అక్షర

సఫలీకృత కృతి... రుద్రగీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుద్రగీతి (పద్యకృతి)
-కుప్పా వేంకట
కృష్ణమూర్తి
పుటలు: 136
వెల: రూ.50
పుస్తక ప్రాప్తిస్థానము:
శ్రీ గణపతి
సచ్చిదానందాశ్రమం
దత్తనగర్, ఊటీ రోడ్, మైసూర్ -570025
*
‘ఆవేశం రావాలి/ ఆవేదన కావాలి’ అన్నాడొక మహాకవి కవిత్వం వ్రాయటానికి. ఈ రెంటికీ ఆర్తి, ఆత్మ నివేదనలు తోడైతే ఆ కవిత్వం నాలుగు కాలాలపాటు నిలుస్తుంది. అలాంటి రచనా శిల్పం ఆవిష్కరించి చూపటానికి కుప్పా వేంకట కృష్ణమూర్తి చేసిన ఒక సఫల ప్రయత్నం ‘రుద్రవీణ’ కావ్యం.
ఈ కావ్యంలో శ్రీ రుద్రగీతి, వేణుగోపాల సుప్రభాతం, నిమిషాంబా సుప్రభాతం అని మూడు విభాగాలున్నాయి. ఈ మూడు విభాగాలూ కలిపి వరుసగా శివ - విష్ణు - శక్తి స్వరూపాల త్రిపుటి.
‘శ్రీరుద్రగీతి’లో ‘మేఘ విస్ఫూర్జితం’ అనే ఒక అరుదైన విశిష్ట వృత్త రూపంలో కూర్చిన 182 పద్యాలున్నాయి. ‘మేఘ విస్ఫూర్జిత’ వృత్తాన్ని ఎన్నుకోవటంలో చక్కని ఛందశ్శిల్పం ఉంది. విస్ఫూర్జితం అంటే అరుపు లేక బొబ్బరింత. ఇక్కడ మేఘం యొక్క ‘ఉఱుము’ అని భావం. ఈ వృత్తంలో లఘువుల కంటే గురువులు అధికంగా ఉంటాయి. అందుచేత పద్యం చదువుతుంటే ఉచ్చారణ ధ్వని ఆర్భాటం రుద్రుని రౌద్రాన్ని తలపిస్తుంది. కనుకనే ‘రుద్రగీతి’కి మేఘ విస్ఫూర్జిత వృత్తం సముచితంగా సంభాసించింది.
‘క్రమప్రోద్యత్తామ్రా రుణ హరిత రుగ్వ్యక్త సన్మం గళంబౌ..’ లాంటి పద్యాలు ఈ మేఘ విస్ఫూర్జిత వృత్త ధాటి, ‘ఘనత’లకు ఉదాహరణలుగానే కాక శ్రీనాథుని శైలిని తలపిస్తున్నాయి.
‘రసావేశంబించున్ మహిత కవితా రమ్య శృంగారమంచున్
లసన్నా నా కావ్యస్ఫుట పరిచయోన్నద్ధ సత్తీరియంచున్
అసత్తృష్ణావృత్తిన్ గడపితి దినాలయ్య దిక్కీవె యో వి
శ్వసద్భక్తో ద్ధారా! శివశివశివా! సచ్చిదానంద రూపా!’ అంటారు కుప్పావారు.
మహాకవి ధూర్జటి తన కాళహస్తీశ్వర శతకంలో
‘ఏ లీలన్నుతియింప వచ్చు నుపమోత్ప్రేక్షా ధ్వని వ్యంగ్య శ
బ్దాలంకార విశేష భాషల కలభ్యంబైన నీ రూపమున్
చాలుంజాలు కవిత్వమున్నిలుచునే సత్యంబు వర్ణించుచో
ఛీ! లజ్జింపరుగాక మా దృశ కవుల్ శ్రీకాళహస్తీశ్వరా!’ అనటంలోని ‘కవిత్వంకన్న కాలకంఠ ధ్యానమే మిన్న’ అన్న ఉదాత్త భావానికి కుప్పా వారి పద్యం సరిజోడీగా సౌరులొలకబోస్తోంది.
