అక్షర

మా ఊరు ఒక్కసారి పోయ రావాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నడిచివస్తున్న చరిత్ర
(కారంచేడు)
-యార్లగడ్డ రామమూర్తి
వెల: రూ.150
ప్రతులకు: రచయత
రిటైర్డ్ ప్రిన్సిపాల్
కారంచేడు,
ప్రకాశం జిల్లా
9493437579

మా ఊరు అనగానే సహజంగా పుట్టి పెరిగిన ప్రాంతం అని అందరికీ తెలిసిన విషయమే. ఎందరికి వారి స్వగ్రామం మూలాల గురించి తెలుసు. యార్లగడ్డ రామమూర్తిగారు వ్రాసిన ‘నడిచి వస్తున్న చరిత్ర’ పుస్తకం వారి స్వగ్రామమైన ‘కారంచేడు’ గురించి సమగ్రంగా తెలియజేసి ఆ ఊరి రుణాన్ని తీర్చుకోవాలని బలంగా అనుకున్నారో ఏమో గానీ అక్కడి ప్రముఖుల గురించి, ప్రాంతాల గురించి తెలియజేస్తూ తమ ఊరికి చరిత్రలో ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు.
అక్కడి పల్లెటూరి జీవన విధానం, ఆచార వ్యవహారాలు, అన్ని సామాజిక వర్గాల కలివిడితనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశారని చెప్పాలి. అప్పట్లో టిఫిన్లు, కాఫీ, టీలు వాడకం చాలా తక్కువ. మామూలుగా పెరుగన్నం, పచ్చడి ముద్దలు వారి ఆహారం. పొలం పనులకు వెళ్లేవారు అన్నం తుండుగుడ్డలో మూటగట్టుకొని వెళ్లి దారిలోనే కలుపుకుని తినేవారు. ఆ తుండుగుడ్డను ‘కూడు గుడ్డ’ అని పిలిచేవారు. పాత పంచెలు దీనికి ఉపయోగించేవారు.
ఇప్పుడు హోటల్స్‌లా అప్పుడు ‘పూటకూళ్ల ఇళ్లు’ ఉండేవి. తరువాత అవే హోటళ్లుగా రూపాంతరం చెందాయి. ముఖ్య విషయం ఏమిటంటే కాఫీ బదులు అప్పట్లోనే కాఫీ చాక్లెట్లలా బిళ్లలు వాడేవారు. కిరాణా షాపుల్లో దొరికే వాటిని ఎప్పుడన్నా జ్వరాలు వచ్చినప్పుడు కాఫీ తయారీకి ఉపయోగించేవారు.
ఆ రోజుల్లో మగవారు ఆరుబయట స్నానాలు చేసేవారు. అందుకు వారు గోచిగుడ్డలు వాడేవారు. స్నానానంతరం ఒళ్లు తుడుచుకోవడానికి దాదాపుగా అందరూ ఒకే తుండుగుడ్డను వాడేవారు. గమ్మతె్తైన విషయం ఏమిటంటే ‘కూడు గుడ్డ’ ‘గోచిగుడ్డ’ ‘తుండుగుడ్డ’ ఈ మూడింటినీ ఉతికి బాగా పిండి ఒకేచోట ఆరేసేవారు.
ఇలా పిల్లా పెద్దా అందరూ పెందలకడనే నిద్ర లేచేవారు. ఇప్పటిలా ఎండబడి లేటుగా ఎవరూ లేచేవారు కాదు. లేటుగా నిద్ర లేవటం ఇంటికి దరిద్రంగా అప్పట్లో అందరూ భావించేవారు. ఇప్పుడు మనం లేటుగా నిద్ర లేవటం హోదాగా భావిస్తున్నట్లున్నాం.
ఈ ప్రాంతం నుంచి ఎదిగిన వారిలో మూవీ మొఘల్‌గా పేరు గాంచిన డా.డి.రామానాయుడు ఒకరు. ఎదిగిన కొద్దీ ఒదగటం నేర్చిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. తన సొంత గ్రామానికి ఆయన చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆర్థిక సహాయం, సహకారాలు స్వగ్రామం మీద ఆయనకున్న మమకారాన్ని తెలియజేస్తుంది. అలాగే ఈ పుస్తకంలో చాలామంది ప్రముఖుల గురించిన విశేషాలు తెలియజేశారు.
ఇక శుభకార్యాలు అంటే ముఖ్యంగా పెళ్లిళ్లు జరిగే విధానం ప్రత్యేకంగా వివరించారు. విందు భోజనాలు నిజంగా ఒక ప్రహసనం చెప్పుకోవచ్చు. ఇప్పటిలాగా ‘కేటరింగ్’ పద్ధతి లేదు. వంటలకు ప్రత్యేక టీమ్ ఒకటి ఉండేది. ఇప్పటిలా నాజూకు తిళ్లు కాదు. అందరూ శ్రమజీవులే కాబట్టి లొట్టలేసుకుంటూ తినేవారు.
ఆ క్రమంలో మానవజాతి పరిణామం, విశ్వ రహస్యాలు స్పృశిస్తూ చెప్పిన తీరు బాగుంది. ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరికీ తమ స్వగ్రామం పట్ల ఆసక్తి కలగటమే కాక, తమ ఊరి గురించి అందరికీ తెలియజేయాలనే ఆలోచన కూడా రేకెత్తిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఆ గ్రామంలో పుట్టి పెరిగిన ప్రముఖ కార్టూనిస్ట్, చిత్రకారులు సుభానీగారి రేఖా చిత్రాలు ఆ ప్రాంతం యొక్క దర్పాన్ని ప్రదర్శిస్తూ పుస్తకానికి మరింత సొగసును అద్దారు.

-ఎన్.రాజశేఖర్‌రెడ్డి