అక్షరాలోచన

అద్వైతమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిమళ శ్వాసతో పరవశిస్తున్న నిశ్శబ్దం
ప్రాగుదిత చరణ స్పర్శకు
తొంగలి ఱెప్పలెత్తి
మంగళ గళం విప్పింది
పుడమి ఒత్తిగిలినట్టు పుటను త్రిప్పుతూ వాడు-
రస పౌత్తికంలో తడిసిన పద సౌమనస్యాన్ని పద్యం చేస్తూ
ఆ క్షణాన్ని అనుభూతిగా శాశ్వతీకరించే
పదచిత్ర భంగిమల్ని వెలారుస్తూ వాడే-
లోకం నుండి భిన్నం కానిదాన్ని లోలుపజేసి
కలలు నేస్తూ - కౌముదులు కాస్తూ
పడవలు చేస్తూ - ప్రయాణం సాగిస్తూ
వాడు కవి...

కనె్నత్తి వీధి వీధికి కళలుకు కానికమాడలిచ్చే
కలువ గొంగకి తిరునాళ్ల ప్రభలు కడుతున్నాడు
రహస్య గర్భిత వర్ణ ఖనిజాన్ని కొల్లగొట్టి
నెలవెలుగునిచ్చే రాకాశశిని నిలబెడుతున్నాడు
ఆకాశపు నిట్టూర్పుల్ని అంబుధి నీళ్లతో కడిగి
అవని మీదకు రమ్మని ‘వాన కాళ్ల’ను పట్టుకుంటున్నాడు
నదులు కంటున్న స్వప్న క్షేత్రాల్లో
నారుమళ్లను తడిమే ఆర్ద్ర హృదయానికి అంటుకడుతున్నాడు
మంచుబొట్టులో రంగులు ముంచి పారబోసుకుంటూ
వనాంతిక వసంతానికి నాక్చిత్రాన్నందిస్తున్నాడు
పాలబాట ఉషః ప్రవాహంలో మునిగిన మరుక్షణమే
ప్రపంచానికి తనని తానే పరిచయం చేసుకుంటూ - వాడు కవి
ఏకాంత గురుత్వాన్ని ఆశ్రయించి
దీక్షగా మానవతా నిర్మాణ శిల్పాన్ని క్రోడీకరించినవాడు
క్రియా పరత్వ క్షణాల్ని కైవసం చేసుకుని
జాతి వక్షశ్శాద్వల సీమ మీద కవోష్ణ కిరణాల
హిరణ్యం వెదజల్లేవాడు
ఏడాదికోసారి - ఏటా
కాలపు చైత్రమంజరి మీద ఎగురుతున్న కలాలాపాన్ని
ఒళ్లంతా కళ్లు చేసుకు వింటూ
ఆత్మని అధివాసంగా మలచుకునేవాడు
భావ చేతనాభిమర్శతో ఈ సృష్టిని ప్రతిష్ఠ చేసి
దాన్ని జీవన సంగ్రామంగా - ఏ
మానవ నాయకత్వానికి అప్పగిస్తున్నాడో - వాడు కవి

శక్తి సముద్భూత శైవలినీ రసోర్మిక
ఆత్మశరీరాన్ని అభ్యంజనించింది
అభివ్యక్తి పరాకాష్ఠ దిశగా ప్రవహిస్తున్న కాలం
శబ్దమై నన్ను పెనవేసుకుంటూ
పగలు మండే మార్తాండ మండల యాత్ర చేసింది
రాత్రి కాగానే నక్షత్ర నభో మండలాన్ని తాకింది
అనువీలనాసక్తమైన సామాజిక సందర్భమొకటి
నాలోంచి కవిని
కవిలోంచి నన్ను
వేఱుచేయలేని ఎఱుకను ఏకరువు పెట్టింది
ప్రజల్లోంచి వచ్చాను కదా
ప్రజల్లోకే పోతాను..!

-సాంధ్యశ్రీ, 8106897404