అక్షర

కాళన్న ఆలోచనా కవచాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుద్ధ కవచం
తెలంగాణా భాషా
సాహిత్యాలపై కాళోజీ గొడవ
-ఆచార్య జయధీర్ తిరుమలరావు
వెల: రూ.40
ప్రతులకు: సాహితీ సర్కిల్
402, ఘరోండా
అపార్ట్‌మెంట్స్
ఓయు ప్రధాన ద్వారం వద్ద
ఒకటవ సందు, డిడి. కాలనీ
హైదరాబాద్-500 007.

ప్రతిపక్షం అనేది శత్రు పక్షం కాదు. అది పాలక వర్గానికే కాదు, యావత్ ప్రజాస్వామ్యానికీ నిర్మాణాత్మక పాత్ర వహించగల రక్షక కవచం. ప్రజోపయోగ ఆలోచనా మార్గదర్శక వ్యవస్థ. ప్రజాకవి అటువంటి పాత్ర వహించగలవాడని కవనంలో, జీవనంలో నిరూపించి పరిమళించిన కవి కాళోజీ.
కాళోజీ భౌతికంగా మరణించినప్పుడు ప్రజాశోక సముద్రాల ఘోషల మధ్య తిరుమలన్న ‘కాళన్న మరణంతో తెలుగు సాహిత్యం ఒక ప్రజా కవిని; రాకీయ రంగం ఒక ప్రతిపక్షాన్నీ కోల్పోయిందనడం అక్షరాలా నిజం.
అనేక అంశాలలో నిక్కచ్చిగా సూటిగా పోలికలేని భంగిగా చెప్పిన ఆ ప్రజాకవి భాషా విషయంలో, తెలంగాణా భాషా విషయంలో, సాహిత్యాంశాల్లో దూసుకొచ్చిన విప్లవ భావాలు వెల్లడిచేసే రూప విధంగా చిన్నదీ భాషా భావజాల విషయంగా పెద్దదీ అయిన పుస్తకం, ఈ యుద్ధ కవచం.
ఒక ప్రవేశిక, నాలుగు వ్యాసాలతో ముప్పై ఒక్క పుటలు; అనుబంధంలో స్ఫూర్తిదాయకమైన కాళోజీ కవితలు ఎనిమిదింటితో పద్నాలుగు పుటలు - ఈ పుస్తక భౌతిక రూపం.
‘్భష కూడా యుద్ధ క్షేత్రమే’ అనే ముందు మాటల్లో డా.ఎ.కె.ప్రభాకర్ కొన్ని అంశాల విచికిత్స చేస్తూ, ‘ప్రజా దృక్పథంతో భాషని సామాజిక శాస్త్రాల వెలుగులో అధ్యయనం చేస్తున్న జయధీర్ వంటి భాషావరణ వేత్తలు కాళోజీ ఆకాంక్షకీ ఆలోచనలకీ ఆశయానికి, ఆచరణకీ కొనసాగింపే. భాషా క్షేత్రంలో పోరాటం ఆగలేదు. యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే భాషా క్షేత్రంలో రాజకీయ పోరాటం చేయాలంటే శస్తధ్రారులం, శాస్తధ్రారులం కావాలి. అక్షర సైనికులం కావాలి. అందుకు సన్నద్ధం చేయడానికి ప్రజల భాషపై కాళోజీ ఆలోచనల్ని సరైన నూతన దృక్కోణం నుంచి ఆవిష్కరించిన ఈ చిన్ని పొత్తం యుద్ధ కవచంలా దోహదపడుతుందనే ఆశావాదాన్ని వ్యక్తం చేశారు.
‘ప్రపంచ తెలంగాణా తెలుగు మహాసభలు ఎప్పుడు..’ అనే ప్రథమ వ్యాసంలో ‘రెండు కొత్త రాష్ట్రాలలో రెండు తెలుగు భాషలు చావగొట్టబడుతున్నాయి. విద్య, న్యాయ, పరిపాలనా రంగాలలో తల్లినుడికి అవమానం జరుగుతోంది’ అన్నారు. (విద్య విషయంలో ఒకటి నుండి పనె్నండు తరగతుల వరకు విధిగా తెలుగు బోధించాలనే నిర్ణయం తీసుకొన్నందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందనీయులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా వారు కూడా ఇట్టి నిర్ణయం తీసుకోవాలి.)
