అక్షర

2016 సంవత్సర కవిత్వ సారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వం-2016
సంపాదకులు: దర్భశయనం శ్రీనివాసాచార్య
పేజీలు: 192
వెల: రూ.100/-
ప్రతులకు: ప్రముఖ
పుస్తక కేంద్రాలలో

దర్భశయనం శ్రీనివాసాచార్య సంపాదకత్వంలో వెలువడిన 2016 కవితా సంకలనమిది. 2015లో కూడా దర్భశయనం ఇలాంటి కవితా సంకలనం తెచ్చారు. కవిత్వం పట్ల
ఆయనకున్న ప్రేమ వల్ల దాదాపు అరవై మంది రెండు రాష్ట్రాల కవుల కవిత లందులో
వున్నాయి. యిందులో పేరున్నవాళ్లు, కొత్త కవులు వున్నారు. కవిత్వం వాడని తీగలా సాగుతోందనడానికి ఈ సంపుటి వుదాహరణ.
ఇందులో సామాజికమయిన, వ్యక్తిగత అనుభూతులు మనకు తటస్థపడతాయి. కవుల ఆనందాలు, విషాదాలు వున్నాయి. సున్నితమయిన కవులు అన్యాయాల పట్ల ఆగ్రహోదగ్రులవుతారు. అఫ్సర్ రోహిత్‌పై, బాలసుధాకర్ వౌళి ‘కల్బుర్గి’పై రాసిన ఆవేదన నిండిన కవితలున్నాయి.
అద్భుత అభివ్యక్తితో ఆశ్చర్యానికి గురిచేసే సత్యగోపి వంటి లేత కవుల కవితలు మనల్ని ఆకర్షిస్తాయి.
‘తడిలేని కన్నీళ్లను నింపుకోగలిగే గదొకటుంటుంది
పెచ్చులూడిన దేహం లాంటి నిర్మానుష్యమైన గది
ఎవ్వరూ లేనప్పుడు తూనీగ చప్పుళ్లను మింగేసే నిశ్శబ్ద గది!’
మన ఊహలకి, యింత సున్నితమయిన భావాలకి అక్షర రూపాన్నిచ్చే కవితల్ని చదివి ఆశ్చర్యపోతాం.
కోడూరి విజయకుమార్ ‘జీవం వున్న ఒకే ఒక్క కవితా వాక్యం కోసం పరితపిస్తే...
...ఒక్కొక్క వాక్యానే్న ఆవాహన చేసుకుంటూ
రాత్రంతా మేల్కొని వుంటాను...’ అంటాడు.
ఇందులో కవులందరూ కవిత్వం కోసం జీవించేవాళ్లే. అక్షరాన్ని ఆరాధించేవాళ్లే!
యింత మంచి సంకలనం తెచ్చినందుకు సంపాదకుల్ని తప్పక అభినందించాలి.

-సౌభాగ్య