అక్షర

గందరగోళం దద్దరిల్లింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకుపచ్చ అంటుకుంది
రచన: ఎస్.గణపతిరావు
పుటలు: 160
వెల: రు.100
ప్రతులకు: విశాలాంధ్ర
బుక్‌హౌస్, నవచేతన
రచయిత ఫోన్ నెంబర్: 9176282903/
9652294856
---

ఆకుపచ్చ మీద మరికొన్ని రంగులతో కవర్‌పేజీ వుంది. దానిమీద పైభాగంలో రచయిత పేరుంది. ఆ పేరుమీద ‘కాళోజీ ఆరాధించే రచయిత’ అనే అక్షరాలున్నాయి. ఈ రచయితను కాళోజీ నారాయణరావు ఆరాధించాడా? అవుననడానికీ కాదనడానికి ఆయన లేడు. ఈ కాళోజీ, ఆ కాళోజీ కాదంటే మనకు తెలియదు. రచయిత పేరుకింద, ‘అమ్మ ముక్కుపుడక మెరిసింది’ అని ఒక మాట ఉంది. ఆది పుస్తకం పేరు కాదు. ఎందుకంటే కవరుపేజీ కిందభాగంలో ‘ఆకుపచ్చ అంటుకుంది’ అని పెద్ద వణుకుతున్న అక్షరాలున్నాయి. అది పుస్తకం పేరు అయ్యుంటుంది. ఆ పేరుమీద ‘అక్షరాలు భూమి మీద నక్షత్రాలు’ అని ఒక మాట ఉంది. ఏమిటో? పేరు కింద ‘్భన భోంతరాళాలు దద్దరిల్లే కథలు’ అని రాసి ఉంది. అంటే కథలలో ఆ తీరు కదలికలుంటాయా? కథలు కష్టపడి చదివితే అటువంటిది ఏమీ లేదని అర్థమైంది.
పుస్తకంలోకి దూరి ముందుకు సాగితే మొత్తం 14 కథలున్నాయని తెలిసింది. ఈ కాలం తెల్గు సినిమాలకు లాగ ప్రతి కథకు ఒకటి రెండు సబ్ టైటిల్స్ ఉన్నాయి. ఇంకా ముందుకు పోతే ముందు మాటలు మెప్పికోళ్లున్నాయి. మళ్లీ పేజీ తిప్పితే, ఇటు పేజీలో ఒక కథ (అది కథ కాదు) ఆటు పేజీలో ఓ బొమ్మ. అది ఆ తరువాత కథకు సంబంధించినది. పేజీ తిప్పితే కార్ఖానా గొట్టం పొగ బొమ్మ. అందులోనే ఒక కథా పరిచయం. అటు పేజీలో అమ్మయ్య! కథ చదివితే బాగుంది. పిల్లల కథ బాగుంది. కానీ పత్రికలోలాగ మిగతా 46వ పేజీలోనట! ఎందుకో?
ప్రతి కథకు పేజీనిండా బొమ్మ. తిప్పితే మరో కథ పరిచయం. దానివెనుక మళ్లీ అదే పాత పొగబొమ్మ. రెండవ కథ శీర్షిక ఏమిటి? ‘ఆకాశంలో సిరాబుడ్లు’. కథ మొదట్లోకి వచ్చేసరికి అది కనిపించలేదు. ఈ కథ మామూలుగానే అయిపోయింది. చెప్పొద్దు కథ బాగుంది. కానీ ఏమీ దద్దరిల్లలేదు. ఆ తరువాత పేజీ నింపిన ‘మంటల యుద్ధం’ ఏమిటది?
ఇదండీ వరస గందరగోళం.
ఇంతకూ కథలు ఎలాగున్నాయని ప్రశ్న! బాగున్నాయి. కొంచెం మామూలుగా ఉన్నాయి. కొంచెం కొత్తగా ఉంటే ఉన్నాయి. కానీ రచయిత ఇంతవరకు ఏ ప్రచురణ కర్త ప్రచురించని ఏ రచయితా రాయని కథలు అని రాసుకోవడం ఒక విచిత్రం. మరెవరో ఈ తరహా కథలు రాయలేదనా? ఈ కథలు రాయలేరనా?
ఎవరి పుస్తకం వాళ్లు వేసుకోవడంలో వెసులుబాటు ఉంది. కానీ, కొంచెం సమస్య కూడా ఉంది. మనం ‘నవ్యత‘ అనుకుంటున్నది అందరికీ నచ్చుతుందా? ప్రమాణాలు, పద్ధతులు అవసరం లేదు నిజమే! కానీ గజిబిజి బాగుండదు కదా!
రచయిత తమ ధోరణిని కథలలో బాగానే చూపించారు. భయం అవసరం లేకుండా ఈ కథలను చదవవచ్చు. ఇక ఇప్పటికే మెచ్చుకున్న వాటి గురించి ఇక్కడ అనవసరం! ప్రసిద్ధులు కావాలంటే, ఏవేవో చేయాలి? ఆ తరువాత వేచి చూడాలి!

-గోపాలం కె.బి.