‘సంధ్యావందన, నిత్యహోమ, దైవతార్చనాది విధి, విహిత అనుష్ఠాన క్రమతాస్థిరతలు లేవు. జపనిష్ఠ లేదు. నీపై ఏకాగ్రత కలుగదు. నీ ధ్యాసలో పులకించిపోవటం అనేదే లేదు. జీవాత్మ - పరమాత్మల అభిన్నత అనుభూతించలేక పోతున్నాను. అలాంటి నన్ను ఎలా ఆదరిస్తావో’ అంటూ బిక్కమొహం పెట్టిన కవి ‘పూర్ణానుకంపాసనాథా!’ అంటే - దయాగుణ సంపూర్ణత నీలో ఉంది’ అనే భావ వ్యక్తీకరణ తనలోని అవగుణాలను (నెగెటివ్ ఫీచర్స్)ను భగవంతుని సకారాత్మక గుణం (పాజిటివ్ ఫీచర్) ఉపేక్షిస్తుంది. ‘ఉదాసీనిస్తుంది’ (ష్యశజ్యూశళ చేస్తుంది)’ అంటాడు ‘అనుష్ఠానస్థైర్య స్ఫురణమెరయున్...’ అనే పద్యంలో. ఇక్కడ ‘పూర్ణానుకంపాసనాథా!’లోని ‘పూర్ణ’ అంటే దైవగుణతా పరాకాష్ఠ (ఒఖౄౄజఆ్ఘ ఘఇఒ్యఖఆళశళఒఒ). ఆ ఉదాత్త, దైవతత్త్వం అన్నిటినీ తనలో ఇముడ్చుకొని, అన్నిటినీ నివృత్తి చేస్తుంది (్యౄజశ్ఘఆళ చేస్తుంది) అనే సర్వాంతర్యామి తను, విరాడ్రూపతను ధ్వనిస్తారు కుప్పావారు. ఇది - ఇక్కడి అంతరార్థ ధ్వని గాంభీర్యం.
36వ పద్యంలో ‘శివా! శ్రుతులు నిన్ను ‘దొంగా’ అన్నాయి’ అంటారు కృష్ణమూర్తి చమత్కారంగా. శివునికి ఒక పేరు హరుడు. అంటే హరించేవాడు అని కదా అర్థం. వెంటనే ‘విశ్వ సామ్రాజ్యనేతా!’ అని సంబోధన అదే పంక్తిలో. విశ్వానికే అధిపతివి నీవు. ఒక దొంగ (వా?) అనటంలో విషమాలంకార చతురోక్తి అందగిస్తుంది - ప్రళయకాలంలో సమస్తాన్నీ హరించే వాడు హరుడు అనే వ్యుత్పత్త్యర్థాన్ని కాసేపు పక్కనబెడితే.
‘అనాద్యంతస్ఫారన్నిబిడ మహనీయాచ్చ దివ్య ప్రభా శ్రీఘనా పూ ర్వంబు’ అంటూ దీర్ఘ సమాసంలోని హరిబ్రహ్మలు దర్శించిన సద్యోమహాలింగోద్భవ దృశ్య వర్ణనతో పద్యం యొక్క ప్రతిపదార్థం గుఱించి ఆలోచించకుండానే మనకు అనుభూతి కలుగుతుంది. ఆ మహాలింగ రూపం ఆ పద్యంలో చెప్పినట్లు హరిబ్రహ్మలకే కాదు పాఠకుడికి కూడా ఆత్మవ్యామోహాన్ని అదృశ్యం చేస్తుంది.
159వ పద్యంలో నిత్యోజ్జ్వల ప్రాంశు అన్న పదంలోని (ఉత్+జ్వాల) త కారానికి యతి స్థానంలో ‘దర్పణంబై’ లోని ద కారం యతిగా నిల్పటం సాహిత్యంలో ఎప్పుడో ఎక్కడో తళుక్కుమని మెరిసే అపురూపమైన ‘వికల్ప విరమణ యతి’ అనే దాని ముచ్చటకు చక్కని మచ్చు.
‘పుట్టు పొల్లయ్యె’ (జన్మ నిరర్థకమై పోయింది) వంటి కొన్ని అచ్చు తెలుగు వాక్యాల అందం ఇందులోని ఒక కావ్యగారవ లక్షణం.
