అక్షర

శాస్త్రోక్త దివ్యౌషధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాస్త్రోక్త దైవారాధనం
సంకలనం : కోరె పద్మావతి
వెల: రూ.50/-లు
ప్రతులకు: బి. నరసింహాచారి
ప్లాట్ నెం. 59, ఎ.పి. టెక్ట్స్‌బుక్ ప్రెస్ కాలనీ,
కార్ఖానా, సికింద్రాబాదు - 3
సెల్.నెం: 9652808040, 9989674668
*
కంప్యూటర్ యుగంలో ప్రతిమనిషి మహావేగంతో ప్రయాణిస్తున్నాడు. తమ జీవన భృతి గడపడానికి దూరతీరాలకు వెళ్లడానికి నిత్యకృత్యాలను తీర్చుకోవడానికే సమయం చాలటం లేదు అని వాపోతున్నారు.
ఇలాంటి వ్యాపకాలున్న ఈ రోజుల్లో దైవారాధన ఎలా చేయాలన్నది చాలామంది మరిచిపోతున్నారు. అందులోను న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటూ చిన్న చిన్న కుటుంబాలతో మంచి మాటలు చెప్పే పెద్దవారు లేక ఉన్నవారికి తెలీక ఏదో దైవానికి నమస్కరిస్తే చాలను కొనేవారు కొందరు. కొందరు ఆడంబరాలకు వెళ్లి చేయవలసిన దాన్ని పక్కన పెట్టి చేయకూడని వాటిని ప్రాధాన్యతను ఇచ్చేవారుగా తయారవుతున్నారు.
కాని అందరిలోను మంచి ఫలితాలు రావడానికి ఏం చేయాలో తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంది. అటువంటి జిజ్ఞాసువులను దైవారాధన పట్ల మక్కువ ఉన్నవారికి ఈ పుస్తకం దివ్యౌషధం.
ఇందులో సులభరీతిలో శ్రీసూక్త విధానంతో శ్రీలలితాదేవిని ఎలా పూజించాలో గణపతిని ఏవిధంగా ఆరాధించాలో స్పష్టంగా విడమర్చి చెప్పారు. పైగా పెద్ద పెద్ద అక్షారాలతో ఉన్న ఈ పుస్తకాన్ని చత్వారం ఉన్నవారు కూడా కళ్లజోడు సాయం లేకపోయినా చక్కగా చదువుకోవచ్చు.
వీరే కాక కొత్తగా దైవారాధన మొదలు పెట్టినవారికి కూడా ఈ పుస్తకం ఎంతో ఉపకరిస్తుంది. కలియుగంలో నామోచ్చారణకే ప్రాధాన్యం ఉంది. కనుక ఈ పుస్తకంలోనే కోరె పద్మావతి వారి మాతృమూర్తి వ్రాసిన పాటలు కొన్ని సాధారణ వాడుకలో ఉన్నవాటితో కలిపి ఇచ్చారు. వాటిని కూడా సుస్వరాలతో ఆలపించి భగవంతుని ఆరాధించవచ్చు.
ఈ పుస్తకం చదివిన వారికి దైవారాధనలో ఉన్న సందేహాలన్నీ నివృత్తి అవుతాయి. చక్కని పూజాపాటవాలతో దృఢమైన మనస్సు గలవారు అవుతారు. కనుక ఈ పుస్తకాన్ని ప్రతివారు చదవాల్సిన అవసరం ఉంది.

*

సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-రాయసం లక్ష్మి