అక్షర

సాహిత్య తోరణాలు (పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్య తోరణాలు
-మువ్వల సుబ్బరామయ్య
వెల: రూ.120/-
ప్రతులకు: జయంతి
పబ్లికేషన్స్
కార్ల్‌మార్క్స్ రోడ్
విజయవాడ - 520 002
89782 61496

సాహిత్య తోరణాలు పేరిట మువ్వల సుబ్బరామయ్యగారు అందిస్తున్న సంపుటి ఇది. గతంలో కూడా మువ్వల అనేక సాహిత్య సంబంధ అంశాల మీద గ్రంథాలు రాశారు. ఇందులోగల తొలి రెండు వ్యాసాలు సాహిత్య సంబంధితమైనవే అయినా కొంచెం భిన్నం. మొదటిది సాహితీ భోజనాలు. రెండవది సాహితీ కలహ భోజనాలు. ఈ రెండూ రుచిని, అభిరుచిని పెంపొందించేవిగా ఉన్నాయి. సుప్రసిద్ధ సాహితీవేత్తలు భోజనం గురించి ఏం రాశారో ఉటంకిస్తూ అవసరమైన చోట రచయిత ప్రమేయం కల్పించుకుని సంక్షిప్తంగా వ్యాఖ్యానిస్తారు. మిగిలిన వాటిల్లోనూ ఈ లక్షణం కనిపిస్తుంది. సాహితీమూర్తుల భోజన ప్రియత్వంతోపాటుగా, వారు భోజనం చేసేందుకు పడ్డ అగచాట్లు, ఇబ్బందులు వారివారి జీవిత అనుభవాల్లోంచి వెలికితీసి ముందు పెట్టారు. ఇవి గొప్ప సాహితీమూర్తుల వ్యక్తిత్వ విశేషాలను తెలుసుకునేందుకు దోహదపడతాయి. భోజనాల గురించి ఎన్ని విశేషాలు పేర్కొన్నారో సాహితీ కలహ భోజనాల గురించి అన్ని విశేషాలు తెలిపారు. ఇవి చదువుకోవడానికి హృద్యంగా అనిపిస్తాయి. మంచి పరిశోధకుడు ఈ రెండు విషయాల మీద పరిశోధించాలే గాని ఎన్నో అంశాలు సాహిత్య ప్రియులకు విందు భోజనంగా ఆవిష్కరించే వీలుంది.