అక్షరాలోచన

దేవుని గోడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ చిన్నారి ఆలోచన
కనువిప్పు...
మనస్సు కంచెలను
తెంపుకొని
నేను వెళ్తున్నాను...
చలికి వణికే
దేహానికి
నా పాత రగ్గులేమైనా...
రాళ్లూ ముళ్లుగా
నడిచే పాదాలకు..
కొంతైనా...
మూలకు విడిచిన
పాదరక్షలు...
చిల్లులు పడ్డ
పాలితిన్ కవరుగా
తడుస్తున్న దేహానికి
పాత గొడుగుతో..
ముల్లెలుగా
కట్టిన బట్టలకు
పాత బ్యాగేమైనా..
ఇంకా ఇంకా...
ప్రార్థించే పెదవులకన్నా
సాయంచేసే చేతులు..
ఓ గొప్ప అనుభూతి
చిన్నారి మనస్సును
అభినందిస్తూ...
ముద్దాడాను
దేవుని గోడను!

-మడిపల్లి హరిహరనాథ్