అక్షర

ప్రణయ భావవాహిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రణయవాహిని
-అంబటిపూడి వెంకట సుబ్రహ్మణ్య శాస్ర్తీ
వెల: రూ.50/-
ప్రతులకు: రచయిత
1-36/1/12, సిఎన్‌ఆర్ బ్లాక్ 1/101
సిఎంఆర్ రెసిడెన్సీ,
ఎమ్.ఎన్.ఆర్.స్కూల్ ఎదురుగా
వేమన కాలనీ రోడ్డు
చందానగర్
శేరిలింగంపల్లి - 500 050
**

అంబటిపూడి వెంకటరత్నం గారి ప్రణయ వాహిని ఎనిమిది దశాబ్దాల క్రితం వ్రాయబడిన కావ్యం. భావ కవిత్వ శ్రేణికి చెందినది. ఇందులో నాయికా నాయకులు అనుకోకుండా కలుసుకోవడం, పరస్పరం వారి భావాలను పంచుకోవడం ఇందులో మనకు కన్పిస్తుంది. నాయిక నిరాశ్రయంగా, నిరాదరణకు గురి అయినది కాగా నాయకుడు రసభరితమైన కావ్యాది, గానముతోపాటుగా వైరాగ్య స్థితిని సూచించే పరిసరాల నడుమ ఉంటూ ఉంటాడు. వీరి పరిచయం స్నేహమై ప్రణయమవుతుంది. దీనినే ప్రతీకగా చెబుతూ కవి కావ్యారంభంలో ఆకాశము, మబ్బు వర్ణనలతో మొదలుపెట్టి మధ్యలో చిరువర్షపు జల్లులను వర్షించి కావ్యం చివరిలో సముద్రంలో కలిసిపోవడాన్ని చెప్పారు. బాల్యంలో తనవారి మధ్య ప్రేమ పంచుకుని తిరిగిన నాయికకు కలలు కల్లలు అవుతాయి. దాంపత్య ప్రేమ కూడా దూరమై నిరాదరణకు గురి అయిన స్థితిలో వున్న ఆమెకు కవి, గాయకుడు అయిన నాయకుడు కనబడతాడు. అతడు కూడా భావావేశం కలవాడైనా తెలియని అనిశ్చిత స్థితిని అనుభవిస్తూ వుండేవాడు. నాయకునిలోని గానకళకు, రచనా శక్తికి నాయిక ముగ్ధురాలవుతుంది. నాయకుడు ఆమె కష్టాన్ని కడతేర్చాలని ప్రయత్నించి అనునయిస్తాడు. ఆమె తన ఆవేదనను వెలిబుచ్చుతుంది. ఈ క్రమంలో కవి బాల్య వివాహాల కష్టనష్టాలను విశే్లషించారు. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ లాంటి ఆడపిల్లల వ్యధాభరిత జీవితాన్ని కరుణ రసాత్మకంగా వర్ణించారు. వితంతు పునర్వివాహాలు కూడా తప్పు కాదంటూ సంస్కరణల దృష్టితో చెబుతారు. దీనిలో కన్యాశుల్క నిరసనం కనిపిస్తుంది. స్నేహం అనంతమైన శక్తినిస్తుంది. అది కనబడని మహానందాన్ని ఊరించి ఇస్తుంది. ఆ స్నేహ బంధం ప్రాణికోటిని ఒకరినొకరు విడిపోకుండా బంధిస్తుంది అని స్నేహం గొప్పదనాన్ని వర్ణించిన కవి స్నేహ కారణంగానే కష్టం తీర్చాలని అనుకుంటాడు. తనలోని సందిగ్ధాన్ని విడిచిపెడతాడు. అంతరంగమనే సింహాసనంపై నీవే పట్టమహిషివి అని కవి హృదయంలో నాయికను ప్రతిష్ఠించుకోవడంతో వారి ప్రణయం చిత్రితమైంది. అంతలో శిశువు రోదన వినిపిస్తుంది. ఆ పసికందు నిరాదరణకు గురి కావడాన్ని చూసి వారు చలించిపోయారు. శిశువుపై జాలిపడి అక్కున చేర్చుకుంటారు. వారి లో వాత్సల్యం పెల్లుబుకుతుంది. సమాజంలోని ఇటువంటి హేయమైన పరిస్థితుల గురించి వారి హృదయం ద్రవిస్తుంది. ఇందులో అనాధ శిశు స్వీకారం అనే అంశాన్ని కవి ప్రతిపాదించారు. మొత్తం మీద ఈ పుస్తకంలో ప్రకృతి వర్ణన ప్రధానంగా కనిపిస్తుంది. సందేశం ఉంది. రసాత్మకమై ఉంది.

-కె.లక్ష్మీ అన్నపూర్ణ