అక్షర

శ్రీకృష్ణదేవరాయలపై పరిశోధనా గ్రంథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణదేవరాయలు
(పరిశోధనా గ్రంథం)
-్భట్టరుశెట్టి పద్మారావురాయలు
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
--

సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీ కృష్ణదేవరాయలపై లోగడ చాలా గ్రంథాలు వచ్చాయి. రాయలవారిని గురించి విపుల పరిశోధనలు జరిగాయి. ఐతే రాయల కులము- నాగమాంబ వంశము- రాయల స్వస్థలము- గూర్చి కొన్ని అనుమానాలు మిగిలిపోయి ఉన్నాయి. ఆమధ్య రుబాదేవి గూర్చి ఒక పుస్తకం వచ్చింది. అందులో అన్నపూర్ణాదేవి గూర్చి అనూహ్య ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు రాయలవారు చంద్రవంశ బలిజ క్షత్రియుడు అని నిరూపిస్తూ భట్టరుశెట్టి పద్మారావు రాయలు ఒక గ్రంథం వెలువరించారు. ఇప్పటికే ఇది మూడు ముద్రణలను అందుకుంది అంటే దీనికిగల ప్రాచుర్యం మనం తేలికగానే ఊహించుకో వచ్చు. రాయలు కమ్మ కులస్థుడని నమ్మే సిద్ధాంతాన్ని ఈ గ్రంథం పరాస్తం చేస్తున్నది. అతడు కాపు క్షత్రియుడేనని ఘంటాపథంగా ఈ గ్రంథం ఘోషిస్తున్నది.
ఇందులో ఎన్నో వివాదాస్పదమైన చారిత్రకాంశములకు రచయిత తనదైన శైలిలో తీర్పులు వెలువరించారు. కృష్ణరాయలు తెనాలి రామలింగ కవి కమ్మవారు కాదు (తొలి పలుకు.)
‘‘క్రముడిసంతతి వారైన దుర్జయుడు కమ్మకులస్థులకు మూలపురుషుడని వ్రాసుకున్నారు. కృతయుగంలో కమ్మకులము ఉందా?’ అని రచయిత ప్రశ్నించారు (15వ పుట.) తెలంగాణా మూలవాసులు కాపులు అని తీర్మానించారు (17వ పుట.)
నా దృష్టిలో కమ్మవారు గొప్పవారే కాపువారూ గొప్పవారే. కాని వర్తమాన చిరంజీవి- చంద్రబాబు రాజకీయాలతో ప్రాచీన చరిత్రను వ్యాఖ్యానించలేము. ఈ గ్రంథంలో రచయిత ఎంతో అభినివేశంతో చరిత్ర నుండి సాక్ష్యాధారాలు సేకరించారు. కూర్మవంశము- సూర్యచంద్ర వంశక్షత్రియ కాపు గురించి సచిత్ర ప్రమాణాలు చూపించారు (పుట.22).
అంతేకాదు వీర క్షత్రియ బలిజలు మొత్తం ప్రపంచాన్ని పాలించినట్లు కొన్ని ఆధారాలు చూపించారు (పుట: 51). ఇందులో భారతదేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఆఫ్రికావంటి దేశాలుకూడా ఉన్నాయి. ఇందుకు వారు కొన్ని శాసనాలను ఉదహరించారు. అంతేకాదు ఆనాటి శ్రీకృష్ణదేవరాయల బంధువులు నేడు ఎవరెవరు ఉన్నారో వారి వివరాలు కూడా రచయిత శ్రమపడి సేకరించి అందజేయటం ముదావహం.
వృత్తిరీత్యా వ్యవసాయదారుడైన పద్మారావు రాయలరావు ఇలాంటి సాహితీ వ్యవసాయం చేయటం ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించే విషయం. రాయలవారి గూర్చి జరుగుతున్న సుదీర్ఘ పరిశోధనా ప్రస్థానంలో ఇదొక ఘట్టం. భట్టరువారి ప్రతిపాదనలు అంగీకరించనివారు కూడా భట్టరు గ్రంథాన్ని చదివి వారి పరిశోధక మేధాశక్తిని అభినందించాలి. ఇందలి విషయాలను ఔను అనడానికి కాదు అనడానికి కూడా పాఠకునికి సుదీర్ఘ చారిత్రక అనుభవం ఉండి తీరాలి. ఎందుకంటే భట్టరు రచన ఆషామాషీ గ్రంథంకాదు. ఫిక్షన్ అంతకన్నాకాదు. 93వ పుటలో రాయలవారు యదుకులస్థుడు కాడు అని వారు పారిజాతాపహరణమునకు చెప్పిన వ్యాఖ్యానం మనోరంజకంగా ఉండటమేకాక వారి సాహిత్యప్రతిభను సూచిస్తున్నది.

-ముదిగొండ శివప్రసాద్