అక్షరాలోచన

హైకూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీటి బిందువులు
రైతు బాంధవులు
పొలాలకు జీవం అందించే
అమృత బిందువులు
మతాలు కులాలు కల్పితాలు
మానవత్వమే మన మతం
మనమంతా ఈశ్వరుని సేవకులం

అవసరానికి నవ్వులు
అనవసరపు నవ్వులు
జీవంలేని నవ్వులు
గెలుపు కోసం ఓట్లు
గెలిచినాక కోట్లు
ప్రజాస్వామ్యానికి తూట్లు

గర్భంలో మోసెదొకరు
గుండెల్లో మోసెదొకరు
సర్వం అర్పించెదొకరు
చివరికి మోసేది నలుగురు

అక్షరాలతో
కలం పోటి
పొలంతో
హలం పోటి

బతుకు
బతికించు
బతికితే ఆనందం
బతికించితే పరమానందం

గుడిలో దేవుడు
బడిలో దేవుడు
శోధించేదొకరు
బోధించేదొకరు

నాలుక
కత్తిని ఛేదించు
కట్టెను కాల్చు

కళ్లుండి చూడలేరు
చెవులుండి వినలేరు
నోరుండి మాట్లాడలేరు
నేటి సమాజం

సూర్యగోళం చుట్టూ
భూగోళం భ్రమణం
ఇంటర్నెట్‌లో గోళం చుట్టు
మనిషి భ్రమణం

గుళ్లో దేవుళ్లకు
పూజలు పునస్కారాలు
జన్మనిచ్చిన దేవుళ్లకు
తిట్లు తిరస్కారాలు

-జి.శ్రీనివాసాచారి 9059438068