అక్షరాలోచన

చెమట సంతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్న నేనొక
కన్నీటి బొట్టు మీద సంతకం పెట్టాను
నిప్పురవ్వల ఎగిరిందేమిటీ?
లాఠీల ప్రశ్న
అది
అమరుల ఆత్మత్యాగం నుండి వచ్చిన కన్నీరు
రైతుల ఆత్మహత్యల నుండి వచ్చిన కన్నీరు
వాడిపోయిన చెట్టు వేడివేడిగా కార్చిన కన్నీరు
ప్రపంచాన్ని దహించే కన్నీటి బొట్టు మీద
సంతకం పెట్టాను తెలుసా?
ప్రపంచ కన్నీరు నా కన్నీటిలో కల్సిపోయింది
అది వరద
ఒక బురద
ఎగిసిపడే జలపాతం
ఎగిరిపడే సాగరం
నా కన్నీటి బొట్టుకు చెమట చుక్కకు
సంబంధముంది
శ్రామికులని గుండెల్లో రగులుతున్న కసి మంటకు
సంతకానికి బంధం ఉంది
నా సంతకం ఎగురుతున్న జ్వాల
నా సంతకం తూర్పురేఖల స్వప్నం
నా సంతకం పిడికిలెత్తిన ఎర్రజెండా

-సిహెచ్.మధు 9949486122