అక్షరాలోచన

స్వేచ్ఛా సప్తతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా దేశం ఒంటినిండా
వింతలు విశేషాల రాసులు
గుసగుసలు - రుసరుసలు
చెట్టాపట్టా లేసుకుంటాయి
వచ్చీపోయే ప్రతి పండుగ జాతర
మా సంస్కృతికి పునర్నవీకరణ
ప్రజాస్వామ్యం వైవిధ్యాలు
ఉద్యమాలకు ఊపిరిలూదుతుంటాయి
ప్రగతి రథాన్ని పటిష్ఠ పథములో
నడిపిస్తూ మెరిపిస్తుంటాయి
స్వేచ్ఛా యామిని దరహాసములోని
మురిపాల తళుకుల ప్రతిబింబాలు
డెందములో పులకింతలు అలుకుతుంటాయి
సంఘటనల హారాన్ని అలంకరించుకున్న చరిత్ర
స్ఫూర్తి కణికలను వెదజల్లుతుంది
ఆకాశంలో బారులు తీరిన
స్వేచ్ఛా విహంగాల్లారా!
మా జాతీయత నడయాడిన హెచ్చుతగ్గుల్ని
విచక్షణ ముక్కులతో అంచనా వేయండి
డెబ్బై వసంతాల సాక్షి
ఒడిదుడుకుల ఆమూలాగ్రాన్ని
బతుకు పుస్తకంలో నమోదు చేస్తుంది
స్వపరిపాలన రెక్కలు
గతం - ఆగతాల సవ్వడులతో
హెచ్చరికలు మంత్రిస్తున్నాయి
త్యాగాల బలిపీఠమీద
సంపాదించిన స్వాతంత్య్రాన్ని
స్వాభిమానంతో ముంచి తీసిన
శక్తి యుక్తులతో కాపాడుకొమ్మని
సుభాషితాలు వడ్డిస్తున్నాయి. *

-ఐతా చంద్రయ్య 9391205299