ఈ వ్యాసంలో తిరుమలరావు ‘కాళోజీ పేరుతో తెలంగాణా భాషా దినోత్సవం జరిపిన దొరతనం ప్రపంచ మహాసభలను తెలంగాణా మహాసభలని కాక తెలుగు మహాసభలని జరపడాన్ని దృఢంగా విమర్శించారు. ముఖ్యమంత్రిగారికి ఈ అంశంలో తెలియజెప్పవలసిన బాధ్యత భాషా సంస్కృతుల శాఖలు, పెద్దలు, పెద్దలపై ఉంటుందని కూడా సూచించారు. ఓరుగల్లులో కాళోజీ కళాకేంద్రం మూడేళ్లుగా నత్తనడకగా నడుస్తోందని, పనులు వేగవంతం చేయాలని మంచి సూచన చేశారు.
‘్భషా సాహిత్యాల యుద్ధ కవచం కాళోజీ కవిత్వం’ వ్యాసంలో పరిశోధకులైన తిరుమలరావు ‘తెలంగాణా భాష కోసం తెలంగాణీయులు ఎన్నో శతాబ్దాల నుండి పరితపిస్తున్నారు. కాకతీయ సామ్రాజ్యానంతరం మొగలులు, ఢిల్లీ సుల్తానులు, గోలకొండ నవాబులు, అసఫ్ జాహీల కాలంలో.. తెలుగు శుష్కించింది. రాజ్య భాషగా, పాలనా భాషగా, బోధనా భాషగా, ఆస్థాన భాషగా ఏనాడూ గుర్తింపు పొందలేదు. సంస్కృతం, అరబ్బీ, పర్షియన్, ఉరుదూ, ఆంగ్ల భాషలలో మాత్రమే పాలన జరిగింది’ అన్నారు. రాష్ట్ర అభిలేఖాగారంలో 12వ శతాబ్దం నుండీ ఉన్న ప్రాచీన పత్ర పరిశోధన చేసి మరీ అన్నారు. కేవలం వీళ్లు ఉద్యోగాలు, ఆర్థికాంశాల గురించి మాత్రమే తెలంగాణా సాధించుకోలేదు. సంస్కృతికి ప్రాణభూతమైన తెలంగాణా భాష గురించి కూడా అనేది రావు నాట బలికారు. తెలంగాణ రచయితల వేదికను నిర్వహిస్తున్న ఈ రచయిత పోరాటాల ఫలితమైన తెలంగాణా ప్రభుత్వాన్ని ఇది మా ప్రభుత్వం అని భావిస్తూనే కాళోజీ బాటలో తన సకారణ మనస్తాపాలను దొరతనానికి మార్పు కోరిక చెబుతున్నారు. రచనలనే ప్రజావేదికలపై ఆలోచించవలసిందిగా ప్రజా సమూహాలను నివేదించుకుంటున్నారు.
తిరుమలరావు ఆవేదనలో ఆలోచనలో నిజాయితీకి ఈ వాక్యాలు చూడండి. ‘తెలంగాణ సమరశీలురు’ తెలంగాణా భాషకి జరిగే అవమానాన్ని తట్టుకోలేక పాటల్లో, నినాదాల్లో, ధర్నాల్లో, ఉపన్యాసాల్లో రచనల్లో చివరకు ఆత్మహత్యల లేఖల్లో తెలంగాణా భాషని ప్రతిధ్వనింపజేశారు’ అంటూ ‘ఇప్పటికీ తెలంగాణా ముఖ్యమంత్రి సహజంగా తెలంగాణా భాషలోనే చక్కగా మాట్లాడతాడు, ఉపన్యసిస్తాడు. తన భాషని మరువలేదు. తన యాసని విడువలేదు’ అని మెచ్చుకోలు పలుకుతూనే ‘కాని తెలంగాణాలో అది ప్రతిధ్వనించడం లేదు’ అనే తన ఆవేదనని వెల్లడించారు.
ఈ పొత్తంలోని మొత్తం నాలుగు వ్యాసాలూ ముఖ్యమైనవే అయినా ఈ భాషా సాహిత్యాల యుద్ధ కవచం - కాళోజీ కవిత్వం’ వ్యాసం గ్రంథ ప్రాణ ప్రదంగా భాసిస్తోంది.
గిడుగు రామమూర్తి వేడుక భాషా వాదులతో చేసిన వాడుక భాషా సమరం చరిత్రాత్మకం పండితులతో ఎన్ని యుద్ధాలు. వీరేశలింగం వంటి సంఘ సంస్కర్త సైతం భాషా సంస్కరణలకి అంగీకరించడంలో ఎంతో ఆలస్యమైంది. అటువంటి నేపథ్యాలలో వాడుక భాషా లక్షణవేత్తగా, ప్రచారకునిగా గిడుగు వాడుక భాషకి గొడుగుగా నిలిచాడు. గిడుగూ, కాళోజీ ఇద్దరూ మనకు ఆదర్శ శక్తులు. కాళోజీ ప్రధానంగా కవి. ఆ కవిలో తెలంగాణా భాషా లక్షణవేత్తే కాకుండా లక్ష్య ప్రబోధకుడున్నాడు. ప్రగతిశీల సామాజిక ప్రజా సమరశీలి ఉన్నాడు. ఆధునిక వాదాల నేపథ్యం రక్తగతంగా కలిగి వున్నాడు.