‘శ్రీ హంసలదీవి వేణుగోపాల సుప్రభాతం’ ఖండికలో ‘ప్రభూ! ఇక్కడ ఇంపైన ఇసుక తినె్నలు, అందులో అందాల బృందావనం. ఈ సుందర వనంలో నీ యొక్క రాసకేళీ మండలం. మండలంలో నీవు భిన్నభిన్న రూపాలతో కనిపిస్తున్నావు’ అంటూ ‘వీక్షేత్ర సైకత తలేషు మనోజ్ఞ రూపాం’ అన్న శ్లోకంలో చిత్రితమైన దృశ్యం ‘ఉదాత్తాలంకార’ శోభితం - పాఠకుడికి మధురోహపు మొగ్గుదల (ళశజూళశషక) ఉంటే.
‘మమేస్తకో పరితలే..’ అనే 18వ శ్లోకంలో ‘ప్రేమతో నీ పాదాలను నా శిరస్సు మీద పెడితే అప్పుడవి వేగంగా చాచుకున్న హంసరెక్కల్లా ఉంటాయి’ అనటంలో హంసలదీవి క్షేత్రగాథ ఛాయామాత్రంగా స్ఫురించటమే కాకుండా భక్తిమార్గంలో ముముక్షువైన వానికి ప్రాణోత్క్రమణ సమయంలో ‘హంస లేచిపోతుంది’ అంటే - జీవాత్మ పరమాత్మవైపు వెళ్లిపోతుంది అనే ఒక లోతైన ఆధ్యాత్మిక తత్త్వభావం స్ఫురించటం ఇందులోని వివక్షితాన్య పరవాచ్య ధ్వనికి, ఆలంకారిక శైలికి నిండైన నిదర్శనాలు.
‘శ్రీనిమిషాంబా సుప్రభాతం’ ఖండికలో ‘్ధ్యత్వాంబ! భాసుర రుణాం భవతీం నిశాయాం..’ అనే శ్లోకంలోని ‘అమ్మా! సూర్యుడు రాత్రంతా అరుణాస్వరూపిణివైన నిన్ను ధ్యానించి (తాదాత్మ్య భావన వల్ల) తనే అరుణాకారాన్ని పొందినట్లుగా ఉంది. ఇప్పుడు ఆ ఎఱ్ఱని ఆకారంతోనే మెల్లగా వస్తున్నాడు. అతడలా వస్తుంటే జనానికి నినే్న దర్శనం చేయిస్తున్నట్లుగా ఉంది. ఓ ఈశపత్నీ! అతనిని చూడు. చూసి, తల్లీ! నిమిషాంబా! ఈ ప్రభాతాన్ని శుభప్రభాతంగా చేయుదువుగాక!’ అనటంలో ‘ఉత్ప్రేక్ష’ ‘తద్గుణం’ చివరి వాక్యంలో ‘పరికరం’ అలంకార ప్రభలు కనిపిస్తాయి.
ముగురమ్మల మూలపుటమ్మ అయిన ‘ఆదిశక్తెమ్మ’ యొక్క తత్త్వరూప విశేషం పాఠకుని భావనలోకి వస్తుంది ‘నిమిషాంబ’ ఖండిక చదివితే.
57వ పుటలో ‘ఆమె కరుణారసానికి నిలయం’ అని వ్రాశారు. కరుణ శబ్దాన్ని రసపరంగా వాడినపుడు కరుణ(0) అనే హ్రస్వాంత రూపంగానే ప్రయోగించాలి. కానీ, ఇక్కడి వాక్యంలో ‘రసం’ అనేది ప్రేమానురాగాది సాత్త్విక గుణ ద్రావణంగా ఉన్నది కనుక కరుణారసం అంటూ దీర్ఘ ‘ణ’కారమే సాధువు అంటారేమో మరి కృష్ణమూర్తిగారు. ఏది ఏమైనా ఇక్కడి ‘కరుణా రసం’ అనే రూపం కించిద్విశే్లషణ, కొంచెం విచారణలను అపేక్షిస్తుంది.
మొత్తం మీద ఈ ‘రుద్రగీతి’ ఒక సఫలీకృత సత్ కృతి.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం