అక్షరాలోచన

కన్నీటి కసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలి బూడిదయిన కన్నీళ్ల మీద
కసి తీర్చుకోవటం పాలకుల సరదా
మన ప్రజాస్వామ్యం మానసిక చిత్రహింసల హారం
మన రాజ్యాంగం పచ్చనోట్ల జైలులో
కేసులేని బందీ

శ్రమ చెమట రెండూ దుఃఖిస్తున్న రోజులివి
ఆకలి అప్పులు పేదవాని కంటినీరుగా
పారుతున్న రోజులివి
ఎవడి ప్రజాస్వామ్యం ఇది
ఎవడి రాజ్యం ఇది
మంచి రోజులొస్తాయనే మాటల గారడీలో
జనం
కార్పొరేట్ సామ్రాజ్య దోపిడీ బురదలో
కొట్టుకుపోతున్న రోజులివి
ఏమిటో
దుఃఖం పొంగుకొస్తుంది
ఆస్తులు అంతస్తులు వేలకోట్ల స్థిరాస్తులు
వేలు లక్షలు నల్లధనం, మొండి బాకీలు
అంతా ఎవడి సొమ్ము
ఎవడి సొమ్మురా ఇదంతా!
జనం సొమ్ముతో ప్రజాస్వామ్య ఆట
ఈ చీకటి - మీ వెలుగు చాలా కాలముండదు.
*

-సిహెచ్.మధు 9949486122