అక్షర

వందేళ్ల జ్ఞాపకాల కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం కథలు
కథల సమాహారం
(1911-2016)
సంపాదకురాలు: జ్వలిత
ప్రతులకు: అన్ని
ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
---

1905 తర్వాత వరకు వరంగల్ ఖమ్మం రెంటినీ కలిపి ఖమ్మం జిల్లాగానే పిలిచిన నేపథ్యంలో 1911నుంచి ఖమ్మం కథల సమాహారమే రుూ సంకలనం. ఖమ్మం జిల్లాకు విభజనకు పూర్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, విభజనాంతరము తెలంగాణా రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానం వుంది. ఆ ప్రాముఖ్యం రాజకీయంగా కావొచ్చు, సాంస్కృతికపరంగా కావొచ్చు, పరిశ్రమలు గనులుపరంగా కావొచ్చు, రాజకీయ చైతన్యం కావొచ్చు రాష్ట్ర సరిహద్దు జిల్లాగా కావొచ్చు, ఖమ్మం ఎనలేని ప్రత్యేకతను సాధించుకున్నది. ఖమ్మం జిల్లాలో మునేరు, గోదావరి, కినె్నరసాని నదులు ప్రవహిస్తున్నాయి. చరిత్ర చెబుతూనే వుందిగా, నదీ పరివాహక ప్రాంతంలో నాగరీకతతోపాటు చైతన్యం, సంస్కృతి మరియు సాహిత్య పరవళ్ళు వుంటాయని! ఆ విధంగా జిల్లా ఆసాంతం సాహిత్య సంస్కృతులకు కొదవ లేదు.
1911నుండి 2016 వరకు ఖమ్మం జిల్లాకు సంబంధించిన వివిధ రచయితల రచయిత్రుల ఆణిముత్యాల్లాంటి కథలను ఎన్నుకుని, వ్యయప్రయాసలకోర్చి ఒక సంకలనంగా తెలుగు రాష్ట్రాలకు, యావత్ సాహిత్య లోకానికి అందించారు ప్రముఖ రచయిత్రి, విజయకుమారి దెంచనాల (సాహిత్య నామం: జ్వలిత). ఈ విధంగా ఖమ్మం జిల్లా సాహిత్యాన్ని పునశ్చరణ చేసుకోవడానికి చక్కని అవకాశం లభించింది. ఈ జిల్లా మొట్టమొదటి కథకులుగా జిడికంటి రామారావు కథ ‘వసంతబాల’ 1911లో కృష్ణాపత్రికలో ప్రచురించబడింది. ఆ విధంగా 1911నుండి 2016వరకు 104 ఆణిముత్యాల్లాంటి కథలను ఎన్నుకుని ప్రచురించబడిన ‘సంకలనమే’ ఖమ్మం కథలు. వీటిలో చారిత్రిక, రాజకీయ, నేర పరిశోధక, సామాజిక, ఆర్థిక అంశాలతో కథలు అల్లబడ్డాయి. 2011నుండి ఈనాటి వరకు తెలుగు భాషలో వచ్చిన మార్పులు, జీవన సరళి, మార్పుతెచ్చిన పరిస్థితులలో మారిన మనస్తత్త్వాలు, ఆధునిక జీవన ప్రభావం, వ్యథలు, బాధలు, పోరాటాలు, రాజకీయ పోకడలు చిత్రీకరిస్తూ పరిపూర్ణతను సంతరించుకుంది రుూ సంకలనం. ఒక రకంగా జిల్లా చరిత్రకు దర్పణంగా, ఒక చక్కటి కుదుపులు లేని ప్రయాణంలాంటి అనుభూతినిస్తుంది చదువుతుంటె!
ఇందులో లబ్ధప్రతిష్టులైన కథకులతోపాటు ఈ కాలపు వర్ధమాన రచయితలకు కూడా అవకాశం కల్పించడం జరిగింది, ప్రస్తుతం కూడా రేపటి చరిత్రలో భాగమేనన్న సత్యం గుర్తించినట్లుగా!
తెలంగాణా సాంస్కృతిక వికాసానికి ఖమ్మం జిల్లా తోడ్పాటు గణనీయమైనది. ప్రత్యేక రాష్ట్ర బునాది రావెళ్ళ వెంకటరామారావుగారు యువకవిగా/ రచయితగా వున్నప్పుడే పడిందని వారి ఇంటర్వ్యూ చెబుతుంది. తెలంగాణా సాకారం ఈనాటికి సాధ్యమైందని చెబుతూనే ‘రాళ్ళు మోసినవాళ్ళు కొందరైతే అందలమెక్కినవాళ్ళు వేరే’ అని సంకలనకర్త తన ‘మాట’గా చెప్పారు. రావేరా యింటర్వ్యూతోపాటు మిగతా నూటాముగ్గురి వివరాలు గ్రంథంలో పొందుపరిచారు.
ఖమ్మం జిల్లాకి సంబంధించి ఈ గ్రంథం కథాసాహిత్య విషయంలో ఒక రిఫరెన్స్ బుక్‌గా ఉపయోగపడుతుంది. ఈ మొత్తం కథాసాహిత్యాన్ని కాలక్రమంలో ఐదురకాలుగా చెప్పుకోవచ్చు.
క్రీ.శ.1930కు ముందు కథలు: వాసి తక్కువైనా వైవిధ్యభరితమైన కథలు
1931-56 నాటి కథలు: సృజనకు ప్రాధాన్యతనిచ్చిన కథలు
1956-70 నాటి కథలు: తొలితరం విద్యావంతుల నుండి వచ్చిన కథలు
1971-83 కాలంలో విరివిగా కథాసంకలనాలు వెలువడ్డాయి.
1983-2016: రాసి పెరిగినప్పటికీ కొన్నింటిలో శైలి, భాష శిల్పం అన్పించాయి.
కొరవడి వాసి, స్థాయి తగ్గినట్లుగా అన్పించాయి. మంచి సంకలనాన్ని తెలుగు పాఠకలోకానికి అందించిన జ్వలిత అభినందనీయులు. ఇందులోని కథలు కాలగమనంలోని మార్పును గూడా ప్రతిబింబించాయి.
ఇందులో: సర్వశ్రీ అయితరాజు, జీడికంటి రామారావు, మాడపాటి రామచంద్రుడు, దాశరథి సోదరులు, హీరాలాల్ మోరియో, ఇ.సరస్వతీదేవి, ఇ.నీలకంఠరావు, ఆదిరాజు, ఊటుకూరి రంగారావు, పుల్లాభొట్ల, ధూపాటి, దిలావర్, రావులపాటి సీతారామారావు, పసుపులేటి మల్లిఖార్జునరావు, డా.హరిష్, చావా శివకోటి, అఫ్సర్, రాళ్ళబండి, యాకూబ్, రాధాహిమబిందు, షాజహానా, సబ్బరాజు గోపాలరావు, ఇందిరాదేవి మొదలైనవారి కథలు వున్నాయి.

-రావులపాటి వెంకటరామారావు