అక్షర

సకల శాస్త్ర సారం .. నవ జీవన వేదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవన వేదం
రచన: ఎస్.ఆర్. భల్లం
వెల: రూ.100-లు
ప్రతులకు:
భల్లం సామ్రాజ్యలక్ష్మి
జీ/్య ఎస్.ఆర్.్భల్లం
4.87.12, ఇందిరానగర్,
తాడేపల్లి గూడెం-534101
పశ్చిమ గోదావరి జిల్లా
సెల్: 9885442642
*
మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నారు. ఇందులో కూడా మంచి విజ్ఞానముంది. కూపస్థమండూకాల్లా మానవ జన్మ లభించినా ఉన్న విజ్ఞానంతోనో లేక చుట్టు పక్కల జరిగేవే ప్రాముఖ్యమైనవి అని వాటిని మాత్రమే చూస్తూ ఉంటే జ్ఞానం వృద్ధి అవదు. విజ్ఞానం పెరగదు. మానవుడు తనకున్న విచక్షణా వివేచనలతో ఎప్పటికప్పుడు పరిస్థితులను అవగాహన చేసుకొనాలి. ధర్మమేమిటో వివేచించుకోవాలి. అధర్మమేమిటో తెలుసుకోవాలి. అపుడే నలువైపుల నుండి విజ్ఞాన వీచకలు ప్రసరిస్తాయి. సద్గురును అనే్వషించాలి. ఆయన చెప్పిన బాటలో నడవడానికి ప్రయత్నించాలి. ధర్మసూక్ష్మాలను సంగ్రహించాలి. మంచి దారి ఎన్నుకోవాలి. ఆ ఎన్నుకొన్న దారిలో నడవాలి. లేకుంటే కేవలం ధర్మమీమాంస చేయగలిగి, సత్యధారణ చేయగలిగినా ప్రయోజనమేమీ ఉండదు. ఎప్పుడైతే తెలుసుకొన్నదాన్ని ఆచరిస్తామో అపుడే విజ్ఞానం దినదినాభివృద్ధి అవుతుంది. దానితో మనిషి ఇలలోనే స్వర్గాన్ని సృష్టించగలుగుతాడు. స్వర్గమంటే కేవలం అప్సరస కన్యలు భోగభాగ్యాలు , హంసతూలికా తల్పాలు మాత్రమే కాదు. మనం జీవించే ఉన్న చోట నలుగురి కల్యాణం కోసం శ్రమించి ఎదుటివారిలో చిరునవ్వును చూడగలిగితే అదే స్వర్గం.
ఆ చిరునవ్వును పూయించాలంటే ఏమి చెయ్యాలి అన్నది తెలుసుకోవడానికే శ్రీశ్రీశ్రీ ఉమర్ ఆలీషా గురూజీ గారి బోధనలు వింటేచాలు. మనిషి మనిషిగా బతకడానికి ఆలంబన దొరుకుతుంది. మానవత్వం పరిమళించడానికి మనిషి ఏ విత్తనాలు మనసులో నాటుకోవాలో తెలుస్తుంది. మానవత్వం అనే గింజల నాటటం ద్వారా కలిగిన విజ్ఞాన భూమిలో మనిషి ఎలా ఎదుగుతాడో తెలుస్తుంది. ఆ ఎదిగిన మనిషిలో విజ్ఞాన తృష్ణ ఏవిధంగా బయల్పడుతుందో ఎరుక కలుగుతుంది. ఆ విజ్ఞాన సంద్రంలో మునకలు వేసిన మనిషిలో మానసిక వికాసాన్ని ఎలా ఏర్పడుతుందో తేటతెల్లమవుతుంది. ఆ వికసించిన మానవత్వంతో పరులలో పరమాత్మను చూడగలిగే నేర్పు సాధ్యమవుతుంది.
కేవలం ముక్కుమూసుకొని తపస్సు చేసి ఏకాగ్రతతో బ్రహ్మర్షి అవడాన్ని భారతీయం ఆపేక్షించదు. పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకొని ఈ సృష్టి అంతా పరివ్యాప్తమైన సర్వవ్యాపకత్వాన్ని కలిగిన బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోమని చెప్తుంది భారతీయం. కనుక అట్లాంటి దివ్యప్రబోధాన్ని శ్రీ ఉమర్ ఆలీషా బోధనలు చెబుతాయి. కనుక ఉమర్ ఆలీషా బోధనల్లోని ముఖ్యవిషయాలను తీసుకొని అలతి అలతి పదాలతో చక్కని భావాలను ఎస్. ఆర్. భల్లం సద్గురువు, బ్రహ్మవిద్య, జ్ఞానామృతం, ధర్మజ్ఞానం , బ్రహ్మచర్యం, శీల సంపద లాంటి దాదాపు 35 శీర్షికలతో విపులీకరించారు. ప్రతి శీర్షికలో కూడా మనిషి తన జీవితాన్ని గురువర్యుల బోధనలతో నవీకరించుకుంటే మనిషిగా మహాత్మునిగా ఎదగవచ్చు.
మంచి మాటలతో మంచి భావనలతో ఉన్న మనిషి తనకు లభించిన మానవ జన్మను ఆధ్యాత్మిక కిరణాల్లాంటి ఇలాంటి శీర్షికలను ఈ చిరుపొత్తాన్ని చదివి ఆకళింపుచేసుకొని మానవ జీవితాన్ని రసరమ్యంగా తీర్చి దిద్దుకోవచ్చు. మానవకల్యాణానికి తన వంతు బాధ్యతను పంచుకోవచ్చుననే దృక్పథానికి తావిచ్చే ఈ జీవన వేదం సాహితీవనంలో మంచిసువాసనలిచ్చే పూవుగా పరిమళిస్తుంది.

-రాయసం లక్ష్మి