అక్షర

భయం పోగొట్టే పండంటి పుస్తకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండంటి పాపాయి గురించి
వెల: రూ.150/-
ప్రతులకు: నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్,
ఎమ్.హెచ్.్భవన్, ఫ్లాట్ నెం.21/1/, అజామాబాద్,
ఆర్టీసీ కళ్యాణ
మంటపం దగ్గర,
హైద్రాబాద్-20. 040-27660013
---

ఆధునిక జీవితంలో చాలా మందికి చాలారకాల భయాలు కలుగుతున్నాయి.. స్ర్తిపురుషుల కలయిక గురించి భయపడే వాళ్లున్నారు. గర్భం ధరిస్తే తమ ప్రాణాలకి అపాయమేమోనని భయపడే వాళ్ళున్నారు. ప్రకృతిసిద్ధంగా జరిగే వాటిని వికృత ఆలోచనలకు తావీయకుండా, భయం మాని అవగాహనతో నిర్వహించుకోవాలి. అందుకు భయాన్ని పోగొట్టి అవగాహనని పెంచే పుస్తకాలు రావాల్సిన అవసరం ఎంతో ఉంది.
నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్‌వారు ‘పండంటి పాపాయి గురించి...’ డా.యతీష్ అగర్వాల్, రేఖా అగర్వాల్ రాసిన వ్యాసాల్ని భవాని దేవినేనిగారి అనువాదంలో తెలుగులో తీసుకువచ్చారు. స్ర్తి, పురుష జననాంగాల గురించి అవగాహన ఉండాలి. సృష్టిలో వాటి పాత్రేమిటో తెలుసుకోవాలి. జననాంగంలో వచ్చే వ్యాధులేమిటో తెలుసుకోవాలి.
పరిశుభ్రత... ముఖ్యంగా జననాంగ పరిశుభ్రత గురించి తెలుసుకోవాలి. పాపను కనేందుకు అవసరమైన శారీరక పరిస్థితుల గురించి తెలుసుకోవాలి. గర్భనిరోధక మాత్రలు ఎప్పుడు ఎంతకాలం వాడాలి లాంటి విషయాల మీద పరిపూర్ణ అవగాహనుండాలి. గర్భం ధరించిన తర్వాత మందుల్ని వేటిని పడితే వాటిని వైద్యురాలి సలహాలేకుండా వేసుకోకూడదు. గర్భం ధరించినప్పుడు ఏ ఇన్‌ఫెక్షన్స్ ఎలా వస్తాయో తెలుసుకోవాలి. ఏ సమయంలో గర్భం ధరించాలో, ఏ సమయంలో గర్భం ధరించకూడదో తెలుసుకోవాలి. పాపాయి కడుపులో ఎలా వృద్ధిచెందుతుంది. తల్లి ఎలాంటి ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఎలాంటి వ్యాయామం చేయాలి. చెయ్యకూడదు. అసలు గర్భం ధరించినట్లు ఎలా తెలుసుకోవడం ఎలా? గర్భం ధరించినప్పటినుంచి చెకప్స్ గురించి.. వాక్సినేషన్ గురించి సంపూర్ణ అవగాహన ఎలా పెంచుకోవాలి? కాబోయే తల్లుల సాధారణ సమస్యల గురించి అవగాహన ఉంటే జాగ్రత్తపడగలం. డెలివరీ సమయంలో ఎలాంటి సమస్యలు వస్తాయి. సిజేరియన్ ఎప్పుడు చేయించాలి. పాపాయి పుట్టిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏయే టీకాలు ఎప్పుడు వేయించాలి.. ఇలాంటి ఎన్నో విషయాల్ని కాబోయే తల్లిదండ్రులిద్దరూ తెలుసుకోవాలి. తల్లిదండ్రులు, ఇతర పెద్దలు కొన్ని విషయాల్ని మాత్రమే చెబుతారు. గైనకాలజిస్ట్ కూడా కొన్ని విషయాలే చెబుతారు.
మరి, ఈ విషయాలన్నీ అందరికీ తెలిసేదెలా, అన్న ప్రశ్న ఉదయించినప్పుడు పండంటి పాపాయి గురించి.. లాంటి పుస్తకాల ఆవశ్యకత తెలుస్తుంది. తల్లిగర్భం డెలివరీ లాంటి ఇంతకు ముందనుకున్న విషయాలన్నింటినీ ఈ పుస్తకంలో పొందుపరిచినా భాష చాలా సరళంగా ఉంది కాబట్టి అందరికీ అన్ని విషయాలూ తేలికగా అర్ధమవుతాయి. కాబట్టి ఈ పుస్తకం అందరూ చదవాల్సింది.

-వి.రాంబాబు