అక్షర

ప్రవాహంలా సాగిన కథనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడు కోరికలు
మరికొన్ని కథలు
ఇజక్ బషేవిస్ సింగర్
అనువాదం: కె.బి.గోపాలం
పేజీలు: 112,
వెల: రూ.60
ప్రతులకు:
12-13-450, వీధి నెం:1
తార్నాక, సికింద్రాబాద్-17.
---

పోలెండుకు చెందిన సింగర్ ఇద్దిష్ భాషలో రాసిన కథలకు 1978లో నోబుల్ బహుమతి పొందాడు. ఆయన పిల్లల కోసం కథలు రాశాడు. అవి ఆహ్లాదంగా వుంటాయి. ఆసక్తికరంగా వుంటాయి. ఆయన కథన శిల్పం అపూర్వం. ఆయన కథల్ని ఎలిజబెత్ ఆంగ్లంలోకి అనువదించారు. వాటిని కె.బి.గోపాలంగారు అద్భుతంగా తెలుగులోకి తెచ్చారు. పేర్లు విదేశీయం కావచ్చు కానీ పిల్లలు హృదయాలు ప్రపంచంలో ఎక్కడయినా ఒక్కలాగే వుంటాయి. పసి హృదయం వున్న ఎవర్నయినా ఈ కథలు కట్టి పడేస్తాయి.
లోకంలో క్రమక్రమంగా అదృశ్యమయిపోతున్న అమాయకత్వం అడుగడుగునా, ప్రతి పాత్రలో ప్రదర్శిస్తారు రచయిత. అమాయకత్వాన్ని ఆకాశం రక్షిస్తున్నట్లు అడుగడుగునా మనకు అనిపిస్తుంది.
అమాయకులు సులభంగా మోసపోతారు. కానీ వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా వుంటారు. రచయిత మాటలకు ఉన్న శక్తి చాలా గట్టిదని, ముఖ్యంగా పిల్లలకు విలువలను, విశేషాలను అందచేయడంలో మాట తీరుకు మంచి పాత్ర ఉంటుందని నమ్మారని కె.బి.గోపాలం ముందుమాటలో చెప్పారు.
మనిషి శ్రమించడం ఎంత అవసరమో సోమరితనం ఎంత అనర్థమో తెలిపే కథ ‘ఉట్సెల్ సోమరి. భార్య చనిపోయింది. ఒకతే కూతురు. యిద్దరూ సోమరులే. కూతురు ఎదుగుతోంది. లావు కావడంవల్ల ఆ పిల్ల కూడా సోమరికావడంవల్ల వూళ్ళో అబ్బాయిలు ఆమెని యిష్టపడరు. బయటికి వెళ్ళి పరిచయాలు పెంచుకోమంటాడు తండ్రి. బయటికి వెళ్ళడానికి చెప్పుల్లేవంటుంది. కొంత డబ్బు అప్పుతీసుకుని చెప్పులు కొంటాడు. కానీ అవి ఎప్పుడో కొన్ని నెలల క్రితం కొలతలు తీసుకుని చేసినవి. ఆమె కాళ్ళకు పట్టవు. దిక్కుతోచదు. చెప్పులు కుట్టే అతను పని చెయ్యమంటాడు. మెల్లగా తండ్రీ కూతుళ్ళు పనిచెయ్యడంలో పడతారు. డబ్బు సంపాదిస్తారు. కూతురు సన్నబడుతుంది. ఆమె కాళ్ళకు చెప్పులు సరిపోతాయి. ఒక ధనవంతుడి కొడుకు ఆమెను యిష్టపడ్డాడు. అట్లా కథ సుఖాంతమవుతుంది. ఇట్లా నిసర్గ గ్రామీణ వాతావరణంతో, ప్రవాహంలా సాగే కథనంతో నిండిన పదహారు కథలిందులో వున్నాయి. పూల పరిమళం లాంటి శైలితో మనోహరంగా అనుసృజించిన కె.బి.గోపాలంగారు అభినందనీయులు.
ఇలా- కోల్పోతున్న లేదా కోల్పోయిన పసితనాన్ని, అమాయకత్వాన్ని మనముందుంచే ఈ కథలు చదవగలగడం మన అదృష్టం.

-సౌభాగ్య