తేటగీతి ఛందస్సు ఆచ్ఛాదనను కూడా వీడి, వేమన్నగాని కాళన్నగా అవతరించాడా అనిపిస్తుంది. పాటల్లో ప్రజా కవులుండడంలో ఆశ్చర్యం లేదు. కానీ వచన కవిత్వాన్ని పాటకైతలకు దగ్గరగా అంత బలంగా చెప్పి ప్రజాకవి అని నినదింపజేసుకున్న ఘనత కాళోజీది. దానికి కారణం - అట్టడుగు ప్రజా సమూహాలతో ఆయన మమేకత్వం. అటువంటి మహనీయుడు కాళన్న మాటలమ్మ గుడి చెంగట తెలంగాణా భాషా సాహిత్యాలపై ఎదపరచి రాసిన కైతల మూలాల గుట్టుల్ని లోతట్టు అంశాలను తిరుమలన్న తన విశే్లషణలతో ఇచ్చిన తీరు ప్రశంసనీయం. కాళోజీ నా గొడవ ఆయనది కాక ప్రజలది ఎల్లా అయిందో ఇందులో తిరుమలన్న గొడవలు కూడా ప్రజలకి చేరువైనవే.
భాషా సాహిత్య సంస్కృతుల విషయంలో పాలక వర్గాలలో మార్పులు, ప్రజల ఆలోచనా విధానాలలో మార్పులు రావడానికి, భౌతిక హింసకి దూరమైన ఒక విధమైన తీవ్రవాదం అవసరమేమో అనిపిస్తుంది. ఇందుకూ కాలోజీ ఆద్యుడన్నది ఈ వ్యాసంలో ఇచ్చిన కాళోజీ కైతల ఉటంకింపులే జవం, జీవంగల సాక్ష్యాలు. నగ్నముని అన్నట్లు ‘ఊహల్లో వ్యూహాలు, వ్యామోహాలు లేని వ్యక్తి కాళోజీ కనకే ‘ఆంధ్రుడా!’ అనే కవితలో ఏ భాషరా నీది/ ఏమి వేషమురా/ ఈ భాష ఈ వేషమెరి కోసమురా’ అని ప్రజల్నే ప్రశ్నిస్తూ ‘నీ భాషదీనతకు నీ వేష దుస్థితికి, కారకుడవు నీవెయని కాంచవెందుకురా?’ నఅనరు. అవసర సందర్భాలలో ‘నీకు సిగ్గులేదా? నీ బతుకెందుకురా’ అని ప్రజల్ని ఉద్బోధ చేశారు. అవసరమైతే పాలక వర్గాల్ని నిరసించడం ఎంత ముఖ్యమో.. ప్రజల్ని చైతన్యపరచడం కూడా కవికి అత్యవసరం అని ఇందులోని కవితా వాక్యాలు పరోక్ష ప్రబోధం చేస్తాయి. బతుకుకు బాసకు అశాంతి ప్రబలితే అదే కాళేజీ అశాంతి అనడం అత్యంత సహజం. కొందరు తెలంగాణా కవులు కూడా తెలంగాణా భాషలో ఒకనాడు రాయకపోవడానికి కారణం పాలక వర్గాల ప్రభావమని తిరుమలరావు అభిప్రాయపడ్డారు. కాళోజీ కవితల్లో మాండలిక పదాలు ఎలా కవిత్వీకరించారో చెప్పడానికి పదకొండు మాటల్ని పేర్కొన్నారు. కాళోజీ అన్యధా శరణం నాస్తి’ కవితలు కాళోజీ ‘రెండున్నర జిల్లాలది/ దండి బాస అయినప్పుడు/ తక్కినోళ్ల నోళ్ల యాస/ నొక్కి పెట్టబడ్డప్పుడు ప్రత్యేక రాష్ట్రంతోబాటు ప్రత్యేక తెలంగాణా భాషా వాదం కూడా ఉందనేది ఇప్పుడెందుకు మీరుస్తున్నారనేది తిరుమలరావు వేస్తున్న సూటి ప్రశ్న. భాషను ప్రేమించే తత్త్వాన్ని నేర్పిన కాళోజీకి జేజేలు పలుకుదాం అనేది ఈ వ్యాసాంత మంగళ వాక్యం. ‘కాళోజీ చెప్పిన కరపత్రం’ వ్యాసం ఇది. 1959లో ఎనిమిది పుటల నికర భావాల కరపత్రం భారతానికి పదమూడేళ్ల వార్షిక ఉత్సవ సందర్భాన కాళోజీ చెప్పిన మాటలు తొలుతగా నా గొడవగా వచ్చిన వైనం, వౌఖిక లేఖన రూపాల్లో రావడం వంటి అంశాలను స్పృశించారు. నిజానికి ఈ కరపత్రం కాళోజీ కవిలోని సృజనాత్మకతకు నిలువెత్తు అద్దం. జాషువా ‘స్వయంవరం’ ఖండకావ్యం గొప్ప ఖండ కావ్యం. స్వరాజ్య బాల పుట్టింది. తాత (గాంధి) చనిపోయాడు. బిడ్డ ఏడ్చింది. పెద్దదైంది. స్వయంవరం చాటించారు. ఏలుకునే నాథుడే కరువయ్యాడు అనేది ఇతివృత్తాంశం.
