అక్షరాలోచన

కీటక గీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను ఉద్యోగం చేసే చోట
నేను ఉండే ఊరికి పది కిలోమీటర్లు
ప్రతిరోజూ నా రెండు చక్రాల వాహనంలో
జాతీయ రహదారి మీద వెళుతుంటాను
రోడ్డుకు ఇరుప్రక్కల పచ్చని పరదాల్లా చక్కని చెట్లు
గ్రీష్మం కనుమరుగవగానే
ఉన్నట్లుండి ఒకరోజు జడి పురుగుల రొద మొదలవుతుంది
మైళ్ల పొడవునా చెట్టు చెట్టునా
‘గీయ్’మనే శబ్దం వినబడుతుంటుంది
నిరంతరాయంగా వచ్చేపోయే వాహనాలు చేసే
ఘోషను జయిస్తుందా నిస్వానము
ఈ వేల గొంతులను ఏకం చేసిన స్ఫూర్తిదాయకులెవరు
పొత్తు కుదరని చెత్త మనుషులకు
ఈ ఏకకంఠత్వం కావాలి గుణపాఠం
ఆ పురుగును చూడాలని ఎప్పటి నుండో ఆశ
ఏకాకిలా విసిరేసినట్లున్న ఓ చిన్న చెట్టు దగ్గరికి వెళ్లాను
చూపులతో ప్రతి ఆకును కదిలించాను
అణువణువు శోధించాను
అయినా ఆ క్రిమి జాడలేదు
అసలు శబ్దం చేస్తున్నది శలభమా? వృక్షమా?
అర్థం కాలేదు.
ఆరడుగుల మనిషి మైకు లేనిదే నాలుగు మాటలు చెప్పలేడు
అంగుళం కీటకం భూమ్యాకాశాలను గింగురుమనిపిస్తున్నది
తరాల ఆనవాయితీ ప్రకారం
అది రాగం కాదు వరుణ యాగం
ఆకలి నిద్ర మాని పగలు రాత్రి
అలా గీపెడుతూనే ఉంటాయ్
ఆ కంఠానికి శోష రాదు ఆ పట్టుకు విడుపు లేదు
వరుణుడు కరుణించేదాకా రాగదీక్ష విరమించేది లేదు
జనులు చల్లగా ఉండాలని
జగతి పచ్చగా ఉండాలని
ప్రాణులందరి తరఫునా ప్రాధేయపడుతుంటాయ్
‘గీయ్’మని నినదిస్తూ వానదేవుడికి మొరపెట్టుకుంటాయ్
నా చూపునకు శబ్దదర్శిని శక్తి ఉంటే
జనహితం కోసం పోరాడుతున్న
ఆ సామాన్య కీటకం ముందు సాగిలబడాలని ఉంది.

-చిరమన వెంకట రమణయ్య 9441380336