అక్షర

ఆహ్లాదప్రద అవధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శతావధాన భారతి’
సంపూర్ణ శతావధాన పద్యాలు;
అవధాన కవి: రాంభట్ల పార్వతీశ్వర శర్మ;
పుటలు: 72, ధర: రూ.50
ప్రచురణ: శ్రీలలితాపీఠం, లలితానగర్, విశాఖపట్నం
ఫోన్ నెం: 0891-2721177;
సెల్ నెం.9247859580
---

విశాఖపట్నంలో రాంభట్ల పార్వతీశ్వరశర్మగారు నిర్వహించిన తన శతావధాన పద్యాల గ్రంథం. ఇందులో సమస్యలు, దత్తపదులు, వర్ణనలు అనే మూడు అంశాల కింద మొత్తం 75 పద్యాలున్నాయి.
‘కవిత కనరాదు తిక్కన కవితలోన’అన్న సమస్యాపూరణ పండిత జనరంజకంగా ఉంది. సాధారణం గా ఇలాంటి సమస్యను కుకవిత కనరాదు... అనో, రస హీన కవిత కనరాదు..... అనో చాలా తేలిగ్గా, అలవోకగా పూరించి అయింది అనిపిస్తాడు ఏ అవధానియైనా, కానీ శర్మగారు మాత్రం ‘‘నిత్యసాధక విద్యార్థి ప్రత్యయముల/ శేష షష్ఠికి ‘యొక్క’ వశేషమమరు/ కవిత కనరాదు తిక్కన కవితలోన/ సవ్యవౌను ‘నిర్ధారణ షష్ఠి’ నెపుడు’’ అంటూ వ్యాకరణ శాస్త్ర సంబంధమైన రెండు సూత్రాలను పద్యంలో గర్భస్థం చేస్తూ పూరించారు. రాముని యొక్క గుణములు, నాయొక్క మిత్రుడు, వానియొక్క తమ్ముడులాంటి సంబంధార్థక షష్ఠీ సమాస పదాలకు (శేషషష్ఠీ సమాస పదాలకు) ‘యొక్క’ వస్తుంది మధ్యలో ప్రత్యయంగా, కానీ ‘కవిత’అనే గుణ, క్రియల విశేషణాలతో ‘నిర్థారణషష్ఠీ’ సమాసం చేసేటప్పుడు - లేక- చెప్పేటప్పుడు ‘లోపల (లోన)’అనే ప్రత్యయం మాత్రమే వాడాలి. ‘తిక్కన కవితలోన’ అనాలి. ‘యొక్క’అనే దానికి మరో రూపమైన ‘కు’అనే ప్రత్యయం కూడా వాడకూడదు. ‘కవిత్వానికి తిక్కన’ అనటం కంటే కవిత్వంలో (కవిత్వం విషయంలో) తిక్కనను చెప్పుకోవాలి అనటం తెలుగు నుడికారంతో సహజ సుందరంగా ఉంటుంది. ఇలా ఇక్కడ ‘శేష షష్ఠికి యొక్క యునగు’, ‘నిర్ధారణ షష్ఠికి లోపల వర్ణకంబగు’అనే వ్యాకరణ సూత్రాలను అనువర్తిస్తూ ‘కవితకు’అనరాదు; ‘కవితలోన’ అనటమే సవ్యము అంటూ సమస్యాపూరణ చేయటం పండిత కవియైనవాడు చేసే ఒక కవితా సాంకేతిక శిల్పం (పొయెటిక్ టెక్నిక్).
‘సరి’, ‘గమ’, ‘పద’, ‘నిస’ పదాలతో భారతార్థంలో పూరించిన ‘గోకుల వాస! రిపుల్గల/ రే కనగ? మహాత్ములుండిరీ కురుభూమిన్!/ నీకను నాపద దీర్చుట/ నాకగునే హాని సలుప? నారాయణుడా!’ అన్న దత్తపదిలో పృచ్ఛికుడిచ్చిన సంగీత స్వర పదాలు వేరే అర్ధంలో చోటుచేసుకోవటం;
సచిన్, ధోని, విరాట్, వార్న్ అనే క్రికెట్ క్రీడాకారుల పేరులు ‘వ్యాస! చిన్మయ రూప! నీ వ్రాత మహిమ/ రమ్యముగ గంటి నేను విరాట్స్వరలూపు!/ చాలునదియ; యధోనిధులేల? ననుచు/ నిష్ఠ‘జైమిని’ వేద వార్నిధిమధంచె’అనే పద్యంలో విరుపులతో సమర్ధంగా వాడబడటం - ఇలాంటి పూరణా విశేషపు తమాషాలు చాలా ఉన్నాయి ఇందులో.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం