అక్షర

సంగ్రహ గ్రీకు పురాణ గ్రంథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రీకు పురాణగాథలు
ఆదిరాజు వీరభద్రరావు
ప్రతులకు: అన్ని
ప్రముఖ పుస్తక కేంద్రాలలో
---

గ్రీసు దేశాన్ని ‘మీనియేచర్ ఇండియా’అని పిలుస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం ఈ రెండు దేశాల మధ్యగల సాహితీ సాంస్కృతిక సారూప్యాలే. మన దేవీదేవతలు అష్టాదశ పురాణాలు యధాతథంగానూ పరిమితంగా రూపాంతరం చెందిగాని కన్పడుతాయి. మన శివుడు విష్ణువు హనుమంతుడు, దుర్గ, అర్జునుడు, భీష్ముడు, రావణుడు- సీత అందరూ గ్రీకు పురాణాలల్లో ఉన్నారు.
ఆదిరాజు వీరభద్రరావుగారు ఉత్తమ పరిశోధకుడు. ఆయన చాదర్‌ఘాట్ స్కూలులో పనిచేస్తున్న రోజుల్లో కొందరు క్రైస్తవ విద్యార్థులు హిందూ పురాణ గాథలలోని అంశాలను పరిహసించారు. అప్పుడు వీరభద్రరావుగారు గ్రీకుపురాణాల నుండి కొన్ని కథలు ఏర్చికూర్చి ఒక పుస్తకం ప్రకటించారు. చాలా దశాబ్దాల తర్వాత తిరిగి ఆ గ్రంథాన్ని ఇప్పుడు పునర్ముద్రించటం ముదావహం. ఇందులో నిజానికి ఇలియడ్- ఒడిస్సీ వంటి ప్రధాన గ్రీకు ఉద్గ్రంధాలు లేవు. ఒక పుట పరిమితిగల గ్రీకు పౌరాణిక వీరుల జీవిత పరిచయగాథలు ఉన్నాయి. ఇది ఒక రకంగా సంగ్రహ గ్రీకు పురాణ గ్రంథం అనవచ్చు. జియస్ జ్యూపిటర్ అనే వ్యాసం ఉంది. గ్రీకు పురాణ రచయితలంతా ఇలాగే వ్రాశారు. కాని జియస్‌లో దేవేంద్రుని లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈయన భార్య శచీదేవి. గ్రీకు పురాణాలల్లో ఈమెను హీరా అంటారు. మన చంద్రుడు వారి ఎండిమియాన్. గ్రీకు-రోమన్- ఇండియన్ పురాణాల తులనాత్మక అధ్యయనం చేస్తే ఎన్నో అద్భుతమైన అంశాలు ఆవిష్కరింపబడుతాయి. ఈ చిన్నగ్రంథం అలాంటి పరిశోధకులకు ప్రాథమిక సమాచారాన్ని అందించగలుగుతుంది. ఇందులో దాదాపు 60 మంది దేవీదేవతల పరిచయ వ్యాసాలున్నాయి.

-ముదిగొండ శివప్రసాద్