అక్షర

జీవిత సత్యాల పూదండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శూన్య మనస్కత
-నీలంరాజు లక్ష్మీప్రసాద్
పేజీలు: 120
వెల: రూ.80
ప్రతులకు: నవోదయ
బుక్‌హౌస్
కాచిగూడ, హైదరాబాద్-27.
***
దశాబ్దాల నించి నిరంతర తాత్విక చింతనలో నిమగ్నమయి రచనలు చేస్తున్న విశిష్టమైన వ్యక్తి నీలంరాజు లక్ష్మీప్రసాద్. ఆయన ఇటీవలి ఆధ్యాత్మిక వ్యాస సంపుటి ‘శూన్య మనస్కత’! ఇది ముప్పై ఆరు వ్యాసాల సంపుటి.
‘శూన్య మనస్కత’ అన్నది మొదటి వ్యాసం. నిత్య అవిశ్రాంత జీవితంలో అల్లాడే అసంఖ్యాక జనాలకి అమృత గుళికల్లాంటి వాక్యాలు ఈ సంపుటిలో ఉన్నాయి. జనమంటే అందరూ అనుకునేట్లు ఒక విషయం మీద దృష్టి నిలపడం అనుకుంటూ ఉంటాం. ఆ విషయాన్ని మన అదుపులోకి తెచ్చుకోవడమనుకుంటాం. ‘్ధ్యనమంటే ఏ మాత్రం చలించని, యిటూ అటు కదలని ఒక మనసు కలిగి వుండడమంటూ ఈ క్షణం మనం ఏ పని చేస్తున్నామో దానిపై సంపూర్ణ ధ్యాస ఉంచడమని వివరిస్తారు. ధ్యానం జనన మరణాతీతమంటారు.
మన అహంకారాన్ని వదిలి ప్రేమపూర్వకంగా ప్రపంచాన్ని సమీపిస్తే అన్నీ మనకు సానుకూలంగా ఉంటాయని, ప్రేమకు సంబంధించిన వ్యాసాల్లో వివరించారు. జిడ్డు కృష్ణమూర్తి, ఓషో, రమణ మహర్షి తదితర ఆధ్యాత్మికవేత్తల రచనల్ని ఆపోశన పట్టినవారు నీలంరాజు. ఆ సారాంశాన్ని సరళంగా మనకు అందిస్తారు.
‘నేను ప్రతి క్షణమూ అన్నిటి ఎడలా మరణిస్తుంటాను. నేను మరణాన్ని పోగయ్యను. మరణమనేది వుంటే కదా!’ అంటూ ఓషో మాటల్ని చెప్పి సంపూర్ణంగా ఈ క్షణం జీవిస్తే అనుక్షణ పునర్జన్మ అనివార్యంగా సంభవిస్తుందంటారు.
‘పునర్జన్మ ద్వారా జీవితాన్ని దర్శించకుండా పోయావంటే వ్యర్థంగా మనుగడ సాగించినట్లవుతుంది’ అంటూ హెచ్చరిస్తారు.
జీవిత సత్యాన్ని గ్రహించాలనుకున్న వాళ్లు చదవాల్సిన వ్యాసాలివి.

-సౌభాగ్య