అక్షర

భగవద్దర్శనానికి ఆధ్యాత్మిక మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవత్కృప
(ఆధ్యాత్మిక వ్యాస సంపుటి)
-మహాభాష్యం నరసింహారావు
వెల: రూ.100/-
ప్రతులకు: రచయిత
ఎంఐజి 90, శ్రీశాస్తా నిలయం
అలకానంద కాలనీ
విజయనగరం -535 003

మహాభాష్యం నరసింహారావుగారు ‘్భగవత్కృప’ అనే వ్యాస సంకలనాన్ని ముప్పై ఆరు వ్యాసాలతో వెలువరించారు. ప్రవృత్తిగా రచనా వ్యాసంగాన్ని స్వీకరించిన వీరి రచనలలో భగవత్కృప ఒకటి. భగవంతుడు, భగవద్భక్తి, భగవద్భక్తికి పాత్రులైన వారి విశేషాలు, భగవత్కృపకు పాత్రులు కాగోరేవారు చేయవలసిన పనులు, తీర్థయాత్రలు, పుణ్యస్థలాల వివరాలు, ఇందులో వున్నాయి. దైవభక్తిని వివరించే వ్యాసాలతోపాటుగా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే వ్యాసాలు, దేశభక్తిని చాటే వ్యాసాలు ఇందులో వున్నాయి. అక్కడక్కడా సామాన్యులకు సాధారణంగా ఎదురయ్యే సందేహాలకు సమాధానాలను, కొన్ని సూచనలను ఇచ్చారు. ఇవి కర్తవ్యాన్ని బోధించేలా వున్నాయి. విఘ్నేశ్వరుడు అనే వ్యాసంతో ఈ పుస్తకం ప్రారంభమైంది. ఇందులో విఘ్నేశ్వరుని జననం, గణాధిపతి కావడం, తొలి పూజలందుకోవడం వంటివి వివరించారు. దుర్యోధనుని ఘోష యాత్ర వంటి భారత సంబంధిత గాథలున్నాయి. విష్ణు సహస్ర నామ ప్రాశస్త్యం, పారాయణ ఫలితాలు, భజగోవిందం మొదలైన స్తోత్రాలను పేర్కొన్నారు. మంత్రాలకు శక్తి వుందని చెబుతూ మంత్రోచ్చారణం ఎన్నో సమస్యలకు పరిష్కారమని అంటూ మంత్రశక్తి కలిగిన వారు కొన్ని నియమాలను పాటిస్తేనే వాటికి సిద్ధి కలుగుతుందని అందువల్లనే పూర్వకాలంలో మంత్రాలు సిద్ధించేవనీ కారణాన్ని కూడా తెలిపారు. తిరుపతి యాత్రా విశేషాలు, తిరుపతి వైశిష్ట్యం, తిరుపతి పట్ల భక్తుల్లో వున్న అచంచల భక్తి విశ్వాసాలు మొదలైనవి తిరుపతి వ్యాసంలో చిత్రించారు. చార్‌ధామ్, వైష్ణవీదేవి, సింహాచలం, కాశీయాత్ర, మానసాదేవి మొదలైన యాత్రా స్థలాల గొప్పదనం, అవి దర్శించుకునే పద్ధతులు, రచయిత దర్శించినప్పటి అనుభవాలను జోడించి చెప్పారు. తీర్థయాత్రా సమయంలో పాటించాల్సిన నియమాలను తెలిపారు. తపస్సులోని ఆంతర్యం అనే వ్యాసంలో పూర్వం ఋషులు చేసిన తపస్సు మాదిరి చేయడం ఇప్పటి పద్ధతిలో కష్ట సాధ్యమని, అందువల్ల మనం చేసే మంచి పనులే తపస్సు వంటివనీ కొన్ని సద్గుణాలను ఉదాహరించారు. ఇటువంటి సద్గుణాలను అలవరచుకోవాలనే ఆసక్తిని పఠితలలో కలిగిస్తారు రచయిత. వివిధ జంతువులను భగవంతుని వాహనాలుగా పేర్కొనడం ద్వారా క్రూరమృగాల పట్ల కూడా దయ కలిగి ఉండాలనే సత్యాన్ని మనవారు చాటారన్నారు. సూర్యచంద్రులను ఆరాధించడమంటే ప్రకృతిని ఆరాధించడమేనన్నారు. ఆదిత్యోపాసన సూర్యనారాయణుని మహిమలను ప్రస్తుతిస్తుంది. భాగవత మాహాత్మ్యాన్ని, పోతన భక్తి తత్వాన్ని వెల్లడించారు. త్యాగరాజు సంగీత వైభవము, అన్నమయ్య జీవిత విశేషాలు, తరిగొండ వెంగమాంబ శ్రీ వేంకటేశ్వరుని సేవించిన విధానము విశదపరిచారు. హనుమంతుడు సీతానే్వషణలో వున్న రామలక్ష్మణులను దర్శించడం మొదలుకొని సీతారాముల అయోధ్యా ప్రవేశం, శ్రీరామ పట్ట్భాషేకం వరకు జరిగిన సంఘటనలలో హనుమంతుని సేవాతత్పరతను గురించి అంజనీసుతుడులో వివరించారు. హనుమంతుని పూజా విధానాన్ని తెలిపారు. మన మహర్షులు - పతివ్రతలు అనే వ్యాసంలో పతివ్రతల గొప్పదాన్ని కీర్తించారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో వుంచుకుని చెట్లను పెంచే ఆవశ్యకతను చెబుతూ ‘వృక్షో రక్షతి రక్షితః’ అనే వ్యాసాన్ని రచించారు. గదాధరుడు రామకృష్ణ పరమహంసగాను, నరేంద్రుడు వివేకానందుని గాను రూపొందిన విశేషాలు, గదాధరుడులో వున్నాయి. రచయిత దైవభక్తి, దేశభక్తి ఈ పుస్తకం ద్వారా వ్యక్తమవుతున్నాయి. సింహాచల సంకీర్తనాచార్యుడు కృష్ణమయ్య అనే వ్యాసం ఆసక్తిదాయకంగా వుండి, కృష్ణమయ్య జీవిత విశేషాలు, సంకీర్తనలు రాయడం, అవి ప్రాచుర్యాన్ని పొందడం, నిరాదరణకు గురి అయిన అతడు తిరిగి ఆదరణకు నోచుకోవడం వంటి విశేషాలు, అతని భక్తి భావం ఇందులో వున్నాయి. ఈ విధంగా భగవత్కృప భక్తి సంబంధ వ్యాసాలతో వుంది.

-కె.లక్ష్మీ అన్నపూర్ణ