివంతమైన గోవు వశిష్ఠుని దగ్గర ఉండడం ఏమిటా అనుకొన్నాడు. తాను రాజు కనుక అలాంటి గోవు నా దగ్గర ఉంటే అది మిక్కిలి ఉపయుక్తంగా ఉంటుందనుకొన్నాడు. వెంటనే విశ్వామిత్రుడు వశిష్ఠునికి తనకా గోవు కావాలని అడిగాడు. గోవు తన ప్రాణమని అది కామధేనువు అని తన సర్వపనులకూ అదే కారణమని చెప్పాడు. ఏది ఏమైనా గోవు తను తీసుకొని పోవాలని నిర్ణయానికి వచ్చాడు. అదే చెప్పాడు. వశిష్ఠునిని అహం మనిషి ఉనికిని తెలిపితే ఆ అహమే ఉనికే లేకుండా చేస్తుంది మనిషికి. కాని అహంకారపు ఉనికిని తెలుసుకొని దాన్ని అణగదొక్కే సాధనమైన మానవత్వాన్ని పోగుచేసుకొంటే పోతే మహనీయులుగా మిగులుతారు.
మానవత్వం ఉంటే చాలు అహం ఎంత ప్రభావితం చేసినా మనిషిని అణగదొక్కలేదు. విశ్వామిత్రుడు రాజుగా వుండి వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ వశిష్ఠుడు అలసిపోయిన విశ్వామిత్రునికి, అతని పరివారానికి, సైన్యానికి వారికిష్టపూర్వకమైన ఆతిథ్యాన్ని ఇస్తాడు.
దానికి సంతృప్తిచెందుతారు విశ్వామిత్రులు.
కాని ఒక తాపసి, అందులోను అడవుల్లో కుటీరంలో ఉండే తాపసి దగ్గర ఇంత మహత్తరమైన గోవు ఉండడం దానివల్ల ఇంతమందికి ఆతిథ్యమివ్వడం ఏమిటి? నేను రాజును గనుక అది నా దగ్గర ఉంటే మరింత బాగుంటుంది అనుకొన్నాడు. వెంటనే వశిష్ఠుని గోవునిమ్మని కోరాడు. వశిష్ఠుడు దాని కంగీకరించక గోవు తన ప్రాణమని, దానివల్లనే యజ్ఞయాగాదులు కొనసాగుతున్నాయని చెబుతాడు. అది పట్టించుకోని విశ్వామిత్రుడు తన క్షాత్రబలాన్ని ఉపయోగించి గోవును తీసుకెళ్లాలని కోరుతాడు.
వశిష్ఠుడు ఆ ఆతిథ్యమిచ్చిన గోవు సాయంతోనే విశ్వామిత్రుని భయకంపితుణ్ణి చేస్తాడు. దాన్ని చూసి తనకు లేనిది వశిష్ఠుని దగ్గర ఉంది కనుక దాన్ని నేను కూడా పొందాలి అందరికన్నా అధికుడిని అవ్వాలని అనుకొన్నాడు.
వెంటనే రాజరికాన్ని వదిలివేసి తపోభూమికి వెళ్లాడు. ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. ముల్లోకాలు తల్లడిల్లేలా తపస్సు చేశాడు. దేవతలు భయపడ్డారు. ఇంద్రుడు అనేక విఘ్నాలు కలిగించాడు. వాటిని తట్టుకోవాలనుకొన్న విశ్వామిత్రుడు ఒకసారి త్రిశంకుకు, మరో సారి శునశే్శపునకు, మరోసారి మేనకకు తల వంచాడు. వీటి అన్నింటిలోను విశ్వామిత్రునిలోని మానవత్వం తొంగిచూసింది. కనుకనే చివరకు రాజర్షి కాదు బ్రహ్మర్షి పదవిని పొందాడు.
ఇలానే ఏ మానవుడైనా అహంకరించకుండా తాను అనుకొన్నపనిని సాధించాలనుకొంటే సన్మార్గంలోనే సాధించవచ్చు అని నిరూపణ చేశాడు. ఈ అర్థవంతమూ అంతరార్థము కలిగిన ఈ విశ్వామిత్రుని కథను ‘‘శ్రీ విశ్వామిత్ర చరిత్ర’’ అను నాపేరుతో శ్రీమాన్ తట్టా భాష్యకారాచార్యులు గారు రామాయణాంతర్గతమైన కథను స్వకపోల కల్పనలతో మూలకథ చెడకుండా అతి సులభగ్రాహ్యంగా అలతి అలతి పదాలతో తెలుగుభాషా సొబగులను అందంగా అమర్చడమే కాక చక్కని నాటకీయశైలితోను అతి రమ్యంగా పాఠకులకు సుశ్రావ్యంగా కథను నడిపించారు. మధ్యలోరంగు రంగుల చిత్రాలను అమర్చి మరింత కథను ఆకర్షణీయంగా ముద్రించడం పాఠకులకు ఆసక్తి కలిగించడంలోనే కాక విశ్వామిత్రుని కథ కళ్లకు కట్టినట్లుగా తీర్చిదిద్దడంలో రచయితకు కథపై ఉన్న పట్టు ఆసక్తి కనబడుతాయి. ఈ తట్టా భాష్యకారాచార్యుల గారి శ్రీ విశ్వామిత్ర చరిత్ర పఠితులందరికీ ఆనందాన్ని కలుగుచేస్తుంది.

-రాయసం లక్ష్మి