అక్షరాలోచన

సడక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నప్పుడు మా అమ్మ
అప్పుడప్పుడు పొద్దునే్న లేపి
పాలు తేవడానికి పంపేది.

మసక చీకట్లను విసర్జిస్తున్న
సడక్ మీద
బిక్కుబిక్కుమంటూ వెళ్లేవాడిని.
దానిపై నేను నడుస్తున్నట్టు కాక
అదే నన్ను నడిపిస్తున్నట్టు అనిపించేది.

కుక్కలు కళ్లు తెరిచి చూసి
మళ్లీ పడుకునేవి.
తోకలూపటానే్న చూస్తాం గాని
వాటి కనులలోని
ప్రసన్నతనూ దిగులునూ పట్టించుకోం.
అభావం అనిపించేదంతా
ఒక గర్భిత భావం అని తెలుసుకోం.

పాలు తీసుకొని వెనుకకు మళ్లేటప్పటికి
సడక్ ఒళ్లు విరుచుకొని లేచేది.
సడక్‌కు చిన్నచిన్న సందులు
కాలువల్లా అంటుకొని ఉండేవి.
సందుల్లో పాదాలు మొలుస్తుంటే
సడక్ సైకిళ్లతో దర్పాన్ని ప్రదర్శించేది.

సడక్ ఇప్పుడు లేదు
కాని నా జ్ఞాపకాల్లో
మలుపులు తిరుగుతూనే ఉంది.
ఇప్పటికీ ఆ ప్రాంతంలో గాలి
సడక్‌ను వెతుక్కుంటూ వీస్తుంది.

-డా.ఎన్.గోపి