అక్షర

రాజకీయ నాయకుల సంక్షిప్త జీవిత చరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ మన
ముఖ్యమంత్రులు’
దాసరి ఆళ్వార స్వామి
ప్రతులకు:
అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
**
దాసరి ఆళ్వార స్వామి రచించిన ‘ మన ముఖ్యమంత్రులు’ అనే పుస్తకంలో ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి రాజకీయ జీవిత చరిత్రలపై సంక్షిప్తంగా వివరించిన తీరు బాగానే ఉంది. కాని ఈ పుస్తకం 2017 జూన్‌లో ప్రచురణ అయింది. ఈ పుస్తకంలో 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికకావడం తదితర అంశాలను స్పృశించలేదు. చరిత్ర కారులకు వ్యక్తులు, ప్రాంతం చరిత్ర అంటే నిష్పక్షపాత దృక్పథం ఉండాలి. చరిత్రను గౌరవించాల్సిందే. 336 పేజీల పుస్తకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన అంశాలపై నాలుగు పేజీల చరిత్ర ఘట్టాలు, తొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్ జీవిత విశేషాలపై కొన్నిపేజీలు కేటాయించి ఉంటే సమగ్రంగా ఉండేది. తెలంగాణ రాష్ట్ర పోరాటం సుదీర్ఘమైనదే కావచ్చు. ఆ వివరాలకు ఈ పుస్తకం ఎటూ వేదిక కాదు. తెలంగాణ రాష్ట్రం 2014లోనే అవతరించింది. తెలుగు రాష్ట్రాలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన నాయకులు తెలంగాణను కూడా పాలించారు. కాబట్టి కెసిఆర్‌కు స్ధానంలేని ఈ పుస్తకం అసమగ్రమైన పుస్తకమని చెప్పవచ్చు. ఈ లోపాన్ని దిగమింగి, ఇతర వివరాలను చదివితే, రచయిత ఈ పుస్తకం రాయడానికి మంచి కసరత్తు చేశారనిపిస్తుంది. ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంతి టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి గురించి ఆసక్తికరమైన అంశాలు రాశారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మొదలుకుని చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరకు వివరాలు సమగ్రంగానే పొందుపరిచారు. చివరి పేజీలో చంద్రబాబుదే రికార్డు అనే శీర్షికతో రాసిన మూడు పేజీల సమాచారంలో రచయిత ఆళ్వారు స్వామి మాజీ ముఖ్యమంత్రులు రోశయ్య, నాదెండ్ల భాస్కరరావు, కిరణ్‌కుమార్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రుచికరంగా లేవు. చంద్రబాబుదే రికార్డు అని ఆ వివరాలు మాత్రమే పొందుపరిస్తే బాగుండేది.

-విజయశైలేంద్ర