అక్షర

పరిచయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తునకలందని దండెం
-డా.మంథని శంకర్
వెల: రూ.100/-
ప్రతులకు: రచయిత
08374354873
**
ఎంత గొప్ప కవిత్వమయినా తక్షణ సందర్భాల్నుంచీ, తత్కాల సమయ సన్నివేశాల నుంచీ పుట్టుకొస్తుందని ఒక నమ్మకం. కవి బయటి ప్రపంచం నుంచో లోపలి ప్రపంచం నుంచో కవిత్వాన్ని పురిగొల్పే వనరు కవికి అందుతుంది. దానికి కవి నుంచి వెలువడే కళాత్మక ప్రతిస్పందన కవిత్వంగా పాఠకులకి అందుతుంది. అందుకే కవిత్వానికి వివరణలూ, పరిచయాలూ అవసరం లేదని చాలామంది చెబుతూ ఉంటారు. నిజమైన వివరణ అధ్యయనం ద్వారా ఆస్వాదన ద్వారా పాఠకులే పొందగల్గినప్పటికీ కవిత్వ పరిచయాలూ, ముందు మాటలూ కొంత దారిని సుగమం చెయ్యటానికి పనికిరావచ్చు. డా.మంథని శంకర్ కవిత్వం - మాదిగ దండోరా ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాకార ఉద్యమం, మూలవాసీ తాత్వికత - వీటికి తోడు తన సాంఘిక మూలాలు బాగా ప్రభావితం చేశాయి. వీటికి తోడు పర్యావరణ ఉద్యమాలూ, గ్లోబలైజేషన్ క్రమంలో జరిగిన మానవ, ప్రకృతి విచ్ఛిత్తి ఈ కవిని కదిలించాయి. రోజురోజుకు మాయమవుతున్న మానవ విలువలు కలవరానికి గురి చేశాయి. మంథని శంకర్ కవిత్వం మనకు బాగా బోధపడుతుంది.