ఈ కాళోజీ కరపత్రంలో - మూగ ప్రజానీకం, సామ్రాజ్యవాద పిశాచాల వాతపడిన జనం, ఈశ్వరాంశతో కాంగ్రెస్‌గా అవతరించింది. అది సామ్రాజ్య విశ్వాన్నా పారదోలింది. కార్యం పూర్తయింది. కాంగ్రెస్‌లో అవతారాంశ మాయమైంది. దైవాంశరహితమైన సంస్థ భౌతిక శరీరానికి అంత్యక్రియల్ని ఉద్దేశించారు. కాంగ్రెస్ నాయకులు అంత్యక్రియలు వద్దన్నారు. రాజకీయ వ్యాస భగవానుడు ‘కాంగ్రెస్ అవతారం చాలించాక శవం మీకు ఎందుకూ’ అన్నాడు. మేమింత మంది వుండగా శవం కుళ్లదు. పన్నీరు కాల్వలు కట్టించి మురగకుండా చూస్తామన్నారు. శవభక్తి ఆవహించిన శిష్యులుల అంత్యక్రియలు జరపలేక రాజకీయ వ్యాసుడు పాపానే్న ఒడిగట్టుకుని ప్రాయశ్చిత్తంగా ఆత్మార్పణం చేసుకున్నాడు. తిరుమలరావు ఇరవై వేల కరపత్రాల చారిత్రక నిధికి ప్రజా వారసుడు.
కాళోజీ సృజన శక్తికి, సామాజిక దేశభక్తులకు నిదర్శంగా నిలిచే ఈ కరపత్రాన్ని ఒక కరదీపికగా విడుదల చేయాలి.
సరైన సమయాల్లో ప్రభుత్వాలను హెచ్చరించాలనే కాళోజీ పాఠాలకు అనుగుణంగా ఉంది ఈ పుస్తక ప్రబోధాత్మ. ‘కాలోజీ వ్యాకరణం రావాలిప్పుడు’ వ్యాసం ఎన్నో ఆలోచనల ఫలం. ‘అతనిచే తిట్టుతిన్న నాయకులే అతడి వ్యక్తిత్వానికి మురిసిపోయార’ని రావు అనడం యధార్థం. కీ.శే.పి.వి. నరసింహారావు కాళోజీ గురించి ‘చెడు చేసే నాయకులకు కాళోజీ ఒక భూతం వంటి వాడన్నా’రు. దోపిడీకి ప్రాంతీ, ప్రాంతేతరం లేదన్న కాళన్న మాటలకు ‘మార్క్స్’ వేయని ప్రజలుంటారా? తెలంగాణా భాషా స్వరూపం తెలియకుండా తెలంగాణా భాషా దినోత్సవాన్ని ప్రకటించడం వల్ల ఉపయోగం ఎంత అనే జయధీర ప్రశ్న అలాగే ఉండిపోయింది.
కాళోజీ రచనలే వ్యాకరణాలు అని మనకు దిక్సూచులు కావాలనే తపన నడకలకు తెలంగాణా కలలకు దారులు చూపాలి.
కాళోజీ భాషా తాత్త్విక లక్షణాల్ని వ్యాసాల్లో ఇచ్చి లక్ష్యప్రాయ కవితలను కూడా ఇవ్వడంలో తిరుమలన్న వివేచన ప్రయోజనకరం.
ఈ పుస్తకం యుద్ధ కవచం. ఇది కాళోజీ నారాయణ కవచం - అనవసరపు తొడుగుల్ని తీసేసుకోమని చెబుతూ తొడుగుతున్నారు తిరుమలరావుగారు. శాంతియుత భాషా సమర శీలులారా! యుద్ధ కవచాల్ని తొడుక్కోండి.

-సన్నిధానం నరసింహశర్మ